Hyderabad:ఫార్ములా ఈ రేసు పెమెంట్ తీరు తప్పు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు:ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించటాన్ని తాము ఎప్పుడూ తప్పు పట్టలేదు. పేమెంట్ జరిగిన తీరును తప్పు పట్టామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఫార్ములా ఈ రేసు పెమెంట్ తీరు తప్పు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్
ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించటాన్ని తాము ఎప్పుడూ తప్పు పట్టలేదు. పేమెంట్ జరిగిన తీరును తప్పు పట్టామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పేమెంట్ ప్రొసీసర్ సరిగా లేనప్పుడు ఫార్ములా ఈ రేస్ ను ఎలా కొనసాగిస్తాం. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతాయి. హైదరాబాద్ వేదికగా మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతాయి. దాదాపు 140 దేశాలు పాలుపంచుకుంటాయని అన్నారు
Read also:అసెంబ్లీలో సీఎం ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మార్చురీకి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండించింది. రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసింది.
Read also:బీజేపీ ఎమ్మెల్సీల ప్రత్యేక పూజలు
శనివారం ఉదయం భాగ్యలక్ష్మి ఆలయం, చార్మినార్, హైదరాబాద్ వద్ద నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు అంజి రెడ్డి, కొమరయ్య ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నేతలు చింతల రామచంద్ర రెడ్డి, NVSS ప్రభాకర్, N. రామచందర్ రావు, పాయల్ శంకర్, వెంకట్ రమణ రెడ్డి తదితరులు హజరయ్యారు.
Read alsoమురికి కాలువల్లోకి మిషన్ భగీరథ నీళ్లు
– లీకులు సరి చేయరు.. మరమ్మతుల ఊసు లేదు
– సిబ్బంది నిర్లక్ష్యం అధికారుల పట్టింపు లేని తనం
– రోజు గంటల తరబడి వేల లీటర్లు నీరు వృధా
– నీటి వృధా అరికట్టకపోతే వేసవి కష్టాలు తప్పవు
– జిల్లా కేంద్రంలో ఎక్కడైనా ఇదే కథ
పెద్దపల్లి
మంచి లక్ష్యంతో ప్రతిష్టత్మాకంగా మొదలైన మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా నీరు పెద్దపల్లి జిల్లాతో పాటు పెద్దపల్లిలో నిర్వహణ లోపం, అసంపూర్తి పనులు, కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యంతో ఇప్పటికి అబాసు పాలవుతూనే ఉన్నది. పెద్దపల్లి పట్టణంలో మిషన్ భగీరథ నీటి సరఫరా, పర్యవేక్షణ అధికారం మున్సిపల్ కమిషనర్ అధీనం లో ఉన్నది. మున్సిపల్ లో 36 వార్డులు ఉండగా నీటి సరఫరా నీటి సరఫరాను ప్రతి వార్డులోని ఆయా గల్లీలకు రోజు వారి పద్ధతిలో వదులుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, అసలు సమస్య నిత్యం కొన్ని వేల లీటర్లు వృధాగా పోతూనే ఉన్నాయి. కాంట్రాక్టర్లు పంపుల బిగింపు సరిగా చేయక పోవడం, దానికి తోడు నీటి అవసరం లేని వాళ్ళకు కూడా పైపులు బిగించారు.
దీంతో పలు వార్డుల్లో ప్రజలు నీటి లీకేజి సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా, నీటి అవసరం లేని వాళ్ళు మాత్రం సదరు భగీరథ మంచినీటిని మురికి కాలువలు, సెప్టిక్ ట్యాంక్ ల్లోకి వదిలి పెడుతున్నారు. దీంతో పలు వార్డుల్లో రోజు కొన్ని వేల లీటర్లు మంచి నీరు వృధాగా పోతున్నాయి. ఇక నీటిని వదిలే సిబ్బంది సమయ పాలన లేకపోవడం మరి దారుణం. నీటిని వదిలితే సుమారు రెండు గంటల వరకు కూడా నీరు వృధాగా పోతున్నా పట్టించుకోరు. తమ డ్యూటీ వదలడం, నిలిపి వేయడం మాత్రమే అంటున్నారు. అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉన్నా వారి జాడ ఎక్కడ కానరావడం లేదు. ఇలా ప్రతి నిత్యం 36 వార్డుల్లో కొన్ని వేల లీటర్లు నీరు వృధాగా పోతున్నా నివారణ చర్యలు శూన్యం. అసలే ఎండా కాలం ఇంకా రెండు నెలలు బానుని తీవ్రత పెరుగు తున్నది. నీటి కష్టాలు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైనా, ఇక్కడి మున్సిపల్ అధికారులకు మాత్రం విధి నిర్వహణ మరిచిపోయినట్లు ఉన్నారు.
దీనికి తోడు ప్రతి వార్డులో నీటి లికేజీలు దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడ మరమ్మతులు చేసినా అవి లాంటి ఫలితాలు ఇవ్వకపోగా భారీ ఎత్తున నీటి లీకేజిలతో చిన్నపాటి కాలువలు తలపిస్తున్నాయి. ప్రతినిత్యం పట్టణంలో తిరిగే అధికారులకు ఈ దృశ్యాలు ఎందుకు కనిపించడం లేదో అర్ధం కానీ ప్రశ్న. జిల్లా అధికారుల సమీక్షలు కూడా వీరి నిర్లక్ష్యంతో వృధా ప్రయాసే అవుతున్నది. పట్టణంలోని అమర్ నగర్, సుభాష్ నగర్, జెండా చౌరస్తా గల్లీ, తెనుగువాడ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ వార్డు పరిశీలించిన ఇదే తంతు కొనసాగుతున్నది. ఆలాగే రోడ్డు మీద చాలా మంది భగీరథ నీరును వాహనాలు శుభ్రం చేసుకోవడం తదితర పనులకు వినియోగించు కోవడం కూడా జరుగుతున్నది. ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చేలా కొన్ని కోట్ల వ్యయంతో బృహత్తార పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంటే, అధికారుల నిర్లక్ష్యం మూలంగా వృధా అవుతున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నీటి వృధాను, లీకేజిలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. వేసవి నీటి కష్టాలు రాకముందే మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Read more:Hyderabad:సస్పెన్షన్ కు విరుగుడు మంత్రం.. వ్యూహాల్లో గులాబీ నేతలు