Interesting Suspense Thriller Movie ‘Viraji’ with Social Message – Directed by Adyant Harsha | సోషల్ మెసేజ్ ఇచ్చే ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘విరాజి’ – దర్శకుడు ఆద్యంత్ హర్ష | Eeroju news

Interesting Suspense Thriller Movie 'Viraji' with Social Message - Directed by Adyant Harsha

సోషల్ మెసేజ్ ఇచ్చే ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘విరాజి’ – దర్శకుడు ఆద్యంత్ హర్ష

 

Interesting Suspense Thriller Movie ‘Viraji’ with Social Message – Directed by Adyant Harsha

 

'విరాజి' - దర్శకుడు ఆద్యంత్ హర్షమహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు దర్శకుడు ఆద్యంత్ హర్ష
– మా నేటివ్ ప్లేస్ నెల్లూరు. తిరుపతి లో బయోటెక్నాలజీలో బీటెక్ చేశాను. ఆ తర్వాత ఫారిన్ వెళ్లి బయోటెక్నాలజీలో ఎంఎస్, పీహెచ్ డీ ఇన్ న్యూరో సైన్స్ చేశాను. అక్కడే ఫిల్మ్ మేకింగ్ లో కోర్స్ చేశాను. ఈ టైమ్ లోనే నా మూవీస్ కోసం పది కథలు రాసుకున్నాను. 2019లో ఇండియాకు తిరిగి వచ్చాను. దర్శకుడిని కావాలనేది నా కల. అదొక్కటే లక్ష్యంగా పని చేస్తూ వచ్చాను.

ఈ క్రమంలో నాకుటుంబ సభ్యులు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. ఇక్కడికి వచ్చాకు మూడు షార్ట్ ఫిలిమ్స్, 37 నిమిషాల నిడివితో ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ రూపొందించాను. ఆ ఫిల్మ్ నచ్చి ఒకరు రెండు లక్షల రూపాయల కు కొనుక్కున్నారు. అప్పుడు నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది. గతేడాది ‘విరాజి’ కథను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కు చెప్పాను. ఆయన నిర్మాత మహేంద్రనాథ్ గారికి పరిచయం. నా కథ బాగుందని వినమంటూ మహేంద్రగారికి ఆయన చెప్పడం, నేను వెళ్లి కథ చెప్పడం జరిగింది. ‘విరాజి’ కథ మహేంద్రనాథ్ గారికి బాగా నచ్చింది. ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా అని హీరోగా ఎవర్ని అనుకుంటున్నావ్ అని అడిగారు. నాకు మొదటి నుంచి ఈ సినిమా కోసం మైండ్ లో వరుణ్ సందేశ్ ఉండేవారు.  ‘విరాజి’ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ఆండీ. ఈ పాత్ర ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది. వరుణ్ యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు ఆ స్లాంగ్, బాడీలాంగ్వేజ్ బాగా సెట్ అవుతుందని అనిపించింది.

– వరుణ్ సందేశ్ ను కలిసి కథ చెప్పాను. ఆయన ఫస్టాఫ్ విని బాగుందన్నారు. సెకండాఫ్ విని గూస్ బంప్స్ వచ్చాయి మనం తప్పకుండా ఈ మూవీ చేద్దామన్నారు. అలా ‘విరాజి’ ప్రీ ప్రొడక్షన్ మొదలైంది. ఆరు నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ చేశాం. ఈ సినిమాలోని ప్రతి షాట్ ఎలా ఉండాలో ఆ షాట్ లో వాడే ప్రతి వస్తువు వివరాలు పేపర్ లో రాసుకున్నాం. ఈ సినిమాలో వెయ్యి షాట్స్ ఉంటే వాటికి వెయ్యి పేపర్స్ రెడీ చేసుకున్నాం. చిన్న బడ్జెట్ సినిమాలకు సెట్ లో ఎక్కువ వృథా లేకుండా ఉంటేందుకు ప్రతీది పేపర్ పై డిజైన్ చేసుకుని సెట్స్ మీదకు వెళ్లాం.

– సినిమా కంప్లీట్ చేశాక దాదాపు 4 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేశాం. ‘విరాజి’ అనే టైటిల్ కు నాకు అనిపించిన మీనింగ్ చీకట్లో ఉన్నవారికి వెలుగులు పంచేవాడు. ‘విరాజి’ అంటే శివుడు అని కూడా కొందరు చెప్పారు. సొసైటీలో ఉన్న కొన్ని ఇష్యూస్ ను తెరపై చూపించాలనేది దర్శకుడిగా నా దృక్పథం. ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ వంటి అంశాలు ఉన్నా…అండర్ కరెంట్ గా కొన్ని సోషల్ ఎలిమెంట్స్ చూపిస్తున్నాం. ఇప్పుడు సొసైటీలో ఉన్న ఒక కాంటెంపరరీ ఇష్యూని తెరపైకి తీసుకొస్తున్నాం. మీరు ‘విరాజి’ చూసి బయటకు వచ్చేప్పుడు ఆ పాయింట్స్ మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉంటాయి.'విరాజి' - దర్శకుడు ఆద్యంత్ హర్ష

– ‘విరాజి’ కథ లైన్ చెప్పాలంటే ఓ పది మంది కొండమీద ఉండే ప్లేస్ కు వెళ్తారు. అది మూసివేసిన పిచ్చాసుపత్రి అని తెలుస్తుంది. వాళ్లు బయటకు వచ్చి చూస్తే వాళ్ల కారు ఉండదు, మొబైల్ లో సిగ్నల్స్ ఉండవు. ఆ టైమ్ లో ఆండీ అనే వ్యక్తి వారి దగ్గరకు వస్తాడు. అతను వచ్చాక ఎలాంటి పరిణామాలు జరిగాయి అనేది ఆసక్తికరంగా సినిమాలో తెరకెక్కించాం.

– వరుణ్ ఆండీ క్యారెక్టర్ రిచ్ కిడ్. సొసైటీలో పలుకుబడి ఉన్నవారి వారసుడిగా కనిపిస్తాడు. ఎవరికీ భయపడకుండా ఉంటాడు. తలకు రంగు, చెవికి పోగు, సిగరెట్ తాగి నల్లబడిన పెదాలు..ఇలా వరుణ్ లుక్ కొత్తగా ఉంటుంది. హెయిర్ కోసం రియల్ కలర్ వేసుకుని వాడారు. అవన్నీ ఎందుకు అనే జస్టిఫికేషన్ కూడా ఈ క్యారెక్టర్ కు ఉంటుంది.  నా దృష్టిలో సస్పెన్స్ థ్రిల్లర్స్ బెలూన్ లాంటివి. దానికి ఏదైనా కాంటెంపరరీ ఇష్యూ జోడించడం గాలి నింపడం లాంటిది. అప్పుడే ఆ బెలూన్ కు బరువు ఉంటుంది. కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ తర్వాత అలాంటి పది సినిమాలు చేశాను ఎవరు చూడలేదు అని వరుణ్ అన్నారు. ఈరోజు ప్రేక్షకులకు ఏదైనా కొత్తగా కావాలి. మన సినిమా బాగుంటే అలాంటివి మరో పది వస్తాయి.

– ఏబెనైజర్ పాల్ మ్యూజిక్ చేశాడు. తన మ్యూజిక్ తో పది రెట్ల ఇంపాక్ట్ ‘విరాజి’కి తీసుకొచ్చాడు. ఈ సినిమాకు విజువల్స్ ఎంత హైలైట్ అవుతాయో, మ్యూజిక్ అంత హైలైట్ అవుతుంది. సినిమాటోగ్రఫర్ నాకెంతో హెల్ప్ ఫుల్ గా ఉన్నారు. ప్రమోదిని, బలగం జయరామ్, రఘు కారుమంచి, వైవా రాఘవేంద్ర, కుశాలీ, మలయాళీ అమ్మాయి అపర్ణ కీలక పాత్రల్లో నటించారు.

– ‘విరాజి’ సినిమా ప్రివ్యూ చూసి వరుణ్ సందేశ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా మీకూ నాకూ లైఫ్ ఇస్తుందని ఆయన ప్రశంసించారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన చిత్రమిది. థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుంది. నేను శంకర్ గారు చేసిన భారతీయుడు సినిమా చూసి సర్ ప్రైజ్ అయ్యా. ఒక సమస్యను ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాలనే ఆరోజే ఇన్స్ పైర్ అయ్యాను. నా కెరీర్ లో అలాంటి మంచి పర్పస్ ఫుల్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.

Interesting Suspense Thriller Movie 'Viraji' with Social Message - Directed by Adyant Harsha

 

Vijayashanthi Glimpses release from Nandamuri Kalyan Ram’s new movie | నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా నుంచి విజయశాంతి గ్లింప్స్ రిలీజ్  

Related posts

Leave a Comment