Hyderabad: భారీగా పెరిగిన ఎక్స్ చార్జీలు:భారత ఎక్స్ యూజర్లకు ప్రపంచ కుబేరుడు ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఎక్స్ ప్రీమియం + సబ్స్క్రిప్షన్ ధరలను భారత్‌లో భారీగా పెంచేశాడు. ఈ పెంపుతో గతంలో ఉన్న ధరలకు ఈ ధరలు రెంట్టిపు కానున్నాయి. మరోవైపు ఇప్పటికే ఒకసారి ఎక్స్ ప్రీమియం + చార్జీలను పెంచారు. మూడు నెలల వ్యవధిలో రెండోసారి చార్జీలు పెంచేశారు. మస్క్ తీరుపై ఎక్స్ యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భారీగా పెరిగిన ఎక్స్ చార్జీలు
హైదరాబాద్, ఫిబ్రవరి 22
భారత ఎక్స్ యూజర్లకు ప్రపంచ కుబేరుడు ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఎక్స్ ప్రీమియం + సబ్స్క్రిప్షన్ ధరలను భారత్‌లో భారీగా పెంచేశాడు. ఈ పెంపుతో గతంలో ఉన్న ధరలకు ఈ ధరలు రెంట్టిపు కానున్నాయి. మరోవైపు ఇప్పటికే ఒకసారి ఎక్స్ ప్రీమియం + చార్జీలను పెంచారు. మూడు నెలల వ్యవధిలో రెండోసారి చార్జీలు పెంచేశారు. మస్క్ తీరుపై ఎక్స్ యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రోక్3 ఏఐ విడుదల తర్వాత ఎక్స్ ప్రీమియం + సబ్స్క్రిప్షన్ చార్జీలు పెంచడం గమనార్హం.మస్క్‌కు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన స్టార్టప్ సంస్థ ఎక్స్ఏఐ తాజాగా గ్రోక్3 సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇక ఈ ఎక్స్ఏఐని వినియోగించాలంటే ఎక్స్ ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గ్రోక్3 ప్రారంభించిన సమయంలోనే మస్క్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీమియ్ + సబ్స్క్రిప్షన్ ధరలు పెంచేశారు.
ఇప్పటి వరకు ఇండియాలో ప్రీమియమ్ + సబ్స్క్రిప్షన్ ధర నెలకు రూ.1,750గా ఉంది. తాజా పెంపుతో అది రూ.3,470కి చేరింది. అంటే ఈ ప్లాన్ ధరలు దాదాపు రెట్టింపు పెరిగాయి. ఇక ఏడాది మొత్తానికి తీసుకునే ప్లాన్ ధరను రూ.18,300 నుంచి రూ.34,340కి పెంచింది. అంటే ఈ ప్లాన్ ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. అయితే ట్విట్టర్(Twitter)ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. ఆ తర్వాత అందులో ఎన్నో సంచలన మార్పులు చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన వెంటనే దానిపేరు ఎక్స్ గామార్చేశారు. తర్వాత ఎక్స్‌నుంచి ఆదాయం సమకూర్చుకునేందుకు 2020 అక్టోర్‌లోనే మొదటిసారి 6పీమియం + సబ్‌స్క్రిప్షన్‌ను ప్రవేశపెట్టారు. అయితే మొదట ప్రీమియం + ప్లాన్ ధర చాలా తక్కువగా నిర్ణయించారు. 2023 అక్టోబర్‌లో రూ.1,300గా ఉన్న ఎక్స్ ప్రీమియం + సబ్స్క్రిప్సన్ ధర.. ఆ తర్వాత 2024 డిసెంబర్లో రూ.1,750కి పెంచారు. తాజాగా మూడు నెలల వ్యవధిలోనే మరోమారు ప్లాన్ ధర పెంచారు. రూ.1,750 నుంచి ఒక్కసారి రూ.3,470కి పెంచడంతో యూజర్లపై భారం పడనుంది. అయితే ఎక్స్‌లో ఇతర ప్లాన్ల ధరలు మాత్రం పెంచకపోవడం ఊరటనిచ్చే అంశం. బేసిక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర ప్రస్తుతం నెలకు రూ.244గా నిర్ణయించారు. ఇక ప్రీమియం + సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు రూ.650గా ఉంది. యాడ్–ఫ్రీ ఎక్ప్పీరియన్స్, సుదీర్ఘ పదాలు రాసే అవకాశం ఈ ప్రీమియం ప్లాన్ల ధ్వారా ఎక్స్ యూజర్లకు లభిస్తుంది.
Read more:Beijing:మళ్లీ దడ పుట్టిస్తున్న చైనా