Hyderabad:సైకిల్‌ ఎంట్రీ.. మారనున్న గేర్

Telugu Desam Party in Telangana

Hyderabad:సైకిల్‌ ఎంట్రీ.. మారనున్న గేర్:తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ తిరిగి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమా ఆపార్టీలో మరింతగా వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ కు తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు కూడా ఊపందుకుంటున్నాయి. ఎందుకంటే ఏ రకంగా చూసినా అది కారు పార్టీకి లాభమేనని, సైకిల్ వస్తే కారు గేర్ మార్చడం ఖాయమన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.

సైకిల్‌ ఎంట్రీ.. మారనున్న గేర్

హైదరాబాద్, మార్చి 14
తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ తిరిగి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమా ఆపార్టీలో మరింతగా వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ కు తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు కూడా ఊపందుకుంటున్నాయి. ఎందుకంటే ఏ రకంగా చూసినా అది కారు పార్టీకి లాభమేనని, సైకిల్ వస్తే కారు గేర్ మార్చడం ఖాయమన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. అయితే టీడీపీ ఓటు బ్యాంకు 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు టర్న్ అయ్యాయి. తర్వాత 2023 ఎన్నికల్లో టీడీపీలో అత్యధికశాతం ఓట్లు కాంగ్రెస్ కు మళ్లాయంటారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉండటంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ తో పాటు ఓటర్లు కూడా గాంధీ భవన్ వైపు మొగ్గు చూపారన్న వాదనలో నిజముంది. 2023 శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి స్థానాలు దక్కకపోయినా ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీకి సాలిడ్ గా సీట్లు రావడం కూడా టీడీపీ ఓటు బ్యాంకు సహకారం వల్లనేనన్నది కొందరి విశ్లేషణగా ఉంది.
2018లో మహా కూటమిలో కాంగ్రెస్ తో కలసి టీడీపీ పోటీ చేయడంతో అధికారంలోకి రాలేదన్న కామెంట్స్ కూడా నాడు వినిపించాయి.ఇప్పుడు బీజేపీతో పొత్తుతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రానుందన్న వార్తలు కారు పార్టీ నేతలకు ఖుషీ కబురుగా అనుకోవాల్సి ఉంటుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా టీడీపీని, కాంగ్రెస్ ను వేరుగా చూడలేరని, అందుకే ఈసారి ఎన్నికల్లో జనం తమ వైపు తిరుగుతారని గట్టి అంచనాలు వినపడుతున్నాయి. రానున్న కాలంలో కేసీఆర్ కూడా చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశాలున్నాయి. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ను కూడా మళ్లీ రగిలించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, సాగునీరు కూడా అందని పరిస్థితి నెలకొంటుందని చెప్పి ప్రజలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం గులాబీ బాస్ చేస్తారంటున్నారు. మొత్తం మీద టీడీపీ ఎంట్రీతో కారు పార్టీకే లాభమన్న విశ్లేషణలు బాగా వినపడుతున్నాయి.\

తెలంగాణ రైజింగ్కు మద్దతుగా నిలవండి..
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి

న్యూఢిల్లీ
రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణను సమున్నతంగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి  కలిశారు. ఈసందర్భంగా 2025 సంవత్సరంలో హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా  నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలైన మిస్ వరల్డ్, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, భారత్ సమ్మిట్, యానిమేషన్ గేమింగ్, వీఎఫ్ఎక్స్తో పాటు వినోద పరిశ్రమలో తెలంగాణ బలాన్ని చాటే ఇండియా జాయ్ వివరాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా తెలంగాణ రైజింగ్ను ప్రోత్సహించేందుకు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి జైశంకర్ను సీఎం కోరారు. తెలంగాణ రైజింగ్ను విదేశాల్లో భారత్ కార్యక్రమాల్లోనూ ప్రచారం చేయాలని, దౌత్య, లాజిస్టిక్ సహాయంతో హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమాల విజయవంతానికి సహకరించాలని కేంద్ర మంత్రి  జైశంకర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్లో చేపట్టే కార్యక్రమాలకు తమ మంత్రిత్వ శాఖ మద్దతుగా నిలుస్తుందని కేంద్ర మంత్రి జైశంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశారు. కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, నాగర్ కర్నూలు, భువనగిరి లోక్సభ సభ్యులు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

 

Related posts

Leave a Comment