Hyderabad:2024లో కాలం చేసిన ప్రముఖులు

Celebs who have passed away in 2024

2024 సంవత్సరం ముగియనుంది. ఈ సంవత్సరంలో భారతదేశానికి తీవ్ర నష్టం చేకూరిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాదిలోనే చాలా మంది గొప్ప భారతీయులు తమ అభిమానులకు బాధను మిగిల్చి పరలోకాలకు వెళ్లిపోయారు. చనిపోయిన ఇండియన్ సెలబ్రిటీలంతా తమ తమ రంగాలలో రాణించి లక్షలు, కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు.

2024లో కాలం చేసిన ప్రముఖులు

హైదరాబాద్, డిసెంబర్ 31
2024 సంవత్సరం ముగియనుంది. ఈ సంవత్సరంలో భారతదేశానికి తీవ్ర నష్టం చేకూరిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాదిలోనే చాలా మంది గొప్ప భారతీయులు తమ అభిమానులకు బాధను మిగిల్చి పరలోకాలకు వెళ్లిపోయారు. చనిపోయిన ఇండియన్ సెలబ్రిటీలంతా తమ తమ రంగాలలో రాణించి లక్షలు, కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు.నైపుణ్యంతో, డెడికేషన్ తో స్టార్ డం పొందారు. వీరంతా బిజినెస్, సినిమా, సాహిత్యం, సంగీతం రంగాలలో భారత సంస్కృతికి, వృత్తి నైపుణ్యానికి వన్నె తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ గొప్పవారంతా లేకపోవడంతో ఆయా రంగాలలో వారి లెగసీ మాత్రమే గుర్తుగా ఉండిపోతుంది. ఆ రంగాలలో వారు లేని వెలతి స్పష్టంగా కనిపిస్తోంది.ఈ సంవత్సరం చనిపోయిన ప్రముఖులలో ముందువరుసలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఆయన దేశభివృద్ధి కోసం, గతి తప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి అభివృద్ధి నడపడం కోసం అసామాన్యమైన కృషి చేశారు. ఆ తరువాత అందరి ఆప్తుడు, సమాజానికి విలువలతో కూడిన వ్యాపారం, మానవత్వం, కరుణ సందేశాలను అందించిన లెజండరీ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఉన్నారు. ఇండియన్ బిజినెస్ కు నైతిక విలువల జోడిస్తే రతన్ టాటా మూర్తీభవిస్తారు.రతన్ టాటా తరువాత ప్రముఖ సంగీతకారుడు, తబలా లెజెండ్ జాకీర్ హుస్సేన్ సంగీత అభిమానులకు విషాదం మిగిల్చారు. ఆయనతో పాటు క్లాసికల్ సింగర్ ఉస్తాద్ రాషిద్ ఖాన్ కూడా ఈ సంవత్సరంలోనే మరణించడం క్లాసికల్ సంగీత ప్రియులకు బాధను కలిగించే విషయం. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన గాయని శారదా సిన్హా కూడా 2024లోనే మరణించారు.పాశ్చాత్య దేశాలకు ఇండియన్ ఫ్యాషన్ ప్రాముఖ్యం తెలియజేసిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కూడా ఈ సంవత్సరంలోనే చనిపోయారు. ప్రముఖ వ్యాపారవేత్త రామోజీ రావు, ఉర్దూ ప్రసిద్ధ కవి మునవ్వర్ రాణా కూడా వారి అభిమానులకు విషాదం మిగిల్చి వెళ్లిపోయారు.
2024లో మరణించిన ఇండియన్ సెలబ్రిటీల జాబితా
మన్మోహన్ సింగ్
వృత్తి: భారత మాజీ ప్రధాని, RBI గవర్నర్
మరణించిన తేదీ: డిసెంబర్ 26, 2024
మరణానికి కారణం: వయస్సు సంబంధిత సమస్యలు
రతన్ టాటా
వృత్తి: పారిశ్రామికవేత్త
మరణించిన తేదీ: అక్టోబర్ 9, 2024
మరణానికి కారణం: వయస్సు సంబంధిత సమస్యలు
జాకీర్ హుస్సేన్
వృత్తి: తబలా మాస్ట్రో
మరణించిన తేదీ: డిసెంబర్ 15, 2024
మరణానికి కారణం: ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి)
ఉస్తాద్ రషీద్ ఖాన్
వృత్తి: క్లాసికల్ సింగర్
మరణించిన తేదీ: జనవరి 9, 2024
మరణానికి కారణం: ప్రోస్టేట్ క్యాన్సర్
శారదా సిన్హా
వృత్తి: జానపద గాయకుడు
మరణించిన తేదీ: నవంబర్ 5, 2024
మరణానికి కారణం: బ్లడ్ పాయిజనింగ్ సమస్యలు
పంకజ్ ఉదాస్
వృత్తి: గజల్ సింగర్
మరణించిన తేదీ: ఫిబ్రవరి 26, 2024
మరణానికి కారణం: దీర్ఘకాలిక అనారోగ్యం
రితురాజ్ సింగ్
వృత్తి: నటుడు
మరణించిన తేదీ: ఫిబ్రవరి 26, 2024
మరణానికి కారణం: కార్డియాక్ అరెస్ట్
సుహాని భట్నాగర్
వృత్తి: బాల నటి
మరణించిన తేదీ: ఫిబ్రవరి 20, 2024
మరణానికి కారణం: డెర్మాటోమియోసిటిస్ (అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధి)
వికాస్ సేథి
వృత్తి: టీవీ నటుడు
మరణించిన తేదీ: సెప్టెంబర్ 8, 2024
మరణానికి కారణం: కార్డియాక్ అరెస్ట్
రామోజీ రావు
వృత్తి: మీడియా వ్యవస్థాపకుడు
మరణించిన తేదీ: జూన్ 8, 2024
మరణానికి కారణం: దీర్ఘకాలిక అనారోగ్యం
Read:Vijayawada:మళ్లీ మహాప్రస్థానం అంబులెన్స్

Related posts

Leave a Comment