డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల,
Infrastructural works in double bedroom houses should be completed expeditiously District
Collector B. Satya Prasad
జగిత్యాల నూకపల్లి గ్రామం మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆన్నారు..గురువారం జగిత్యాల మున్సిపాలిటి పరిధిలో, నూకపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ 4,520 గృహములలో మిగిలిపోయిన మౌళిక వసతులైన మురికి కాలువలు, సెప్టిక్ ట్యాంక్ లు, నీటి వసతి, విద్యుత్ లైన్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 4,520 డబుల్ బెడ్ రూమ్ గృహములలో అలాట్ మరియు మిగిలిపోయిన ఇండ్లను అలాట్ చేయుటకు లబ్దిదారులను ఎంపిక చేయుటకు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్,స్థానిక శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్, హౌసింగ్,రెవెన్యూ పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, విద్యుత్ శక్తి, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జగిత్యాల పట్టముకు మంజూరు కాబడిన (4520) డబుల్ బెడు రూమ్ ఇండ్లను ఎంపిక చేసి అలాట్ చేసారని,మిగతా బ్యాలెన్స్ గృహాలము ఎంపిక చేయుటకు మీ సేవ ద్వారా అప్లికేషన్లు స్వీకరించుటకు కమిషనర్ మీ సేవ ద్వారా అనుమతి తీసుకోని అప్లికేషన్లు స్వీకరించి, వచ్చిన దరఖాస్తులను టిఎస్ వెబ్సైట్ ద్వారా మరియు జిల్లా అధికారులచే టీమ్ లు చేసి నిస్పక్షపాతికముగా అర్హులైన లబ్దిదారులను రెండు మాసములలో ఎంపిక చేయవలేనని
రెవెన్యూ,హౌసింగ్ అధికారులను ఆదేశించారు. 17 కోట్లతో మంజూరి కాబడిన మురికి కాలువల నిర్మాణము సెప్టిక్ ట్యాంక్ల నిర్మాణము మరియు గృహములకు కరెంట్ పానెల్ బొర్డ్స్ రెండు మాసములలో పూర్తి చేయవలేనని పంచాయత్ రాజ్ అదికారులను ఆదేశించారు.
14 కోట్లతో మంజురి కాబడిన వాటర్ ట్యాంక్ మరియు నీటి పైప్ లైన్లు డబుల్ బెడ్రూము గృహములతో పాటు ఇందిరమ్మ కాలనీ లో పైప్ లైన్లు నెల రోజులలో పూర్తి చేయవలేనని మిషన్ భగీరత అదికారులను ఆదేశించారు.. నూకపల్లి కాలనీ కి వెళ్ళే రహదారి ఆక్రమించుకున్న దానిని క్లియర్ చేయించాలని రెవెన్యూ అదికారులను ఆదేశించారు. కాలనీలలో పేరుకపోయిన ముళ్ళపొదలు, పిచ్చిమొక్కలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు. జగిత్యాల పట్టణములో నిర్మించిన సమీకృత మార్కెట్ ను ప్రజలకు ఉపయోగములోకి తీసుకరావాలని శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
నూకపల్లీ అర్బన్ కాలనిని అమృత్ స్కీమ్ కు టై అప్ చేయగలరని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి రెండు నెలలలో లబ్దిదారులకు అందచేయుటకు ప్రయత్నం చేయగలరని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్ అధికారులకు నిర్దేశించారు..ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు,ఆర్డీవో మధుసూదన్, రహమాన్, శేఖర్ రెడ్డి, సంపత్ రావు,ఈఈ లు జే.రాజేశ్వర్, మిళింద్, జలెందర్, డిప్యూటీ ఈఈ లు, కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్ వరందన్, ఇతర అధికారులు పాల్గొన్నారు..
Hastam Gutiki is another MLA | హస్తం గూటికి మరో ఎమ్మెల్యే | Eeroju news