Hyderabad:మీనాక్షి మార్క్.. సమీక్షలు షురూ..

AICC new in-charge Meenakshi Natarajan took a key decision.

Hyderabad:మీనాక్షి మార్క్.. సమీక్షలు షురూ..:ఏఐసీసీ కొత్త ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పనితీరుపై సమీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరును తెలుసుకునేందుకు గాంధీభవన్‌లో 4వ తేదీ నుంచి సమీక్షలు నిర్వహించారు. తొలుత మంగళవారం మెదక్, మల్కాజిగిరి పూర్తి చేయగా రెండో రోజు బుధవారం కరీంనగర్, ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నేతలందరితో సమీక్షించారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగే సమీక్షలకు.. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర ముఖ్యనేతలందరూ రావాలని ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి.

మీనాక్షి మార్క్..
సమీక్షలు షురూ..

హైదరాబాద్, మార్చి 5
ఏఐసీసీ కొత్త ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పనితీరుపై సమీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరును తెలుసుకునేందుకు గాంధీభవన్‌లో 4వ తేదీ నుంచి సమీక్షలు నిర్వహించారు. తొలుత మంగళవారం మెదక్, మల్కాజిగిరి పూర్తి చేయగా రెండో రోజు బుధవారం కరీంనగర్, ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నేతలందరితో సమీక్షించారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగే సమీక్షలకు.. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర ముఖ్యనేతలందరూ రావాలని ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా నియమితులైన తరవాత.. నిర్వహించబోతున్న తొలి సమీక్ష సమావేశాలు కావడంతో వీటికి ప్రాధాన్యం ఏర్పడింది.అటు గాంధీభవన్‌కు చాలామంది నేతలు క్యూకడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను ఈ నెల 10లోగా పార్టీ ప్రకటించాల్సి ఉంది. వీటికి సంబంధించి పెద్దసంఖ్యలో నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఇన్‌ఛార్జిని ప్రసన్నం చేసుకునేందుకు, తమ పనితీరును వివరించేందుకు నేతలు గాంధీభవన్ చుట్టూ తిరుగుతున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఇటీవల ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ఆ మేరకు కాంగ్రెస్‌లో పదవుల భర్తీ ఉంటుందని నేతలు చెబుతున్నారు. ప్రధానంగా మాల, మాదిగ వర్గాల నేతలకు ఎమ్మెల్సీ టికెట్లు, నామినేటెడ్, మంత్రి పదవుల భర్తీలో ఎస్సీ వర్గీకరణ ప్రకారం ప్రాధాన్యమిస్తారని ప్రచారం జరుగుతోంది. అటు తమకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వాలని రెండు సామాజిక వర్గాల నేతలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.మాల, మాదిగలకు సంబంధించి.. ఒక వర్గానికి అవకాశమిస్తే మరో వర్గానికి ప్రభుత్వ సలహాదారు లేదా రాబోయే మంత్రివర్గ విస్తరణలో సర్దుబాటు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇక బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లలో రెండు ఇవ్వాలని ఈ వర్గాల నేతలు పట్టుబడుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తయితే ఏయే వర్గాలకు అవకాశం ఇస్తారనేది తేలుతుంది.

 

ఇటు మిగిలిన సామాజిక వర్గాలకు నామినేటెడ్, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ రాష్ట్ర కార్యవర్గ పదవులు ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పీసీసీ రాష్ట్ర కార్యవర్గ కూర్పు కూడా ఈ నెల 20లోగా పూర్తవుతుందని నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ పరిస్థితులు, సమస్యలు, పరిష్కార మార్గాలపై ఆయా నేతలపై మీనాక్షి నటరాజన్ చర్చించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటి నుంచే ఆమె ఫోకస్ చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. దీని తర్వాత జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కార్యకర్తలతో భేటీ కావాలని భావిస్తున్నట్లు గాంధీ వర్గాలు చెబుతున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ స్థాయిలో జరగడంతో వాటిపై తొలుత దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం అయితే ఓటు బ్యాంక్ చెదిరిపోకుండా ఉంటుందన్నది హైకమాండ్ ఆదేశాలు. ఆ విధంగా ఆమె అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.రాష్ట్ర ఇన్‌ఛార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నిర్వహిస్తున్న ఫస్ట్ సమీక్ష సమావేశాలు ఇవే. నేతలు సైతం వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. పెద్ద సంఖ్యలో నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. కొత్త ఇన్‌ఛార్జిని ప్రసన్నం చేసుకునేందుకు నేతలు సైతం సిద్ధమవుతున్నవారు.దీని తర్వాత సామాజిక వర్గాలకు నామినేటెడ్, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ రాష్ట్ర కార్యవర్గ పదవులు ఇస్తారనే వార్తలు లేకపోలేదు. పీసీసీ కార్యవర్గ కూర్పు ఈ నెల 20లోగా పూర్తి అవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నామినేటెడ్‌ పదవుల్లో పెండింగ్ లో ఉన్నవాటిని భర్తీ చేయడానికి జిల్లాలవారీగా ఈనెల 10లోగా అర్హులను గుర్తించాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. దీనిపై ఇన్‌ఛార్జి మంత్రులు ఆయా వివరాలు సేకరిస్తున్నారు. మొత్తానికి పార్టీ బలోపేతంపై చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మీనాక్షి నటరాజన్.నామినేటెడ్‌ పదవుల్లో మిగిలిన వాటిని భర్తీ చేయడానికి జిల్లాల వారీగా ఈ నెల 10లోగా అర్హులను గుర్తించాలని.. ఇన్‌ఛార్జి మంత్రులకు పీసీసీ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. వారు ఆ వివరాలు సేకరిస్తున్నారు.

Read more:Hyderabad:టీడీపీలోకి మల్లన్న గ్రేటర్ కోసం కసరత్తు

Related posts

Leave a Comment