Hyderabad:సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో జలమండలి

Water Board in Summer Action Plan

Hyderabad:సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో జలమండలి:వేసవి ఆరంభంలోనే జలమండలి పరిధిలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది జనవరి, ఫిబ్రవరిలో కలిపి 1,94,747 వాటర్ ట్యాంకర్లను బుక్ చేయగా.. ఈ ఏడాది జనవరిలో 1,19,752, ఫిబ్రవరిలో ఇప్పటికే దాదాపు 1.50 లక్షల ట్యాంకర్లను డెలివరీ చేసినట్లు జలమండలి అధికారిక లెక్కలు చెబుతున్నా యి. నగరంలోని చాలా చోట్ల భూగర్భజలా లు పడిపోవడం, నివాసాల్లోని బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్ల బుకింగ్స్ పెరుగుతు న్నాయి.

సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో జలమండలి

హైదరాబాద్, మార్చి 10
వేసవి ఆరంభంలోనే జలమండలి పరిధిలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది జనవరి, ఫిబ్రవరిలో కలిపి 1,94,747 వాటర్ ట్యాంకర్లను బుక్ చేయగా.. ఈ ఏడాది జనవరిలో 1,19,752, ఫిబ్రవరిలో ఇప్పటికే దాదాపు 1.50 లక్షల ట్యాంకర్లను డెలివరీ చేసినట్లు జలమండలి అధికారిక లెక్కలు చెబుతున్నా యి. నగరంలోని చాలా చోట్ల భూగర్భజలా లు పడిపోవడం, నివాసాల్లోని బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్ల బుకింగ్స్ పెరుగుతు న్నాయి. డెలివరీలు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. జలమండలి డెలివరీ చేస్తున్న వాటర్ ట్యాంకర్ల గణాంకాలను పరిశీలిస్తే గతేడాది కంటే ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 40శాతం పెరిగింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ట్యాంకర్లకు మరింత ఎక్కువ డిమాండ్ వచ్చే పరిస్థితులున్నాయి. నగరంలో ఏటా వాటర్ ట్యాంకర్లకు డి మాండ్ పెరుగుతోంది. 2022లో 32శాతం, 2023లో 19శాతం, 2024లో 31శాతం, ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే 37 శాతం డిమాండ్ పెరిగింది. వినియోగదారు ల నుంచి వస్తున్న డిమాండ్‌కు తగ్గట్లుగా ట్యాంకర్‌ను బుక్ చేసిన 24 గంటల్లోనే డెలివరీ చేస్తున్నారు.

వాటర్ ట్యాంకర్లకు కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా డిమాండ్ ఉండటం గమనార్హం. జలమండలి పరిధిలోని మణికొండ, దుర్గంచెరువు, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్‌నగర్, నిజాంపేట్, హీఫీజ్‌పేట్, ఆసిఫ్‌నగర్, అల్వాల్, రాజేంద్రనగర్, జూబ్లీహి ల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌళి, మాదాపూర్, అమీర్ పేట్, తదితర ప్రాంతాల్లో ఎక్కువగా బుకిం గ్స్, డెలివరీలు జరుగుతున్నాయి. కాగా జలమండలి సరఫరా చేసే వాటర్ ట్యాంకర్ల కోసం 24 గంటలు వేచి ఉండాలా అనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో పలువురు వినియో గదారులు, కమర్షియల్ కాంప్లెక్స్, అపార్ట్‌మెంట్‌ల నిర్వాహకులు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్ పెరుగుతున్నందున జలమండలి అధికారులు ముం దస్తు చర్యలు చేపడుతున్నారు. జలమండలి పరిధిలో గతేడాదిలో 69 ఫిల్లింగ్ స్టేషన్లు, 93 ఫిల్లింగ్ పాయింట్లు, 577 వాటర్ ట్యాంకర్లు ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 79 ఫిల్లింగ్ స్టేషన్లు, 123 ఫిల్లింగ్ పాయింట్లు, 907 వాటర్ ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు. ఫిల్లింగ్ పాయింట్ల వద్ద ఒక్కో వాటర్ ట్యాంకర్ నిండేందుకు దాదాపు 8- నిమిషాల సమయం పడుతున్నట్లు గుర్తించి, ఫిల్లింగ్ సమయాన్ని 5 నిమిషాలకు తగ్గించారు. తద్వారా ఎక్కువ ట్రిప్పులను సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు

Read more:Warangal:వరంగల్ లో గోల్డ్ లోన్ ఏటీఎం

Related posts

Leave a Comment