తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయాల్లో మార్పు కనిపించింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారిని బీఆర్ఎస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. పీఛే మూడ్
హైదరాబాద్, జనవరి 17
తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయాల్లో మార్పు కనిపించింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారిని బీఆర్ఎస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నారు. అదే సమయంలో ఇంకా చాలా మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని గతంలో కేసీఆర్ చేసినట్లుగా బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ ఫిరాయింపుల నెంబర్ పది మందితోనే ఆగిపోయింది. ఇప్పుడు చేరిన ఆ పదిమందిలోనూ కొంత మంది వెనక్కి వెళ్తుననారన్న ప్రచారం ఊపందుకుందిదానం నాగేందర్ కాంగ్రెస్ కు మెల్లగా దూరమవుతున్నారని ఆయన మాటల్ని బట్టి రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి కిషన్ రెడ్డికి గట్టిపోటీ ఇచ్చారు. అయితే తనకు కాంగ్రెస్ సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుకుంటున్నారు. అసలు పట్టించుకోవడంలేదన్న ఉద్దేశంతో మళ్లింది కొత్త కొత్త ప్రకటనలు ప్రారంభించారు. కేటీఆర్ ప్రకటనలను సమర్థిస్తూ మీడియాతో మాట్లాడుతున్నారు. ఫార్ములా ఈ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని.. అందుకే తాము నిధులు మంజూరు చేశామని కేటీఆర్ చెబుతున్నారు. ఇదే వాదనను దానం నాగేందర్ సమర్థించారు. పార్ములా ఈ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందన్నారు. అదే సమయంలో హైడ్రా పై కూడా నాగేందర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.దీని వల్ల ప్రజలకు.. హైదరాబాద్కు చాలా నష్టం జరుగుతోందన్నారు.
యూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసెంబ్లీలో కేటీఆర్ పై బూతులు మాట్లాడిన వైనం, హెచ్చరించిన వైనం తప్పేనని.. ఆ విషయంలో తాను కేటీఆర్ ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెప్పానని అంటున్నారు. దానం నాగేందర్ తీరు చూస్తే.. ఏదో తేడాగా ఉందన్న అభిప్రాయానికి కాంగ్రెస్ నేతలు వస్తున్నారు. గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ తో మళ్లీ టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికను కాంగ్రెస్ క్యాడర్ వ్యతిరేకించింది. పార్టీలో చేరిన తర్వాత కూడా ఎవరూ ఆయనను కలిసేందుకు రాలేదు. చివరికి ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన సరితా తిరుపతయ్య కూడా ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు అంగీకరించలేదు. వీరెవరినీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సముదాయించలేదని.. కాంగ్రెస్ లో ఇమడలేని పరిస్థితులు కల్పిస్తున్నారని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భావిస్తున్నారు. అప్పట్లోనే మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయనతో చర్చించి.. రాజకీయంగా హడావుడి నిర్ణయాలు తీసుకుని నష్టపోవద్దని నచ్చచెప్పారు. కారణం ఏదైనా పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు.ఇప్పుడు వారు అధికార పార్టీగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ తమకు ఇచ్చిన హమీలు నెరవేర్చినా నెరవేర్చకపోయినా.. అధికార పార్టీ ఎమ్మెల్యే అనే హోదా మాత్రం ఉంటుంది. ఈ కారణంగా ఎమ్మెల్యేలు వెనక్కి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించరని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు వెనక్కి వస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు కానీ అది జరగదని అంటున్నారు.పైగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరికొంత మంది ఎమ్మెల్యేలు త్వరలోనే వచ్చి కాంగ్రెస్ లో చేరుతారని అంటున్నారు.
Read:Hyderabad:వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ