Hyderabad:పాపం..బండ్లగణేష్

Hyderabad

Hyderabad:పాపం..బండ్లగణేష్:బండ్ల గణేష్ ఈ పేరుతో పరిచయం అక్కర్లేదు. ఆయన స్పీచులు, మాటలు, పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. తను స్టేజ్ ఎక్కితే చాలు పూనకాలు వచ్చేస్తాయి. తన చేతికి మైక్ దొరికితే పంచుల వర్షం కురిపిస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కౌంటర్లు వేస్తుంటారు.

పాపం..బండ్లగణేష్..

హైదరాబాద్ ఫిబ్రవరి 10
బండ్ల గణేష్ ఈ పేరుతో పరిచయం అక్కర్లేదు. ఆయన స్పీచులు, మాటలు, పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. తను స్టేజ్ ఎక్కితే చాలు పూనకాలు వచ్చేస్తాయి. తన చేతికి మైక్ దొరికితే పంచుల వర్షం కురిపిస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కౌంటర్లు వేస్తుంటారు. ఆడియో కాల్ లీక్‌లతో కాంట్రవర్సీల్లో ఇరుకుతుంటారు. ఇక కొన్ని సార్లు ట్విట్టర్లో తన బాధను, ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. ఒక్కోసారి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్వీట్లు సంచలనంగా మారిపోయి.. వివాదాలకు కారణం అవుతుంటాయి. అయినా ఆయన తగ్గేదేలే అంటారు. ముఖ్యంగా అప్పట్లో ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో ఎంతటి చర్చనీయాంశంగా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని ఆయన సరిలేరు మీకెవ్వరు సినిమాలో సందర్భానుసారం వచ్చే డైలాగులో కూడా చెప్పుకొచ్చారుటైం బాలేకపోతే తాడే పామై కరొవచ్చు అనే సామెత బండ్ల గణేష్ కు కరెక్టుగా సరిపోతుంది. మన టైం నడిచినప్పుడు శత్రువు కూడా శభాష్ అని పొగుడుతుంటారు. అదే టైం బ్యాడ్ అయితే నిక్కరు వేసుకోవడం రానోడు కూడా సూటూ బూటూ ఎలా వేసుకోవాలో క్లాసులు పీకుతుంటారు. ఆ మధ్య ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి డిజాస్టర్‌ కావడంతో డైరెక్టర్ శంకర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి.. కీ ప్యాడ్ ఫోన్ నుంచి యాపిల్ 16వ వెర్షన్‌లోకి వచ్చేశామన్నారు.. ఫోన్ అప్డేట్ కాకపోతేనే అప్ డేట్ కాలేదని తెగ ఫీల్ అయిపోతాం. మనిషి అప్డేట్ కాకపోతే ఎట్టా.. 20 సంవత్సరాల ముందు నోకియా వాడాను.. నాకు అదే సెంటిమెంట్.. అది బ్లాక్ బస్టర్ ఫోన్ అంటే కుదరదు. ప్రతి మనిషి.. ప్రతి హీరో.. ప్రతి డైరెక్టర్.. ప్రతి నిర్మాత అప్డేట్ కావాల్సిందే అంటూ కామెంట్ చేశారు. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయిమరో సందర్భంలో జీవితంలో ఎవరిని నమ్మొద్దు మిమ్మలను మీరే నమ్ముకోవాలని సూచించారు. ఎవరి దగ్గర నుంచైనా సాయం ఆశిస్తే బిచ్చగాల్లలా చూస్తారంటూ సూక్తి వాక్యాలు కూడా చెప్పారు. కొన్నాళ్లుగా బండ్ల గణేష్ అయితే ఇకపై పూర్తిగా సినిమాల మీదే తన ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో తాను ఇన్నేళ్ల తర్వాత ఏదో వైరాగ్యం తెచ్చుకున్నట్లు అనిపిస్తున్నారు. నా తలరాత నేను ఏం మాట్లాడినా అలా జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. ఇంత వైరాగ్యం ఎందుకొచ్చింది బండ్లన్న అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేశారు. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ హంగామాలో బండ్లన్న మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి ఇంతలోనే ఇలా వైరాగ్యంలో మాట్లాడడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Read more:New Delhi:ఢిల్లీ సీఎం ఎవరు

Related posts

Leave a Comment