ఇక స్లీపర్ వందే భారత్ | India is the sleeper vande | Eeroju news

ఇక స్లీపర్ వందే భారత్

చెన్నై, జూన్ 17, (న్యూస్ పల్స్)

India is the sleeper vande

ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఆగస్టు 15 నాటికి వందే భారత్ స్లీపర్ ట్రైన్స్  ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే వేగంగా వెళ్లే ఈ రైళ్ల ట్రయల్ రన్ త్వరలోనే చేపడతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ ట్రైన్స్ ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ఇంకో రెండు నెలల్లో పట్టాలు ఎక్కనున్నాయి.

స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలను అందించనున్నారు. మిగతా రైళ్లతో పోలిస్తే వీటిలో మెరుగైన సౌకర్యాలు ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే వందే భారత్ స్లీపర్ ట్రైన్ల ట్రయల్ రన్ పూర్తి చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి . రెండు నెలల్లోనే మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలపైకి రానుంది. ఈ రైళ్లను బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేస్తోంది.ఈ సంస్థ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో ట్రైన్‌లను అందిస్తోంది. దాదాపు 200 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఈ స్లీపర్ ట్రైన్‌లను రూపొందించినట్లు తెలుస్తోంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ ట్రైన్స్ లలో ఏసీ ఫస్ట్ క్లాస్-1, టూ-టైర్ ఏసీ 4, త్రీ టైర్ ఏసీ 11 కంపార్ట్ మెంట్‌లతో మొత్తం 16 బోగీలతో ఈ రైళ్లను తయారు చేస్తున్నారు. కేంద్రం.. ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమాయాన్ని తగ్గించేందుకు వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.ఇప్పటికే సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశ వ్యాప్తంగా వివిధ మార్గాల మధ్య సర్వీసులను అందిస్తున్నాయి. మరిన్ని మెరుగైన సదుపాయలు కల్పించడంలో భాగంగా దాదాపు 40 వేల సాధారణ కోచ్ లను అధునాతన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తరహా కోచ్‌లుగా మారుస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. 

 

హైదరాబాద్ ట్రైనీ ఐఏఎస్ లకు సజ్జనార్ అవగాహన | Sajjanar awareness for Hyderabad Trainee IAS | Eeroju news

Related posts

Leave a Comment