International experts examining Polavaram | పోలవరాన్ని పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణులు | Eeroju news

International experts examining Polavaram

పోలవరాన్ని పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణులు

ఏలూరు,జూలై 2, (న్యూస్ పల్స్)

International experts examining Polavaram

ఏపీలోని పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల నిపుణులు విజిట్ చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న నిపుణులు.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. పోలవరం ప్రాజెక్టుపై ఏర్పడిన అనిశ్చితి పరిస్థితులు తొలగించేందుకు అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దించింది కేంద్రప్రభుత్వం.

డిజైన్ రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి డిజైన్ ఏజెన్సీ అఫ్రి సాయం తీసుకుంది. దీనికితోడు అమెరికాకు చెందిన డేవిడ్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ బోన్నెల్లీ, సీస్ హించ్ బెర్గర్‌ వంటి నిపుణులు ఢిల్లీకి చేరుకున్నారు. పోలవరానికి ఎదురైన సవాళ్లపై వీరు అధ్యయనం చేయనున్నారు. అంతర్జాతీయ డ్యామ్ భద్రత నైపుణ్యం, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, స్ట్రక్చరర్ ఇంజనీరింగ్, జియో టెక్నాలజీ విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం చెందిన వ్యక్తులు కావడంతో వీరిని ఎంపిక చేసింది కేంద్ర జలవనరుల సంఘం.

ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, కేంద్ర జల వనరుల సంఘం నిఫుణులు, సీఎస్ఎం ఆర్ఎస్ సంస్థ, మెఘా కంపెనీ, అంతర్జాతీయ డిజైన్ సంస్థ అఫ్రి వంటి ప్రతినిధులతో భేటీ నిర్వహించ నున్నారు. శక్తి సామర్థ్యాలున్న ఏజెన్సీలతో నిఫుణులు చర్చించనున్నారు. దీని ప్రకారం ఎక్కడ డ్యామేజ్ జరిగింది? ఏడాదిలో ప్రాజెక్టుకు వచ్చే నీరెంత? ప్రాజెక్టు విస్తీర్ణత ఎంత? ఇప్పటివరకు ఎంతశాతం పూర్తి అయ్యింది? ఒకవేళ ఏమైనా రీడిజైన్ చేస్తే దానికి ఆల్టర్‌నేటివ్ ఏంటి అన్నదానిపై చర్చించనున్నారుఇక్కడ నిర్మాణ సంస్థ చెప్పిన డీటేల్స్ పరిశీలించిన తర్వాత కేంద్ర జలవనరుల సంఘం అధికారులతో చర్చించనున్నారు.

ఆ తర్వాత మరో రెండురోజులపాటు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టులోని ఎగువ కాఫర్ డ్యామ్ నుంచి వీరి అంచెలంచెలుగా ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ప్రాజెక్టు మొదలుపెట్టిన నుంచి ఇప్పటివరకు ఇచ్చిన రిపోర్టులను స్టడీ చేయనున్నారు అంతర్జాతీయ నిఫుణులు.దీని తర్వాత డీటేల్స్‌ను కేంద్రానికి ఇవ్వనున్నారు. ఎంత మేరా ఖర్చు జరుగుతుంది. ఎన్నిరోజుల్లో పూర్తి చేయాలనేది అన్ని డీటేల్స్‌తో కలిసి రిపోర్టు ఇవ్వనున్నారు. నివేదికను ఈ ఏడాది డిసెంబర్ చివరకు ఇస్తారని నేతలు చెబుతున్నమాట.

International experts examining Polavaram

 

Polavaram’s hopes are on the Centre | కేంద్రంపైనే పోలవరం ఆశలు | Eeroju news

Related posts

Leave a Comment