Hyderabad:బై బ్యాక్ స్కీం పేరుతో భారీ మోసం.:హైదరాబాద్‌లో మోసాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అమాయకులే లక్ష్యంగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ బురిడీ కొట్టిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు, బంగారం, ప్లాట్లపై పెట్టుబడి అంటూ అందిన కాడికి దోచేస్తున్నారు. లక్షలు, కోట్లు సేకరిస్తూ భారీ మొత్తంలో డబ్బులు చేతికొచ్చిన వెంటనే ఉడాయిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహానగరంలో మరొకటి చోటు చేసుకుంది.బై బ్యాక్ స్కీమ్ పేరిట వీ ఓన్ ఇన్‌ఫ్రా సంస్థ 12 కోట్లకు టోకరా పెట్టింది.
బై బ్యాక్ స్కీం పేరుతో భారీ మోసం.
హైదరాబాద్, మార్చి 14
హైదరాబాద్‌లో మోసాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అమాయకులే లక్ష్యంగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ బురిడీ కొట్టిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు, బంగారం, ప్లాట్లపై పెట్టుబడి అంటూ అందిన కాడికి దోచేస్తున్నారు. లక్షలు, కోట్లు సేకరిస్తూ భారీ మొత్తంలో డబ్బులు చేతికొచ్చిన వెంటనే ఉడాయిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహానగరంలో మరొకటి చోటు చేసుకుంది.బై బ్యాక్ స్కీమ్ పేరిట వీ ఓన్ ఇన్‌ఫ్రా సంస్థ 12 కోట్లకు టోకరా పెట్టింది. వీ వోన్ ఇన్ఫ్రా గ్రూప్‌ను కూకట్‌పల్లి కేంద్రంగా ప్రారంభించిన సురేశ్, వెంకటేశ్, వంశీకృష్ణ.. అమాయకులను నట్టేట ముంచేశారు. ఓపెన్ ప్లాట్లు, బంగారంపై పెట్టుబడులు పెడితే బై బ్యాక్ పాలసీ కింద.. ప్రతి నెలా రిటర్న్స్ ఇస్తామని, అలాగే 25 నెలల్లో రెట్టింపు లాభాలు ఇస్తామని నమ్మబలికారు. ఏజెంట్లను నియమించుకుని 90 మంది నుంచి ఏకంగా 12 కోట్లు వసూలు చేశారు.
అయితే 2 స్కీముల్లో పెట్టుబడి పెటిన వారంతా లాభాల కోసం ఎంత ఎదురు చూసినా నగదు మాత్రం చెల్లించలేదు నిర్వాహకులు. రోజులు, నెలలు గడుస్తున్నా డబ్బులు మాత్రం తిరిగి రావడం లేదు.సంస్థ కార్యాలయానికి వెళ్లినా పొంతన లేని సమాధానాలు ఎదురవుతున్నాయి. మోసపోయామని గ్రహించిన 25 మంది బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నగదు ఎలాగైనా తిరిగి ఇప్పించాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు వెంకటేశ్, వంశీకృష్ణను అరెస్టు చేయగా.. ప్రధాన నిందితుడు, కీలక సూత్రధారి సురేశ్ మాత్రం పరారీలో ఉన్నాడు. అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నామని, బాధితులకు ఎలాగైనా న్యాయం చేస్తామని ఈవోడబ్ల్యూ పోలీసులు చెబుతున్నారు.ఇక ఇటీవల ఈ-బైక్స్ దందా స్కామ్ బయటపడిన సంగతి తెలిసిందే.. పైకి.. ప్రశాంతంగా కనిపించినా.. లోపల నడిచే దందా వేరే ఉంది. వేలు కట్టండి.. కోట్లు సంపాదించండని ఆశ పెట్టి.. ఫుల్లుగా క్యాష్ చేసుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తున్న ఈ స్కామ్ స్కీమ్.. వేలాది మంది నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. ఎలక్ట్రిక్ బైకులని ముందుపెట్టి.. మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాని జోరుగా నడిపిస్తున్నారు. ముందు మీరు 15 వేలు కట్టండి.. మరో ఇద్దరితో చెరో 15 వేలు కట్టించండి. మీకు పది వేలు కమీషన్ వస్తుందని చెబుతున్నారు. అలా.. ఈ బిజినెస్‌లో దిగి కోట్లు సంపాదించామని కూడా చెప్పుకునే వాళ్లున్నారు.ఇది.. ఇలా ఉంటుంది ఈ దందా. పేరుకే.. ఎలక్ట్రిక్ బైకుల బిజినెస్. తెరవెనుక దందా జరిగే దందా వేరే. బైక్ షోరూంలు పెట్టి.. అసలు బైకే కొనాల్సిన అవసరం లేదని వాళ్లే చెబుతారు. ఒకవేళ మీకు బైక్ కావాలంటే.. మిగతా డబ్బులు చెల్లించి బైక్ కూడా తీసుకోవచ్చు. లేదంటే.. వాళ్లిచ్చే ఐడీతో.. వ్యాపారంలోకి దిగొచ్చు.గతంలో.. ఈ తరహా మోసాలు, స్కీమ్‌లు, స్కామ్‌లు చాలానే జరిగాయి. కొన్ని వందల కోట్లు వసూలయ్యే దాకా బాగానే నడిపిస్తారు.
ఓ స్టేజ్ దాటాక.. కింది లెవెల్‌లో లక్షల మంది ఉంటారు. అలా.. వారి కింద జాయిన్ అయ్యేందుకు ఎవరూ ఉండరు. ఆ టైమ్‌కి కంపెనీ పెట్టినోళ్లు జంప్ అయిపోతారు. ఆఖరికి వచ్చేసరికి.. కింది స్థాయిలో ఉన్నోళ్లకి.. డబ్బులు రాక, జాయిన్ అయ్యేందుకు ఎవరూ లేక.. వేలాది మంది కోట్లాది రూపాయలు లాస్ అవుతారు. అప్పుడు.. కొత్తగా డబ్బులు కట్టి జాయిన్ అయినవాళ్లు.. ఎవరిని నిలదీస్తారు? కంపెనీనా? వాళ్లని ఆ స్కీమ్‌లో చేర్పించిన వారినా? ఇప్పటికిప్పుడు.. ADMS కంపెనీ బోర్డు తిప్పేస్తే పరిస్థితేంటి? లీగల్‌గానూ ఏమీ చేయలేని పరిస్థితి వస్తే దిక్కెవరు? నష్టపోయిన వాళ్లకు డబ్బును చెల్లించేదెవరు? మొదట్లో కోట్లు సంపాదించుకున్నామని చెప్పిన వాళ్లంతా.. కింది స్థాయిలో ఉన్నోళ్లకి డబ్బులు తిరిగి ఇస్తారా? ఇలా.. అనేక ప్రశ్నలు, సందేహాలున్నాయి.
Read more:Hyderabad:సౌత్ తో జతకడుతున్న రేవంత్