Hyderabad:ప్రతిపక్షం కమలమేనా

Telangana MLC election

Hyderabad:ప్రతిపక్షం కమలమేనా:తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది? రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? బీజేపీకి అంతర్గతంగా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినట్టేనా? ఈ ఎన్నికల్లో బోర్లా పడిందెవరు? బీఆర్ఎస్ కోట క్రమంగా బద్దలువుతున్నట్లేనా? అవుననే సంకేతాలు ఆ పార్టీ నేతల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి.

ప్రతిపక్షం కమలమేనా

హైదరాబాద్, మార్చి 5
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది? రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? బీజేపీకి అంతర్గతంగా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినట్టేనా? ఈ ఎన్నికల్లో బోర్లా పడిందెవరు? బీఆర్ఎస్ కోట క్రమంగా బద్దలువుతున్నట్లేనా? అవుననే సంకేతాలు ఆ పార్టీ నేతల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి. కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ‌ల్లో బీజేపీ మద్దతుదారు మల్క కొమరయ్య గెలిచారు. దీంతో ఆ పార్టీ నేతలు ఫుల్‌ఖుషీగా ఉన్నారు. బీజేపీ గెలుపు తర్వాత మీడియా ముందుకొచ్చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రధాని నరేంద్రమోదీ పట్ల నమ్మకంతో ఈ తీర్పు వచ్చిందన్నారు సంజయ్. ఈ గెలుపు టీచర్లకు, మోదీకే అంకితమన్నారు. ఇది మామూలు విజయం కాదన్నారు. దేశ వ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీ పట్ల నమ్మకంతో ఉన్నారు. బడ్జెట్‌లో ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు వల్లే ఈ తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చారు.ఆనాడు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీగా ఏవీఎన్ రెడ్డిని గెలిపించారన్నారు కేంద్రమంత్రి సంజయ్. 317 జీవోపై బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలు, లాఠీ ఛార్జ్ గుర్తుంచుకున్న ఉపాధ్యాయులు కొమరయ్యను గెలిపించారని తెలిపారు. హేళన చేసిన వారందరీ చెంప చెళ్లుమన్పించేలా తీర్పు ఇచ్చారన్నారు.

బండి సంజయ్ చెప్పిన పాయింట్‌లో కీలకమైనది ఉద్యోగులకు పన్ను మినహాయింపు. ఎన్నికల్లో దీని ప్రభావం బాగానే కనిపించింది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ముమ్మాటికీ నిజం. ఎందుకంటే ఉపాధ్యాయులంతా ఆ పన్ను పరిధిలో వారే కావడం బీజేపీకి కలిసొచ్చింది. మొన్నటికి మొన్న ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు పన్ను సడలింపు కలిసి వచ్చిందని కొందరు ఆ పార్టీ నేతలు బలంగా చెప్పారు కూడా. ఇక్కడా అలాంటి ఫలితమే పునరావృతమైందిఇక్కడ బీజేపీ గెలిచిందని చెప్పడం కంటే.. బీఆర్ఎస్ కోటకు బీటలు పడుతున్నాయని అంటున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే నార్త్ తెలంగాణలో బీజేపీ తన జోరును కొనసాగించింది. అసెంబ్లీ, లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరు కొనసాగించింది. ఒకప్పుడు అక్కడ బీఆర్ఎస్ చాలా బలంగా ఉండేది. ఇప్పుడు చతకిలపడిపోయింది. ఇలాంటి ఫలితాలు వస్తాయని ముందుగానే కారు పార్టీ భావించి, ఎన్నికల నుంచి తప్పుకుంది.ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతలు సమావేశాలు నిర్వహించారు. తమ ఓటు బ్యాంకు ఈసారి బీజేపీకి వేయాలని సంకేతాలు ఇచ్చారనే వాదనలు సైతం లేకపోలేదు. ఈ క్రమంలో బీజేపీ గెలిచిందని మరోవైపు వినిపిస్తున్నమాట. టీచర్ ఎమ్మెల్సీపై అధికార కాంగ్రెస్ పెద్దగా ఫోకస్ చేసిన సందర్భం లేదు.బీఆర్ఎస్ తీసుకొచ్చిన జీవో 317 పై వ్యతిరేకంగా ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతున్నాయి. బీజేపీ గెలుపు వెనుక ఇది కూడా ఓ కారణమని అంటున్నారు. ఈ విషయంపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. న్యాయ నిపుణులతో మంతనాలు చేస్తోంది. కొద్దిరోజుల్లో ఈ అంశం కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. జరుగుతున్న పరిణామాలు, ఫలితాలు చూస్తేంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ క్రమంగా పాగా వేస్తుందనే చెప్పాలి.

Read more:Hyderabad:మీనాక్షి మార్క్.. సమీక్షలు షురూ..

Related posts

Leave a Comment