మరిన్ని చిక్కుల్లో ఐపీఎస్ సునీల్ కుమార్
విజయవాడ, అక్టోబరు 7, (న్యూస్ పల్స్)
IPS Sunil Kumar
వైఎస్ఆర్సీపీ హయాంలో కీలకంగా పని చేసి ప్రస్తతం పోస్టింగ్ లేకండా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గత జూలైలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇవి ఆలిండియా సర్వీసు నిబంధనలకు విరుద్దమని ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. వీటిపై పదిహేను రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులుజారీ చేసింది. పీవీ సునీల్ కుమార్ నుంచి స్పందన వచ్ిచన తర్వాత ఆయనపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పీవీ సునీల్ కుమార్ ఎక్కువ కాలం సీఐడీ డీజీగా పని చేశారు.ఆ సమయంలోనే రఘురామకృష్ణరాజును రాజద్రోహం కింద సుమోటోగా కేసులు పెట్టి అరెస్టు చేశారు. రఘురామ కృష్ణరాజు పుట్టిన రోజునే అరెస్టు చేశారు. అదే రోజున ఆయనను గుంటూరు సీఐడీ ఆఫీసుకు తరలించి ధర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై రఘురామకృష్ణరాజు పోరాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఆయన ఏపీలో అడుగు పెట్టలేకపోయారు. ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత ఆయన తనపై జరిగి నదాడి విషయంలో గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీఎస్ సునీల్ కుమార్ కూడా కీలకంగా వ్యవహరించారని తేలడంతో పాటు ఆయన దాడి చేశారన్నదానికి సాక్ష్యాలు కూడా సేకరించారన్న ప్రచారం జరుగుతోంది. కేసు నమోదు చేసినప్పుడు పీవీ సునీల్ సోషల్ మీడియాలో స్పందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఇవి కూడా వైరల్ అయ్యాయి. పీవీ సునీల్ కుమార్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయితే ప్రభుత్వం ప్రాసెస్ ప్రకారం ఆయనపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇప్పటికి అభియోగాల నమోదు ప్రక్రియను పూర్తి చేసి పీవీ సునీల్‌కు నోటీసులు జారీ చేశారు. పీవీ సునీల్‌కు ప్రభుత్వం పదిహేను రోజుల సమయం ఇచ్చింది. ఆ సమయంలోపు ఆయన ఇచ్చే వివరణను బట్టి చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే పీవీ సునీల్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో హిందూ మతానికి వ్యతిరేకంగా.. రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని కేంద్రం దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే పలు అంశాల్లో వివాదాస్పదమైన ఆయన తీరుపై టీడీపీ నేతలు చాలా సార్లు ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపడిన పీవీ సునీల్‌పై పదిహేను రోజుల తర్వాత సస్పెన్షన్ వేటు వేసే అవకాశాలు ఉన్నాయని.. ఆయనకు మరోసారి పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు.
వైసిపి Vs కూటమి.. ఎవరి గ్రాఫ్ పెరిగింది..?| WHOSE GRAPH INCREASED KUTAMI VS YCP ..?