మూసీ పునరుజ్జీవ అడుగులు..
హైదరాబాద్, నవంబర్ 2, (న్యూస్ పల్స్)
Hyderabad
ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేస్తామని, లండన్‌లోని థేమ్స్‌ను పోలి ఉండేలా మూసీ నదిని పునరుద్ధరిస్తామని రాజకీయ నాయకులు చాలా కాలంగా వాగ్దానం చేస్తూనే ఉన్నారు..మనం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మూసీపై ప్రకటనలే కాదు.. పునరుజ్జీవం దిశగా కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఒకటిన్నర లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆల్రెడీ ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే అడుగులు వేస్తున్నారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదట మూసీ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, మూసీ నది పునరుద్ధరణ కోసం ప్రణాళికలు ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.
15 రోజుల్లో గోదావరి నీటిని గండిపేటకి తరలించేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని బావిస్తోంది రాష్ట్ర సర్కార్.మూసీ ప్రాజెక్టు తొలి దశలో గండిపేట నుండి బాపూఘాట్ వరకు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. బాపూఘాట్ ప్రాంగణంలో ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విగ్రహం ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మూసీ పునరుజ్జీవనపై విపక్షాలు లేనిపోని రాద్దాంతం చేశాయి.. చేస్తున్నాయి. చివరకు మెత్తబడినట్టు కనిపిస్తోంది. మొదట్లో మొండి కేసిన విపక్ష పార్టీలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు చూసి సాధ్యమేనన్నది కొందరి నేతల్లో మొదలైంది.
మూసీ పునరుజ్జీవనకు తాము అడ్డంకి కాదని, అక్కడి ప్రజలకు న్యాయం చేయాలన్నదే తమ ఆలోచనగా చెప్పుకొచ్చారు. ఓ వైపు అధికారులతో వరసగా సమీక్షలు చేస్తున్నారు సీఎం రేవంత్. గండిపేటలో గోదావరి నీళ్లు నింపేందుకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు.రెండు వారాల్లో టెండర్లను పిలవనుంది తెలంగాణ ప్రభుత్వం. తొలి దశలో గండిపేట నుంచి బాపూఘాట్ వరకు పనులు చేపట్టనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా బాపుఘాట్‌ను సుందరీకణపై దృష్టి పెట్టింది. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ప్రపంచంలో అతిపెద్ద గాంధీ విగ్రహం పెట్టాలని ఆలోచన చేస్తోంది.బాపుఘాట్ దగ్గర ఎస్టీపీలతో నీటి శుద్ధి కోసం టెండర్లకు సిద్ధమవుతోంది. మూసీ నదిలో ప్రవేశించే నీటిని శుద్ధి చేయడం వల్ల నది ప్రక్షాళన చేయాలన్నది ప్రభుత్వం ప్లాన్.
శుద్ది చేసిన నీరు నదిలో కలుస్తుండడంతో కాలుష్యం తగ్గనుంది.ఇందుకోసం ఈ వారంలో దీని కోసం టెండర్లు పిలవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్ సాగర్‌కు నీటిని తరలించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. మొత్తానికి ఫస్ట్ ఫేజ్‌ను నాలుగైదు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తోంది.అంతేకాక, ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా, సుందరీకరణ పనులు చేపట్టడం ద్వారా హైదరాబాద్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.మూసీ నదిలో ప్రవేశించే నీటిని శుద్ధి చేయడం ద్వారా నది ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియలో ఎస్టీపీలను రూ. 7 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్నారు.
శుద్ధి చేసిన నీరు మూసీలో కలుస్తుండటంతో, ఈ నది కాలుష్యం తగ్గనుంది. దీని కోసం ఈ వారం లో టెండర్లను పిలవనుంది ప్రభుత్వం. ఇందుకు మల్లన్న సాగర్ నుండి ఉస్మాన్ సాగర్‌కు నీటిని తరలించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు తొలి దశ పనులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ముఖ్యంగా మూసీ పరిసర ప్రాంతాల శుభ్రత, సుందరీకరణ పనులు వేగంగా జరిగేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమవడం ద్వారా మూసీ నది పునరుద్ధరణకు కొత్త వెలుగులు తేవడమే కాకుండా, నగరంలోని ప్రజలకు పరిశుభ్ర నీటి వనరులు అందించడం కూడా సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది.