Hyderabad:బిగ్ బాస్ హోస్ట్ గా దేవరకొండ విజయ్

Bigg-Boss host vijay devarkonda

Hyderabad:బిగ్ బాస్ హోస్ట్ గా దేవరకొండ విజయ్:ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలయ్యే బిగ్ బాస్ సరికొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత సీజన్ యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కంటెస్టెంట్స్ అందరూ అద్భుతంగా ఆడినప్పటికీ, అక్కినేని నాగార్జున సరిగా హోస్టింగ్ చేయకపోవడం వల్ల, ఈ సీజన్ పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది.

బిగ్ బాస్ హోస్ట్ గా దేవరకొండ విజయ్

హైదరాబాద్, మార్చి 10
ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలయ్యే బిగ్ బాస్ సరికొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత సీజన్ యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కంటెస్టెంట్స్ అందరూ అద్భుతంగా ఆడినప్పటికీ, అక్కినేని నాగార్జున సరిగా హోస్టింగ్ చేయకపోవడం వల్ల, ఈ సీజన్ పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకున్నాడు. మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని వంటి వారు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత మూడవ సీజన్ నుండి, 8 వ సీజన్ వరకు నాగార్జునహోస్ట్ గా వ్యవహరించాడు. అన్ని సీజన్స్ కి ఆయన హోస్టింగ్ బాగానే ఉన్నింది కానీ, సీజన్ 8 కి మాత్రం ఆయన హోస్టింగ్ పెద్ద దెబ్బ కొట్టింది.గత సీజన్ ని చూసిన ప్రతీ ఒక్కరు, ఇక నాగార్జున పని అయిపోయింది, హోస్ట్ ని తదుపరి సీజన్ నుండి మార్చకపోతే, బిగ్ బాస్ పని కూడా అయిపోతుందని గట్టిగా విశ్లేషణలు వచ్చాయి.

అందుకే నాగార్జున ని ఈ సీజన్ నుండి తప్పించబోతున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ దాదాపుగా ఖరారు అయ్యినట్టే అని అంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ కొన్ని కండీషన్స్ ని పెట్టాడట. తాను ఏ కంటెస్టెంట్ పట్ల కూడా బయాస్ గా ఉండనని, స్క్రిప్ట్ ప్రకారం నేను వెళ్లానని, కేవలం ఎపిసోడ్ ని మాత్రమే అనుసరించి హోస్టింగ్ చేస్తానని తెగేసి చెప్పాడట. అందుకు బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత సీజన్స్ లో కొంతమంది కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ టీం కావాలని వెనకేసుకొని వస్తున్నట్టుగా అనిపించేది. అలాంటివి నా హోస్టింగ్ లో నడవదు అని విజయ్ దేవరకొండ చెప్పాడట.అదే విధంగా ఈ సీజన్ కి హోస్టింగ్ చేసేందుకు ఆయన 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఇది బిగ్ బాస్ హిస్టరీ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అట. అదే విధంగా కంటెస్టెంట్స్ విషయం లో కూడా ఈసారి జాగ్రత్తలు చాలా గట్టిగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రేక్షకులకు బాగా ముఖ పరిచయం ఉన్నవాళ్ళని తీసుకొస్తున్నారట. చూడాలి మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది.

Read more:Lucknow:ప్రయాగ్ రాజ్ లో 600 టన్నుల వ్యర్ధాలు

Related posts

Leave a Comment