Hyderabad:బీసీల ఛుట్టూనే రాజకీయం:తెలంగాణలో రాజకీయాలు బీసీల చుట్టూనే తిరుగుతున్నా యా? అధికార కాంగ్రెస్ పార్టీ వేసిన అస్త్రానికి విపక్షాల్లో వణుకు మొదలైందా? అదే జరిగితే తమ పరిస్థితి ఏంటని నేతలు ఎందుకంటున్నారు? వచ్చే ఎన్నికలు బీసీల చుట్టూనే రాజకీయాలు తిరుగుతాయా? అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది అసలు చర్చ. దీనిపై హైకమాండ్ నుంచి నేతలకు ఎలాంటి సంకేతాలు వచ్చాయి?రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేయాలి. సమయం, సందర్భంగా వ్యవహరించిన వారు మాత్రమే నిలదొక్కుకుంటారు.
బీసీల ఛుట్టూనే రాజకీయం
హైదరాబాద్,, ఫిబ్రవరి 21
తెలంగాణలో రాజకీయాలు బీసీల చుట్టూనే తిరుగుతున్నా యా? అధికార కాంగ్రెస్ పార్టీ వేసిన అస్త్రానికి విపక్షాల్లో వణుకు మొదలైందా? అదే జరిగితే తమ పరిస్థితి ఏంటని నేతలు ఎందుకంటున్నారు? వచ్చే ఎన్నికలు బీసీల చుట్టూనే రాజకీయాలు తిరుగుతాయా? అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది అసలు చర్చ. దీనిపై హైకమాండ్ నుంచి నేతలకు ఎలాంటి సంకేతాలు వచ్చాయి?రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేయాలి. సమయం, సందర్భంగా వ్యవహరించిన వారు మాత్రమే నిలదొక్కుకుంటారు. లేకుంటే వెనుకబడిపోవడం ఖాయం. తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు బీసీల చుట్టూనే తిరుగుతోంది. కాంగ్రెస్ ప్లాన్ ప్రకారం బీసీలకు రాజ్యాధికారం కావాలనే పట్టుబడుతున్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ. ఈ క్రమంలో తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడాదిలోపు కులగణన చేపట్టారు. రాష్ట్ర జనాభాలో బీసీలు 56 శాతం ఉందని నివేదిక తేల్చింది.తెలంగాణకు భవిష్యత్తులో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని బయటపెట్టారు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. రాష్ట్రానికి బీసీ వ్యక్తిని సీఎం చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఐదేళ్లు కొనసాగుతారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు బీసీల చుట్టూనే తిరుగుతాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని ఓబీసీ సెల్ కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు ఆయన.ఈ వ్యవహారంపై మిగతా రాజకీయ పార్టీల్లో చర్చ మొదలైంది. 2014 ఎన్నికల్లో బీసీ వ్యక్తి సీఎం అనే నినాదాన్ని ఎత్తుకుంది టీడీపీ.
ఆ సమయంలో టీడీపీకి బాగానే సీట్లు వచ్చాయి. ఇక 2023 నాటికి వద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారని చెప్పుకొచ్చారు ఆయన.కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడానికి అప్పట్లో ఈ ఫార్ములాను అమిత్ షా ఉపయోగించారనే ప్రచారం సాగింది. ప్రస్తుతానికి వచ్చేద్దాం.. రాహుల్‌గాంధీ మొదటి నుంచి బీసీ నినాదం ఎత్తుకున్నారు. ఈ విషయంలో బీజేపీ తర్జన భర్జన పడుతోంది. ఏం చెయ్యాలో తికమక పడుతోంది. కనీసం కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లుగా కులగణన చేయడానికి ముందుకు రావడంలేదు.ఇక బీఆర్ఎస్ విషయానికొద్దాం. టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ చేసిన కామెంట్స్ బీఆర్ఎస్లో అప్పుడే అలజడి మొదలైనట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి బీసీయేనని చెప్పడంతో ఒక్కసారిగా నేతలు షాకయ్యారు. దీనిపై ఏ ఒక్కరూ నోరు ఎత్తకూడదని సంకేతాలు వెళ్లినట్టు ప్రచారం మొదలైపోయింది.2014 ఎన్నికల్లో తెలంగాణ వస్తే దళితుడ్ని సీఎం చేస్తామని కేసీఆర్ పదేపదే చెప్పుకొచ్చారు. గడిచిన పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో బీసీ, మహిళలకు సరైన ప్రాధాన్యత దక్కలేదని చాలామంది నేతల మాట. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ విసిరిన బీసీ బాణం.. అప్పుడే ఆ పార్టీలో చర్చకు దారితీసిందని సమాచారం. మరి జాతీయ పార్టీల మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ నినాదం ఎత్తుకుంటుందా? అన్నదే అసలు పాయింట్. మొత్తానికి కాంగ్రెస్ ట్రాప్‌లో కారు పడినట్టేనని అంటున్నారు.
Read more:Nizamabad:అందుబాటులోకి మరో వెటర్నరీ వ్యాక్సిన్ సెంటర్