Hyderabad | హైదరాబాద్ లో డీజేలపై నిషేధం…. | Eeroju news

హైదరాబాద్ లో డీజేలపై నిషేధం....

హైదరాబాద్ లో డీజేలపై నిషేధం….

హైదరాబాద్, అక్టోబరు 1, (న్యూస్ పల్స్)

Hyderabad

హైదరాబాద్‌ నగరంలో డీజేలు, టపాసుల వ్యవహారం శృతిమించింది.. పెళ్లి బరాత్‌లు, రాజకీయ ర్యాలీలు, మతపరమైన వేడుకలు.. ఈవెంట్ ఏదైనా కావొచ్చు చెవులకి చిల్లు పడే డీజే సౌండ్‌ కామన్ అయిపోయింది.. పైగా భారీ శబ్దాలతో టపాసులు పేల్చడం.. ఇలాంటి ఫుల్ సౌండ్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెవులకు చిల్లులు పడటమే కాదు.. ఒక్కోసారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి.. శబ్ధకాలుష్యం.. ముఖ్యంగా డీజేపై ఇటీవల ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు సైతం అందాయి.. డీజేల వ్యవహారం శృతిమించడంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం కూడా నిర్వహించారు.

చాలా మంది.. డీజేపై నిషేధం విధించాలని.. సౌండ్ సిస్టమ్ విషయంలో కొన్ని షరతులు విధించాలని, భారీ టపాసులు పేల్చేందుకు అనుమతులు ఇవ్వొద్దంటూ పలువురు రౌండ్ టేబుల్‌ సమావేశంలో అభిప్రాయాలను వెల్లడించారు.. టీవీ9 కూడా డీజే చిల్లుపై పలు కథనాలను ప్రసారం చేసింది. ఇలా అన్ని వర్గాల పెద్దల నుంచి.. అన్ని పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వానికి సైతం నివేదిక అందించారు. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం డీజేలపై కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ పరిధిలో డీజేలు, టపాసులపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం విధిస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. మతపరమైన ర్యాలీల్లో డీజే ఉపయోగించకూడదన్నారు. సౌండ్ సిస్టం పరిమిత స్థాయిలో అనుమతిస్తామని.. సౌండ్‌ సిస్టమ్‌కు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరంటూ ఆనంద్ పేర్కొన్నారు. మతపరమైన ర్యాలీల్లో బాణసంచా కాల్చడం కూడా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామని హైదరాబాద్‌ సీపీ ఆనంద్ స్పష్టంచేశారు.

సౌండ్ సిస్టం పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరని.. నాలుగు జోన్లలో సౌండ్ సిస్టంలో పెట్టడానికి డెసిబిల్స్ ను నిర్దేశించినట్లు సీపీ తెలిపారు. జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబెల్స్ కి మించి సౌండ్ సిస్టంలో వాడరాదన్నారు. రాత్రి వేళలో 45 డేసిబెల్స్ కి మించి సౌండ్ సిస్టం ఉపయోగించకూడదన్నారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రతిరోజు రూ.5000 రూపాయల జరిమానా విధిస్తామని సీపీ సీవీ ఆనంద్ స్పష్టంచేశారు.

హైదరాబాద్ లో డీజేలపై నిషేధం....

 

Hydra in Hyderabad… thunderbolts | హైదరాబాద్ లో హైడ్రా… పిడుగులు | Eeroju news

Related posts

Leave a Comment