మహిళల్ని వేధిస్తే తాటతీస్తాం…
విజయవాడ, జూలై 25
If women are harassed we will slap them…
ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో మహిళల్ని వేధించే వారి సంగతి చూడటానికి ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మహిళలపై అనుచితమైన పోస్టులు పెట్టాలంటే ఎవరైనా సరే భయపడేలా చేస్తామని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల కాలంలో సోషల్ మీడియా ఉన్మాదులు పెరిగిపోయారని..ఎంతో మంది టీడీపీ నేతలపై దారుణమై వ్యాఖ్యలు చేశారన్నారు. అధికార పార్టీ నేతలే వారిని ప్రోత్సహించారన్నారు. ఇక నుంచి ఎవరైనా అలాంటి పోస్టులు పెడితే.. కఠిన చర్యలు ఉంటాయని ప్రకటించారు. ఇలా వేధించే వారిని కట్టడి చేయడానికి ప్రత్యేక విభాగం పెట్టాలని నిర్ణయించారు.
ఎన్డీఏపార్టీలకు చెందిన వారు కూడా మహిళపై ఎలాంటి పోస్టులు పెట్టవద్దన్నారు. రాజకీయ పార్టీలకు ఉన్న సోషల్ మీడియా సైన్యాల వల్ల మహిళా నేతలపై అరాచకమైన పోస్టులు పెట్టడం ఎక్కువైపోయింది. వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని విమర్శించిన వారందరిపై కేసులు పెట్టేవారు. అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎంతగా పరిధి దాటి పోస్టులు పెట్టినా పోలీసులు పట్టించుకునేవారు కాదు. ఈ విషయంపై అప్పటి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానితో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేతలు వంగలపూడి అనితతో పాటు గౌతు శీరిష వంటి వారు అనేక సార్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా వారు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేధింపులు ఎదుర్కొన్న వంగలపూడి అని ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంగలపూడి అనిత గురించి వర్రా రవీంద్రా రెడ్డి అనే వ్యక్తి అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెట్టేవారు. అలాగే మరికొంత మంది పెట్టే పోస్టులు దారుణంగా ఉన్నాయి. ఓ సారి అనిత.. అలా పోస్టులు పెట్టిన వ్యక్తి ఇంటికి వెళ్తే.. అనితపైనే కేసులు పెట్టారు. ఇక నుంచి అలాంటి పరిస్థితి ఏపీలో ఉండకూడదని.. ఏ పార్టీకి చెందిన నేతలపైనైనా సరే.. అసభ్య కర పోస్టులు పెట్టడానికి వీల్లేదన్నారు.
లమహిళలపై టీడీపీ, జనేసన , జనసేనలకు చెందిన వారు కూడా ఎలాంటి తప్పుడు పోస్టులు పెట్టవద్దని స్పష్టం చేశారు . తప్పు చేస్తే కూటమి కార్యక్రతలనైనా వదిలేది లేదన్నారు. ఏపీలో ఇప్పటికీ పెద్ద ఎత్తన మహిళల్ని కించ పరిచే పోస్టులు పెడుతున్నారు. దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. అందకే టీడీపీ కార్యకర్తలు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో అమలు చేసిన చట్టాలు ఇప్పుడు మారిపోయాయా అని టీడీపీ నేత వర్ల రామయ్య సోషల్ మీడియా వేదికగా డీజీపీని ప్రశ్నించారు కూడా.