HYDRA | నాలుగు చెరువులతో హైడ్రా పనులు మొదలు | Eeroju news

నాలుగు చెరువులతో హైడ్రా పనులు మొదలు

నాలుగు చెరువులతో హైడ్రా పనులు మొదలు

హైదరాబాద్, అక్టోబరు 26, (న్యూస్ పల్స్)

HYDRA

రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా, తన పని తాను చేసుకుపోతోంది. రాబోయే ఆరునెలల్లో చేయబోయే టార్గెట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు చెరువులను సుందరీకరణ చేయనుంది. ప్రస్తుతం ఆయా పనుల్లో బిజీ ఉంది. హైదరాబాద్ డిజాస్టర్ రెన్సాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ-హైడ్రా దృష్టి పెట్టింది. ఓ వైపు ప్రభుత్వ భూములను కాపాడుతూనే మరోవైపు చెరువులను సుందరీకరణ చేయాలని నిర్ణయించుకుంది. తనను తానే టార్గెట్ ఫిక్స్ చేసింది.

హైదరాబాద్ సిటీలో చెరువుల పూర్వభవానికి పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తొలివిడతగా నాలుగు చెరువుల సుందరీకరణను ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేసింది. వాటిలో బాచుపల్లి- ఎర్రగుంట చెరువు, మాదాపూర్- సున్నం చెరువు, కూకట్‌పల్లి-నల్లచెరువు, రాజేంద్రనగర్- అప్పచెరువును ఎంపిక చేసింది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌లో ఒక్కో చెరువును ఎంపిక చేసుకుంది. తొలుత ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో మార్కింగ్ పూర్తి చేయనుంది. దీని కోసం నెలరోజులు కేటాయించనుంది.

తర్వాత చెరువుల చుట్టూ ఫెన్సింగ్‌, ఆ తర్వాత సుందరీకరణ ఇలా దశల వారీగా వాటి పనులు చేయనుంది.దాదాపు 200 కోట్లతో చెరువుల బ్యూటిఫికేషన్‌కు చర్యలు చేపట్టనుంది. నాన్ రియల్ ఎస్టేట్ సంస్థలకు సీఎస్ఆర్ కింద వాటిని అప్పగించాలని ఆలోచన చేస్తోంది. ఆక్రమణల నుంచి కాపాడిన చెరువుల వద్ద ఇప్పటికే సీసీ కెమెరాలతోపాటు సెక్యూరిటీ ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాదిలోపు మిగిలిన చెరువులను సుందరికరణ చేసేలా ప్రణాళికలు రచిస్తోంది.

 

నాలుగు చెరువులతో హైడ్రా పనులు మొదలు

 

Hydra | హైడ్రాకు సూపర్ పవర్స్ | Eeroju news

 

Related posts

Leave a Comment