Hyderabad: ఒత్తిడి నుంచి బయిట పడేదెలా.. రేవంత్ వ్యూహం ఏమిటీ

What is Revanth's strategy?

ఆంధ్రప్రదేశ్ లో సినిమా ధరలను పెంచేశారు. సంక్రాంతి పండగకు విడుదలయ్యే సినిమాలకు అధిక ధరలకు విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. రోజుకు ఐదు షోలకు కూడా అనుమతి ఇచ్చింది. తెలంగాణలో సంథ్య థియేటర్ జరిగిన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ ను దూరం చేసుకోలేక ఈరకమైన నిర్ణయం తీసుకుందన్న విమర్శలు సోషల్ మీడియాలో బహిరంగంగా వినిపిస్తున్నాయి. అయితే ఆ సంఘటన ఏపీలో జరగకపోవడంతో అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తుందనుకోవాలి.

 ఒత్తిడి నుంచి బయిట పడేదెలా..
రేవంత్ వ్యూహం ఏమిటీ..

హైదరాబాద్, జనవరి 6
ఆంధ్రప్రదేశ్ లో సినిమా ధరలను పెంచేశారు. సంక్రాంతి పండగకు విడుదలయ్యే సినిమాలకు అధిక ధరలకు విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. రోజుకు ఐదు షోలకు కూడా అనుమతి ఇచ్చింది. తెలంగాణలో సంథ్య థియేటర్ జరిగిన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ ను దూరం చేసుకోలేక ఈరకమైన నిర్ణయం తీసుకుందన్న విమర్శలు సోషల్ మీడియాలో బహిరంగంగా వినిపిస్తున్నాయి. అయితే ఆ సంఘటన ఏపీలో జరగకపోవడంతో అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తుందనుకోవాలి. అలాగే హీరోలు, సినీ నటులు థియేటర్లకు రాకుండా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశముంది. ఒక్కొక్క టిక్కెట్ ధరను ఆరువందల రూపాయల వరకూ పెంచారు. అయితే తెలంగాణలో ఇప్పటి వరకూ సంక్రాంతి సినిమాలకు సంబంధించి టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 10వ తేదీన గేమ్ ఛేంజర్ విడుదల కానుండటంతో పాటు బాలకృష్ణ సినిమా డాకూ మహారాజ్, వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలకు టిక్కెట్ల ధరలను పెంచాలని నిర్మాతలు సహజంగా కోరే అవకాశముంది. ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి టిక్కెట్ల ధరల పెంపు, అదనపు షోలకు అనుమతులపై చర్చించినట్లు చెబుతున్నారు. అయితే నిర్ణయం మాత్రం ఇంకా బయటకు వెల్లడి కాలేదు.  ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి మంజూరు చేస్తే మాత్రం మొన్న పెరిగిన పరపతి మాత్రం దిగజారే అవకాశముంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ తో కొంత ఇమేజ్ పెంచుకున్న తెలంగాణ సర్కార్ తిరిగి అదే తప్పును చేస్తే మాత్రం ప్రజలు ఓస్ ఇంతేనా? అన్న రీతిలో పెదవి విరుస్తారన్నది గ్యారంటీ. ఇటీవల టాలీవుడ్ పెద్దలతో జరిగిన సమావేశంలోనూ టిక్కెట్ల ధరల పెంపుదల, బెనిఫిట్ షోలకు అనుమతి లేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే కేవలం దిల్ రాజు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలను ఎదుర్కొనక తప్పదు. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిపై కామెంట్స్ కనపడుతున్నాయి. ఏపీలో ధరలు పెంచడంతో ఇక్కడ కూడా ధరలు పెంచాలని నిర్మాతలు కోరుతున్నారు. మరి రేవంత్ సర్కార్ ఏం చేస్తుందన్నది వేచి చూడాల్సిందే.

పోలవరంపై అధ్యయనం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువైన చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కు చెందిన ఐఐటీబృందంతో వెంటనే అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. నెల రోజుల్లోగా దీనిపై తమకు సమగ్రమైన నివేదికను సమర్పించాలని కోరారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి ఐఐటీ బృందంతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించనున్నారు. ప్రధానంగా పోలవరం కారణంగా భద్రాచలానికి ఏర్పడే ముప్పును తెలియజేయాలని రేవంత్ రెడ్డి కోరారు. 2027లో గోదావరి వరదల కారణంగా భద్రాచలం మునిగిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు బనకచర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి మన అభ్యంతరాలను తెలియజేయాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. వరద జలాల ఆధారంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్ర జలనరుల శాఖకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరి నది నుంచి నీటిని కృష్ణానదికి తరలించి అక్కడి నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు మళ్లించి అక్కడి నుంచి రాయలసీమలోని అన్ని జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాకు కూడా నీటిని సరఫరా చేయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యమన్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచలంలో పాటు అనేక గ్రామాలు నీట మునుగుతున్నాయని, గోదావరి నీటిని ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మించి తరలించడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి “గేమ్ ఛేంజర్” అని చెప్పిన ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలియజేస్తూ లేఖలను రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల కేవలం వరద నీటిని మాత్రమే తరలిస్తున్నామని, వృధాగా పోయే నీటిని మాత్రమే రాష్ట్రానికి వినియోగించాలని నిర్ణయమని ఏపీ తరుపున వాదన వినిపిస్తుంది. కానీ దానివల్ల తెలంగాణకు కూడా నష్టమేనని ఆ ప్రాంత అధికార పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Read:Hyderabad:హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం

Related posts

Leave a Comment