తెలంగాణ వెదర్‌పై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో రానున్న 5 రోజులు అక్కడక్కడ ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు పడిపోతాయని హెచ్చరించారు.
రెండు రోజులు జరాభద్రం
వాతావరణ శాఖ వార్నింగ్
(న్యూస్ పల్స్)
తెలంగాణ వెదర్‌పై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో రానున్న 5 రోజులు అక్కడక్కడ ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు పడిపోతాయని హెచ్చరించారు. రేపు, ఎల్లుండి పొగమంచు ఎక్కువగా ఉంటుందని రేపు 20-27 డిగ్రీలు, ఎల్లుండి 18-27 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేసారు. తూర్పు/ఆగ్నేయ దిశలో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో నేడు పలు చోట్ల తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఎలాంటి హెచ్చరికలు లేకపోయినప్పటికీ.. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారుఇక నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉందని అన్నారు. దీని ఫలితంగా ఏపీలో వర్షాలు కురుస్తాయన్నారు. ఉత్తర కోస్తాలో నేడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అంచనా వేశారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు.. గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో గత మూడ్రోజులు వర్షాలు కురిశాయి. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. బుధవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం నగరంలో పొడి వాతావరణం నెలకొని ఉంది. మేఘాలు లేకపోవటంతో చలి తీవ్రత కాస్త పెరిగింది. రానున్న రోజుల్లో ఇదే వాతావరణం ఉంటుందని.. చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు.
Read:Mumbai:10 లక్షల విజిటర్స్ వీసాలు