Hyderabad:బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్

KCR to attend budget meetings

Hyderabad:బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్:తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఏడాది గ్యాప్ తరువాత అసెంబ్లీకి వచ్చేందుకు సిద్దమైయ్యారనే వార్త బిఆర్ ఎస్ క్యాడర్ లో మాంచి జోష్ నింపింది. అవును మీరు వింటున్నది నిజమే , ఈ నెల 12వ తేది నుండి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైయ్యేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నారట. సరిగ్గా ఏడాది క్రితం బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీకి వచ్చినా , అది ఒక్కరోజే , అలా బడ్జెట్ అవ్వగానే, ఇలా మీడియా పాయింట్ లో మాట్లడి వెళ్లిపోయారు.

బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్

హైదరాబాద్, మార్చి 8
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఏడాది గ్యాప్ తరువాత అసెంబ్లీకి వచ్చేందుకు సిద్దమైయ్యారనే వార్త బిఆర్ ఎస్ క్యాడర్ లో మాంచి జోష్ నింపింది. అవును మీరు వింటున్నది నిజమే , ఈ నెల 12వ తేది నుండి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైయ్యేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నారట. సరిగ్గా ఏడాది క్రితం బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీకి వచ్చినా , అది ఒక్కరోజే , అలా బడ్జెట్ అవ్వగానే, ఇలా మీడియా పాయింట్ లో మాట్లడి వెళ్లిపోయారు. అది మొదలు ఆ తరువాత అసెంబ్లీ వైపే కన్నెత్తి చూడలేదు గులాబి బాస్ . కానీ సారి అలా కాదట, అది కొత్త ప్రభుత్వం కాబట్టి వదిలేశాం , ఇప్పుడు అలా కాదు..గులాబి గట్టిదెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారట కేసిఆర్. తాజాగా క్యాబినేట్ నిర్ణయంతో అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారైయ్యాయి. ఈనెల 12వ తేది నుండి 27వ తేది వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి.

ఈనేపధ్యంలో సమావేశాల మొదటి రోజునుండే ఈసారి కేసీఆర్ హాజరు కాబోతున్నారని సన్నిహితుల చెప్పేశారట. గత ఏడాది బడ్జెట్ అవ్వగానే రావడం కాకుండా ఈసారి బడ్జెట్ లో లోపాలు, కేటాయింపులను ఎత్తిచూపడంతోపాటు ,పెండింగ్ ప్రాజెక్టుల మొదలు ఆరు గ్యారంటీల వరకూ అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కులు చూపించాలని ఫిక్స్ అయ్యారట కేసిఆర్. ఇప్పటి నుండి క్యాడర్ కు సంకేతాలు ఇవ్వడంతోపాటు అధికార పార్టీని ఇరుకున పెట్టే వ్యూహాలకు పదునుపెట్టార పెద్దాయన.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఎక్కువశాతం ఫామ్ హౌస్ నుండే పార్టీని నడిపిస్తున్న కేసిఆర్. గత ఏడాది మూడు సార్లు మాత్రమే తెలంగాణ భవన్ లో పార్టీనేతలు, కార్యకర్తలతో విస్తృతస్దాయి సమావేశాలు నిర్వహించారు. రెండు వారాల క్రితం జరిగిన పార్టీ సమావేశంలో ఇకపై ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.అంతేకాదు అన్ని గమనిస్తున్నాని , నేను కొడితే దెబ్బ ఎలా ఉంటదో చూపిస్తానంటూ హాట్ కామెంట్స్ తో బిఆర్ ఎస్ క్యాడర్ లో కొత్త జోష్ నింపారు. అలా దాదాపు తక్కువ సందార్భాల్లో మాత్రమే బయటకు వస్తూ, అరుదుగా మాత్రమే మాట్లడుతున్న కేసీఆర్ పై గత కొంత కాలంగా అధికార కాంగ్రెస్ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.

దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లడాలి కేసిఆర్ అంటూ ఆ పార్టీ మంత్రులు బహిరంగ సవాలు విసురుతున్నారు. ఎవరు ఇంతలా టార్గెట్ చేసినా , వ్యూహాత్మక మౌనం వహించిన కేసిఆర్ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లాల్సిన టైమొచ్చిందని ఫిక్సైయ్యాట.ఆరు గ్యారెంటీల అమలులోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పథకాలు అమలు ప్రారంభించినా, లబ్ధిదారుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగుల ఆందోళనలు,రైతుల సాగునీటి కష్టాలు, ఆర్దిక భారంతో రైతు ఆత్మహత్యలు, ముందుకు సాగని సాగునీటి ప్రాజెక్టులు ఇలా వీటికితోడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన 420హామీలు ఇలా ఇవన్నీ నిలదీయాల్సిన సమయం ఇదేనని భావించిన గులాబి బాస్ రాబోయే అసెంబ్లీ సమావేశలు వేదికగా దూసుకుపోనున్నారటఇదిలా ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదంటూ హైకోర్టులో ఇప్పటికే పిటీషన్ దాఖలైయ్యింది. అనర్హత వేటు కూాడా వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో ఇక డుమ్మా కొట్టడం అన్ని విధాలా అనుకూలం కాదనే రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. అయితే బిఆర్ స్ కేడర్ నుండి విభిన్న వాదనలు విపిస్తున్నాయి. కేసిఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో దిగజారి మాట్లడతారు, దూరంగా ఉంటే మంచదని కొందరంటుంటే, కాదు కేసిఆర్ రావాలి, రేవంత్ ప్రభుత్వాన్ని అసెంబ్లీనే నిలదీయాలని మరో వర్గం నేతలు భావిస్తున్నారట. మొత్తానికి ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కేసిఆర్ మాత్రం అసెంబ్లీకి ఈసారి కచ్చితంగా వస్తున్నారని ఆయన సన్నిహితులు తేల్చేశారు.
Read more:Mahabubnagar:అడగడుగునా ఉల్లంఘనలు. టన్నెల్ ప్రమాదంలో అంతులేని ప్రశ్నలు

Related posts

Leave a Comment