Hyderabad:సంజయ్ టార్గెట్ గద్దరా.. ఈటెలా

Union-Minister-Bandi-Sanjay-target

Hyderabad:సంజయ్ టార్గెట్ గద్దరా.. ఈటెలా:తెలంగాణ గట్టుపై ఇంట్రెస్టింగ్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. ఏడాది కాలంగా నడుస్తోన్న ట్రయాంగిల్‌ పొలిటికల్‌ ఫైట్‌లో భాగంగా ప్రతీ టాపిక్‌ను టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మార్చేస్తున్నారు నేతలు. ఇప్పుడు లేటెస్ట్‌గా గద్దర్‌కు పద్మ అవార్డుపై నైజాం గడ్డ మీద హైవోల్టేజ్‌ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.

సంజయ్ టార్గెట్
గద్దరా.. ఈటెలా.,…

హైదరాబాద్, జనవరి 30
తెలంగాణ గట్టుపై ఇంట్రెస్టింగ్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. ఏడాది కాలంగా నడుస్తోన్న ట్రయాంగిల్‌ పొలిటికల్‌ ఫైట్‌లో భాగంగా ప్రతీ టాపిక్‌ను టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మార్చేస్తున్నారు నేతలు. ఇప్పుడు లేటెస్ట్‌గా గద్దర్‌కు పద్మ అవార్డుపై నైజాం గడ్డ మీద హైవోల్టేజ్‌ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. గద్దర్‌కు ఎందుకు పద్మ అవార్డు ఇవ్వరంటూ కేంద్రాన్ని..సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నిస్తే..సెంట్రల్ మినిస్టర్‌ బండిసంజయ్‌ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి తూటా పేల్చేశారు.గద్దర్‌కు అవార్డు ఎలా ఇస్తాం..ఆయన మావోయిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి, ఎంతోమంది చావులకు కారణమయ్యాడు అంటూ బాంబ్‌ పేల్చారు. బరాబర్ నక్సలైట్ భావజాలం ఉన్న గద్దర్‌కు అవార్డు ఇచ్చేదే లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో గద్దర్‌ సెంట్రిక్‌గా బండి సంజయ్‌ కామెంట్స్‌ బేస్‌గా తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది.గద్దర్‌కు పద్మ అవార్డులపై బండి సంజయ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా కంటిన్యూ అవుతున్నాయి. సీఎం రేవంత్‌కు కౌంటర్‌ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సంజయ్‌ మాట్లాడారా లేదా ఏదైనా వ్యూహం ఉందా అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. నక్సలైట్‌ భావజాలం ఉన్న గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వబోమన్న సంజయ్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అస్త్రంగా మలుచుకుంటోంది.గద్దర్‌కు అవార్డు ఇవ్వరు కానీ..వామపక్ష భావజాలం ఉన్న ఈటలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్‌ ఇస్తారు..పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్‌ పేరును పరిశీలిస్తారా అంటూ ..హస్తం పార్టీల నేతలు గళమెత్తుతున్నారు. దీంతో గద్దర్‌కు పద్మ అవార్డు ఇష్యూ ఏమో గానీ..అటు ఇటు తిరిగి ఈటలకు బాణం ఎక్కుపెట్టినట్లైందన్న టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డికి వ్యాఖ్యలకు సమాధానంగా బండి సంజయ్‌ మాట్లాడిన మాటలు..బీజేపీలోని ముఖ్యనేతకు తాకాయన్న చర్చ జరుగుతోంది.బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కసరత్తు క్లైమాక్స్‌కు చేరింది. స్టేట్‌ ప్రెసిడెంట్‌గా ఈటల రాజేందర్‌ పేరు దాదాపుగా కన్ఫామ్‌ అయిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. సరిగ్గా ఇదే టైమ్‌లో సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఈటలకు గుచ్చుకుంటున్నాయట. అనుకోకుండానో..లేక గద్దర్‌కు అవార్డు ఇవ్వబోమని చెప్పే ఫ్లోలోనో..నకలైట్‌ భావజాలం అని బండిసంజయ్‌ ప్రస్తావించడం ఈటలకు హెడెక్‌గా మారిందట. ఈటల రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి ముందు నుంచి వస్తున్న అడ్డంకి ఆయన రాజకీయ నేపథ్యమే. అదే వామపక్ష భావజాలం.

రాజకీయాల్లోకి వచ్చే కంటే ముందు ఈటల, ఆయన భార్య జమున PDSUలో పనిచేశారని చెప్తుంటారు. దీన్నే సాకుగా చూపి ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు దక్కకుండా ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్‌ ఉన్న నేతలు అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇదే టైమ్‌లో సంజయ్‌ పేల్చిన బాంబ్‌ ఇంటా..బయట పొగ లేపుతోందట. కాంగ్రెస్‌ ఈటల నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ బీజేపీని, సంజయ్‌ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే..బండిసంజయ్‌ కాంగ్రెస్‌కు కౌంటర్‌ ఇచ్చే క్రమంలో..ఈటలకు బాణం ఎక్కుపెట్టారన్న టాక్ వినిపిస్తోంది.సంజయ్ అనుకున్న లక్ష్యం నెరవేరిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటివరకు సంజయ్ హిందువుల ఓటు బ్యాంక్ పోలరైజేషన్‌పైనే మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు గద్దర్ విషయంలో చేసిన వ్యాఖ్యలు నక్సల్స్‌ను వ్యతిరేకించేవారిని తమవైపునకు తిప్పకునేలా ఉన్నాయని అంటున్నారు. చాలామంది కాంగ్రెస్ నేతల తండ్రులను నక్సల్స్ చంపారని చెబుతున్నారు.మంత్రి శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి, ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి లాంటి నేతలు నక్సలైట్ల కాల్పుల్లో చనిపోయిన విషయం మర్చిపోవద్దంటున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేతలే కాదు..చాలా మంది అమాయకులు, హిందుత్వ భావజాలం ఉన్న వ్యక్తుల చావులకు కారణమైన..నక్సల్ భావజాలం ఉన్న గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.సంజయ్‌ వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మం ఏంటన్న దానిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడాన్ని ఓ వర్గం బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఆ నేతలకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు అస్త్రంగా మారాయి. వామపక్ష ఐడియాలజీ ఉన్న ఈటల రాజేందర్‌కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎలా ఇస్తారని పార్టీలో ఇంటర్నల్‌గా వాయిస్‌ వినిపిస్తున్న బీజేపీ నేతలకు, కాంగ్రెస్ నేతల టోన్‌ కూడా యాడ్‌ అవుతుందన్న చర్చ నడుస్తోంది.అయితే తాను చేసిన వ్యాఖ్యలు ఈటలకు తాకేలా ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో బండిసంజయ్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గద్దర్ నక్సలైట్‌గా పనిచేశారని..ఈటలది వామపక్ష భావజాలమని.. అవి రెండు వేర్వేరు అని చెప్పుకొస్తున్నారు సంజయ్. ఈటల రాజేందర్‌ మావోయిస్టు కాదని..కమ్యూనిస్టు భావజాలం వేరు..మావోయిస్టుగా చేయడం వేరని క్లారిటీ ఇస్తున్నారు.ఏది ఏమైనా సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. గద్దర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు అటు రేవంత్ రెడ్డికి నేరుగా కౌంటర్ ఇవ్వగా ఇన్ డైరెక్ట్‌గా సొంత పార్టీలో అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఈటలకు కూడా తాకాయని అంటున్నారు. అంతేకాదు గద్దర్‌కు అవార్డు ఇవ్వబోమని చెప్పి..నక్సలైట్ల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్‌ నేతల కుటుంబాల మనసు గెలుచుకున్నారని అని కూడా చర్చించుకుంటున్నారు. సంజయ్‌ కామెంట్స్‌పై మాత్రం గద్దర్ అభిమానులు, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. బండి వ్యాఖ్యలకు సపోర్ట్ చేసే వారు కూడా ఉన్నారు. అయితే గద్దర్‌కు పద్మ అవార్డు ఇష్యూ ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో..ఎన్నాళ్లో పొలిటికల్‌ హాట్ టాపిక్‌గా కొనసాగుతుందో చూడాలి మరి.

Related posts

Leave a Comment