తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు సర్వే పూర్తి కావొచ్చింది. గ్రామసభల ద్వారా అర్హుల జాబితాలను సిద్ధం చేస్తారు. అయితే ఈ జాబితాలకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ కొనసాగుతోంది.
వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ
హైదరాబాద్, జనవరి 16
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు సర్వే పూర్తి కావొచ్చింది. గ్రామసభల ద్వారా అర్హుల జాబితాలను సిద్ధం చేస్తారు. అయితే ఈ జాబితాలకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్లు వివరాలను సేకరిస్తున్నారు. దాదాపు సర్వే పూర్తి కావొచ్చింది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో ప్రతిదీ ఎంట్రీ చేస్తున్నారు. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేయనున్నారు. రానున్న నాలుగేళ్లలో అర్హులందరికీ గృహాలను నిర్మించే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మొత్తం రూ. 5 లక్షలు ఇస్తారు. ఈ డబ్బులను నాలుగు దశల్లో విడతల వారీగా లబ్ధిదారుడి ఖాతాలో వేస్తారు. అయితే లక్షల సంఖ్యలో దరఖాస్తులు ఉండటంతో.. అసలైన అర్హులను గుర్తించటం ప్రభుత్వానికి సవాల్ గా మారిందనే చెప్పొచ్చు. సర్వేలో పథకానికి ఎంపికయ్యే అర్హతలు ఉన్న దరఖాస్తుదారుడిని గుర్తిస్తారు. గ్రామాల వారీగా పేర్లు ఖరారవుతాయి. వీరి వివరాలను ఇందిరమ్మ కమిటీలు పరిశీలించే అవకాశం ఉంది. అంతేకాకుండా… ఈ జాబితాను గ్రామసభ ముందుంచి… ఆమోదముద్ర వేస్తారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో గ్రామసభలు కీలకంగా పని చేయనున్నాయి. ఇంతటంతో కాకుండా… ఎంపికైన జాబితాను ఇంచార్జీ మంత్రికి అందించాల్సి ఉంటుంది. ఆపై ఇంఛార్జీ మంత్రి ఆమోదం కూడా తప్పనిసరి చేశారు. ఇదే విషయాన్ని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కూడా వెల్లడించారు.ఈ జాబితాలకు ఇంఛార్జీ మంత్రి ఆమోదం తర్వాత.. ఈ లిస్టులు జిల్లా కలెక్టర్ వద్దకు చేరుతుంది. జిల్లా కలెక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే జాబితాలు విడుదలవుతాయి.వీరే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అవుతారు.ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Read:Karimnagar:నత్తనడకన మానేరు రివర్ ఫ్రంట్ పనులు