Hyderabad:మరో 2 నెలలు కాళేశ్వరం కమిషన్ పొడిగింపు

Kaleshwaram commission extension for another 2 months

Hyderabad:మరో 2 నెలలు కాళేశ్వరం కమిషన్ పొడిగింపు:కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతా లోపాలు, అవినీతి తదితర అంశాలపై విచారిస్తోన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు మరో రెండు నెలలు పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు, లోపాలు,అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణ పూర్తికాకపోవడంతో ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించింది.

మరో 2 నెలలు కాళేశ్వరం కమిషన్ పొడిగింపు

హైదరాబాద్,, ఫిబ్రవరి 21
కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతా లోపాలు, అవినీతి తదితర అంశాలపై విచారిస్తోన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు మరో రెండు నెలలు పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు, లోపాలు,అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణ పూర్తికాకపోవడంతో ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు కమిషన్ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది మార్చిలో ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేయగా ఏప్రిల్‌ నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభించింది.ఇప్పటికే నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు, మాజీ ఈఎన్‌సీలతో పాటు చీఫ్‌ ఇంజనీర్లు, ఎస్‌ఈలను విచారించిన కమిషన్‌.. ఇక నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా, ఇతర హోదాల్లో పనిచేసిన ప్రస్తుత, మాజీ ఐఏఎస్‌లను విచారించి బ్యారేజీల నిర్మాణంలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకున్నారన్న అంశంపై సాక్ష్యాలను సేకరించేందుకు సన్నద్ధమైంది. కాంట్రాక్ట్ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్ట్ సంస్థలూ విచారణకు రావాల్సి ఉండడంతో మరోసారి గడువు పొడిగించారు.కాళేశ్వరం కమిషన్ గడువును ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది. కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు తొలుత జూన్ 30 వరకు గడువు ఇచ్చారు. ఆ టైంలోగా నివేదికను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ, విచారించాల్సిన అధికారులు ఎక్కువ మంది ఉండడం, ప్రాజెక్టులో చాలా వరకు సాంకేతికాంశాలు ముడిపడి ఉండడంతో విచారణ పూర్తి కాలేదు. తొలుత 60 మంది వరకు రిటైర్డ్, ప్రస్తుత ఇంజనీర్లను పిలిచిన కమిషన్.. వారి నుంచి వివరాలు సేకరించి అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.ఆ విచారణను కొనసాగించాల్సి రావడంతో గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. దీంతో రెండో దశలో రిటైర్డ్ ఐఏఎస్లను కమిషన్ విచారణకు పిలిచింది. అప్పటికే టెక్నికల్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం, విజిలెన్స్ రిపోర్టు రెడీ కాకపోవడం, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆలస్యమవడం వంటి కారణాలతో గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించారు. ఈ దశలో ఓపెన్ కోర్టు ద్వారా దాదాపు 30 మంది అధికారులను కమిషన్ విచారించింది. ఐఏఎస్లు పలు డాక్యుమెంట్లను సమర్పించకపోవడం, వారిని ఓపెన్ కోర్టులో విచారించాల్సి ఉండడంతో మరోసారి గడువును పొడిగించాల్సి వచ్చింది.

Read more:Karimnagar:కన్నీరు తెప్పిస్తున్న రామలింగం ఉదంతం

Related posts

Leave a Comment