Hyderabad:సైబర్ సేఫ్టీలో తెలంగాణ ముందుండాలి షీల్డ్ 2025 ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad

Hyderabad:సైబర్ సేఫ్టీలో తెలంగాణ ముందుండాలి షీల్డ్ 2025 ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి:దేశంలోనే సైబర్ సేఫ్టీలో మన రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపడమే మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ సేఫ్టీ, ఫ్యూచర్ గురించి చర్చించేందుకు ఇవాళ షీల్డ్ 2025ని నిర్వహించుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
మంగళవారం జరిగిన షీల్డ్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో అయన మాట్లాడారు.

సైబర్ సేఫ్టీలో తెలంగాణ ముందుండాలి
షీల్డ్ 2025 ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్
దేశంలోనే సైబర్ సేఫ్టీలో మన రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపడమే మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ సేఫ్టీ, ఫ్యూచర్ గురించి చర్చించేందుకు ఇవాళ షీల్డ్ 2025ని నిర్వహించుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
మంగళవారం జరిగిన షీల్డ్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో అయన మాట్లాడారు.
మొదటిసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ను అభినందిస్తున్నా. తెలంగాణను నంబర్ వన్ సైబర్-సేఫ్ స్టేట్గా మార్చడానికి కలిసి పనిచేస్తున్న మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉంది. దేశంలో సైబర్ నేరగాళ్లు గత ఏడాది రూ. 22,812 కోట్లు దోచుకున్నారని ఒక అంచనా. ఇది మన ఆర్థిక వ్యవస్థకు, మన పౌరులకు ముప్పు. ఈరోజుల్లో ఫేక్ న్యూస్ అనేది మరో ప్రధానమైన ముప్పు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో సమాజంలో గందరగోళం ఏర్పడుతుంది. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకో సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు… మా ప్రభుత్వం నిపుణులు, IT సంస్థలతో కలిసి పనిచేయడానికి, అన్ని రకాల వనరులు సమకూరుస్తోంది. మనం తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్ గా మార్చాలి. 1930 నంబర్ ను అందరికీ షేర్ చేయాలని ప్రతీ ఒక్కరినీ కోరుతున్నా.. ఇది 24/7 సైబర్ హెల్ప్లైన్. పూర్తిస్థాయిలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ బ్యూరో, పౌరులను రక్షించడానికి అంకితమైన సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మేం గత ఏడాది 7 కొత్త ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించామని అన్నారు.
ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసిన డీజీపీ, సైబర్ బ్యూరో డైరెక్టర్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సీఎస్బీ బృందాన్ని అభినందిస్తున్నా. తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్ గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దామని అన్నారు. నేరాల విధానం వేగంగా మారుతోంది. సమాజంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి . సైబర్ క్రైం ను నియంత్రించడంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉంది . కానీ సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అయన అన్నారు.

Read more:Hyderabad:పౌల్ట్రీ రైతులకు కోట్లల్లో నష్టం

Related posts

Leave a Comment