Hyderabad:ఫ్లై ఓవర్లు కింద గేమింగ్ జోన్స్..

Gaming zones under the flyovers..

Hyderabad:ఫ్లై ఓవర్లు కింద గేమింగ్ జోన్స్..:హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొత్తగా ఫ్లైఓవర్లు నిర్మించిన సంగతి తెలిసిందే. చాలా ప్రాంతాల్లో కొత్తగా ఫ్లైఓవర్లు నిర్మించారు. కొన్ని ఏరియాల్లో అయితే కి.మీ పొడవునా వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లైఓవర్ల కింద చాలా విశాలమైన స్థలాలు ఉన్నాయి. ప్రస్తుతం అవి నిరూపయోగంగా ఉండగా.. మల్టీ పర్పస్‌గా వాటిని వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఫ్లై ఓవర్లు కింద గేమింగ్ జోన్స్..

హైదరాబాద్, ఫిబ్రవరి 18,
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొత్తగా ఫ్లైఓవర్లు నిర్మించిన సంగతి తెలిసిందే. చాలా ప్రాంతాల్లో కొత్తగా ఫ్లైఓవర్లు నిర్మించారు. కొన్ని ఏరియాల్లో అయితే కి.మీ పొడవునా వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లైఓవర్ల కింద చాలా విశాలమైన స్థలాలు ఉన్నాయి. ప్రస్తుతం అవి నిరూపయోగంగా ఉండగా.. మల్టీ పర్పస్‌గా వాటిని వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఎక్కువ వెడల్పు ఉన్న పైవంతెనలను జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటికే షేక్‌పేట ఫ్లైఓవర్‌ను క్రీడా మైదానంలా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.ప్రస్తుతం చాలా కాలనీలకు పార్కులు, ఆట స్థలాల కొరత ఉండగా.. దాన్ని కొంత వరకైనా భర్తీ చేసేందుకు.. ఫ్లైఓవర్ల కింద ఉండే స్థలాన్ని ఉపయోగించుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సీఎం సూచనల మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు నగరంలోని ఫ్లైఓవర్లపై అధ్యయనం చేస్తున్నారు. ఎక్కడైతే మల్టీపర్పస్‌గా వినియోగించుకోవటానికి వీలుటుందో వాటిపై అధ్యయనం చేస్తున్నారు. షేక్‌పేట పైవంతెన మెుత్తం పొడవు 2.5కి.మీ కాగా, 24మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించారు. 24 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ కింద ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. సీఎం ఆదేశాల మేరకు అక్కడ పార్కు, గేమింగ్ జోన్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.ఇక ఆరాంఘర్‌-జూపార్కు కొత్త ఫ్లైఓవర్, జేఎన్‌టీయూ నుంచి మలేషియన్‌ టౌన్‌షిప్‌ ఫ్లైఓవర్, కొత్తగూడ కూడలి ఫ్లైఓవర్, లాలాపేట, నాగోల్, కామినేని కూడళ్ల ఫ్లైఓవర్లు కూడా చాలా ఎక్కువ వెడల్పుతో నిర్మించారు. వాటి కింద క్రీడా వసతులు కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకటో పిల్లరు నుంచి రెండో పిల్లరు మధ్య పచ్చదనానికి పాధాన్యం ఇస్తూ మొక్కలు, వాటి చుట్టూ కుర్చీలు, నడక మార్గం ఏర్పాటు చేస్తారు. రెండు, మూడో పిల్లర్ల మధ్య కార్లు, బైకులకు పార్కింగ్‌ వసతి కల్పిస్తారు. మూడు, నాలుగో పిల్లర్ల మధ్య యోగా సెంటర్, పిల్లల పార్కు, ఓపెన్‌ జిమ్‌ వంటివి ఏర్పాటు చేయనున్నారు. నాలుగు, ఐదో పిల్లర్ల మధ్య స్కేటింగ్‌ రింగ్‌, ఐదు, ఆరో పిల్లర్ల మధ్య బ్యాడ్మింటన్‌ కోర్టు, సీటింగ్‌ ఏరియా ఏర్పాటు చేస్తారు. ఆరు, ఏడో పిల్లర్ల మధ్య బాక్స్‌ క్రికెట్‌. ఏడు, ఎనిమిదో పిల్లర్ల మధ్య మొక్కలు, కుర్చీలు. ఏర్పాటు చేస్తారు. ఒకటో పిల్లరు నుంచి ఎనిమిదో పిల్లరును కలుపుతూ అంచుల్లో వాకింగ్ ట్రాక్, సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తారు.

Read more:Hyderabad:పౌల్ట్రీ రైతులకు కోట్లల్లో నష్టం

Related posts

Leave a Comment