ICAR is making history | చరిత్ర సృష్టిస్తున్న ఐసీఏఆర్ | Eeroju news

ICAR is making history

చరిత్ర సృష్టిస్తున్న ఐసీఏఆర్

న్యూఢిల్లీ, జూలై 17, (న్యూస్ పల్స్)

ICAR is making history

దేశంలో జనాభా రోజు రోజుకూ పెరుగుతోంది. పంటల సాగు విస్తీర‍్ణం తగ్గుతోంది. మరోవైపు వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో పంటల ఉత్పత్తి పెంపు కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్‌) కృషి చేస్తోంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేస్తోంది. వ్యవసాయ అనుబంధ పారి, పశుసంవర్ధక రంగాల్లో అనేక పరిశోధనలు సాగిస్తోంది. ఈ క్రమంలో ఐసీఏఆర్‌ వంద రోజుల్లో వంద వంగడాలు, వంద వ్యవసాయ సాంకేతికతలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఒక శాస్త్రవేత్త, ఒక ఉత్పత్తి పేరుతో ఈమేరకు కార్యక్రమం చేపట్టింది. ఐసీఏఆర్‌ 96వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగాఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తృణధాన్యాలు, నూనెగింజలు, మేత పంటలు మరియు చెరకుతో సహా 56 పంటలకు చెందిన 323 రకాలను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించనుంది. ఈ వంగడాలు 289 రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించినట్లు వెల్లడించింది.

ఈ 56 రకాల్లో 27 రకాలు బయో ఫోర్టిఫైడ్‌ రకాలు ఉన్నట్లు పేర్కొంది.కార్యక్రమంలో ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్ హిమాన్షు పాఠక్ మాట్లాడారు. ఐసీఏఆర్ సంస్థ పరిధిలోని మొత్తం 5,521 మంది శాస్త్రవేత్తలకు ఉత్పత్తి, సాంకేతికత, మోడల్, కాన్సెప్ట్ లేదా మంచి పబ్లికేషన్‌తో రావాలని లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. ప్రతీ సంవత్సరం ప్రారంభంలో, శాస్త్రవేత్త లేదా శాస్త్రవేత్తల బృందం ఉత్పత్తిని గుర్తించాలని తెలిపారు. ఐసీఏఆర్‌ శాస్త్రవేత్త లేదా సమూహం పనిని మ్యాప్ చేస్తుంది. ఇక ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఇనిస్టిట్యూట్‌ స్థాయిలో, ప్రతీ ఆరు నెలలకు ప్రధాన కార్యాలయ స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఇది సుధీర్ఘ ప్రణాళిక అని తెలిపారు. ఈ పథకం ఐదేళ్లపాటు పని చేస్తుందని పేర్కొన్నారు.

ఈ సంవత్సరం అధిక దిగుబడినిచ్చే నూనెగింజలు, పప్పు ధాన్యాల రకాలకు సీడ్ హబ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.ఇదిలా ఉండగా ఐసీఏఆర్‌ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 100 రోజుల్లో 100 కొత్త విత్తన రకాలు, 100 వ్యవసాయ సాంకేతికతలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్షు పాఠక్‌ తెలిపారు. సెప్టెంబరు మధ్య నాటికి ఈ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఐసీఏఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరుతుందని చెప్పారు.బ్రీడర్ విత్తనాల సహాయంతో సుమారు 16 మిలియన్ హెక్టార్లలో గోధుమ, 13 మిలియన్‌ హెక్టార్లలో వరి, 1.6 మిలియన్‌ హెక్టార్లలో పెర్ల్‌ మిల్లెట్‌ సహా వివిధ పంటల బయో-ఫోర్టిఫైడ్ రకాలు కింద ఉన్నాయని ఐసీఏఆర్‌ తెలిపింది.

2023-24లో పప్పు 0.50 మిలియన్‌ హెక్టార్లు, ఆవాలు 1.0 మిలియన్‌ హెక్టార్లలో సాగు చేసినట్లు వెల్లడించారు. వాతావరణ-తట్టుకునే సాంకేతికతల విస్తరణ అసాధారణ సంవత్సరాలలో కూడా మెరుగైన ఉత్పత్తి సాధించినట్లు తెలిపింది.ఇదిలా ఉంటే.. ఐసీఏఆర్‌.. 2014-15 నుంచి 2023-24 వరకు 2,593 అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల వంగడాలను విడుదల చేసింది. వీటిలో బయోటిక్, అబియోటిక్ స్ట్రెస్ రెసిస్టెన్స్ కలిగిన 2,177 క్లైమేట్-రెసిస్టెంట్ (మొత్తం 83%) రకాలు మరియు 150 బయో-ఫోర్టిఫైడ్ పంట రకాలు ఉన్నాయి.

 

ICAR is making history

 

Modi’s full-fledged visit is very important to them Russian President Vladimir Putin | మోదీ పూర్తి స్థాయి పర్యటన తమకు చాలా ముఖ్యమైనది | Eeroju news

Related posts

Leave a Comment