తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను ఈ నెలలోనే అమలు చేయడానికి సిద్ధమయింది. సంక్రాంతికి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేయడంతో అందుకు తగినట్లుగా విధివిధానాలను నిర్ణయించే పనిలో ఇటు అధికారులు, అటు మంత్రి వర్గ ఉప సంఘం ఉంది. అయితే ఇప్పటికే కొన్ని విధివిధానాలు ఖరారయ్యాయని చెబుతున్నారు.
రైతు భరోసా.. సెల్ఫ్ డిక్లరేషన్
హైదరాబాద్, జనవరి 2
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను ఈ నెలలోనే అమలు చేయడానికి సిద్ధమయింది. సంక్రాంతికి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేయడంతో అందుకు తగినట్లుగా విధివిధానాలను నిర్ణయించే పనిలో ఇటు అధికారులు, అటు మంత్రి వర్గ ఉప సంఘం ఉంది. అయితే ఇప్పటికే కొన్ని విధివిధానాలు ఖరారయ్యాయని చెబుతున్నారు. సంక్రాంతి నుంచి విడతల వారీగా నిధులను జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. తొలి విడత నిధులను 7,500 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా ను తొలుత విడుదల చేయాలన్న ఆలోచనలో ఉంది.. అదే సమయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. రైతు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలన్న షరతు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన భూమిలో ఏ పంటను సాగు చేస్తున్న విషయాన్ని రైతు డిక్లరేషన్ ద్వారా తెలియాచేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎంత మేరకు రైతు సాగు చేశారో అంత వరకే రైతు భరోసా నిధులు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించిందని, మంత్రి వర్గ ఉప సంఘం కూడా ఈ రకమైన ప్రతిపాదనకు ఓకే చెప్పిందన్న వార్తలు వస్తున్నాయి. ఏదో ఒక పంట వేసి భూమిని సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను తొలుత జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల జరిగే మంత్రివర్గ సమావేశంలో… అదే సమయంలో మిగిలిన వారి విషయం తర్వాత ఆలోచించవచ్చని తెలిపింది. సాగు కాని భూములకు రైతు భరోసా నిధులు ఇవ్వడం అనవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సాగు కాని భూములకు రైతు భరోసా నిధులను జమ చేస్తే అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని రేవంత్ రెడ్డి కూడా అభిప్రాయపడుతున్నారు. శాటిలైట్, ఇమేజ్ రిమోట్ సెన్సింగ్ సాయంతో సాగు విస్తీర్ణంపై ఒక క్లారిటీ వస్తుందని, దాని ప్రకారమే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. జనవరి 2 వతేదీన మంత్రి వర్గ ఉప సంఘం సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల 4వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా విధివిధానాలపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది.
Read:Karimnagar:ఉత్తర తెలంగాణలో.. ఎన్నికల సందడి