ఈనెల 4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులకు సమాచారం అందించారు. అవసరమైన సమాచారం సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు.
రేపే తెలంగాణ కేబినెట్
హైదరాబాద్, జనవరి 2
ఈనెల 4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులకు సమాచారం అందించారు. అవసరమైన సమాచారం సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై క్యాబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి నుంచి ఈ పథకం అమలు చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించింది. ఈ మేరకు అర్హుల ఎంపిక, విధివిధానాల ఖరారు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కి అధ్యక్షణ కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. రెండ్రోజుల క్రితం సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ అర్హుల ఎంపికై కసరత్తు చేసింది. ఈ మేరకు ఈనెల 4న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి రైతు భరోసా పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 15 వేలు జమ చేసేందుకు నిధులు విడుదల చేయనున్నారు.ఇక కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజా పాలన దరఖాస్తుల ద్వారా వచ్చిన అప్లికేషన్లు ఫిల్టర్ చేసి అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. దాదాపు 30-40 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపైనా కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే కాకుండా రైతు కూలీలకు ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 12 వేలు ఇస్తామని ప్రకటించింది.డిసెంబర్ 28నే పథకం ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించినా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ఆ కార్యక్రమం వాయిదా పడింది. జనవరి నాలుగున జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశంపైనా చర్చించి రైతు కూలీల అకౌంట్లలో డబ్బులు జమ చేసే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే కాకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక కమిషన్ నివేదిక, పలు పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనం, ఎస్సీ వర్గీకరణ, నూతన టూరిజం పాలసీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు, గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా గ్రామ స్థాయి అధికారుల నియామక ప్రక్రియ, అన్ని శాఖల్లో ఉన్న ఇతర పెండింగ్ అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
Read:New York:బీటా బేబీస్ జనరేషన్