Hyderabad:పాపం.. దేవేందర్ గౌడ్:దేవేందర్‌గౌడ్ ఒకప్పుడు తెలుగు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన బీసీ నేత. ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా సుదర్ఘీ రాజకీయ అనుభవం ఉంది. ఎన్టీఆర్ కేబినెట్‌లో బీసీ మంత్రిగా, చంద్రబాబు క్యాబినెట్‌లో హోం మంత్రిపనిచేశారు.
పాపం.. దేవేందర్ గౌడ్
హైదరాబాద్, ఫిబ్రవరి 18
దేవేందర్‌గౌడ్ ఒకప్పుడు తెలుగు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన బీసీ నేత. ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా సుదర్ఘీ రాజకీయ అనుభవం ఉంది. ఎన్టీఆర్ కేబినెట్‌లో బీసీ మంత్రిగా, చంద్రబాబు క్యాబినెట్‌లో హోం మంత్రిపనిచేశారు. ఒక దశలో టీడీపీలో నంబర్ 2గా ఎదిగారు. కానీ ఓ తపుపడు నిర్ణయం అతడి రాజకీయ ప్రయాణానికి బ్రేక్ వేసింది. ఇక చంద్రబాబు నాయుకూడా దేవేందర్‌గౌడ్‌ను బాగా ఎంకరేజ్ చేశారు. 1988 నుంచి 2008 వరకు రాజకీయంగా ఎదురు లేకుండా ఉన్నారు. అయితే 2008లో దేవందర్‌గౌడ్ తీసుకున్న ఓ నిర్ణయం అతని రాజకీయ జీవితానికి శాపంగా మారింది. తెలంగాణ ఉద్యమం విషయంలో టీడీపీని వ్యతిరేకించి పార్టీకి రాజీనామా చేశారు.నవ తెలంగాణ పార్టీ స్థాపించారు. ఈ విషయంలో కేసీఆర్ దేవేందర్‌గౌడ్‌కు సారూప్యత ఉంది. కానీ, అది టీడీపీ నుంచి బయటకురావడం వరకే. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంతో ఉవ్వెత్తున ఎగిసారు. రాష్ట్రం సాధించి తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దేవేందర్‌గౌడ్, కేసీఆర్ లక్ష్యం ఒకటే అయినా కేసీఆర్ బానం సరైన దిశగా పయనించింది. దేవేందర్‌గౌడ్ బానం గురి తప్పింది. నవ తెలంగాణ పార్టీ విఫలమైంది. తర్వాత దేవేందర్‌గౌడ్ మరో తప్పు చేశారు. ఆయన పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా ప్రజల నాటి పట్టుకోవడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత తన తప్పు అర్థమైంది. దీంతో తప్పు ఒప్పుకుని టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. తర్వాత అనారోగ్యంతో క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యాడు.
ఇక చాలాకాలం తర్వాత దేవేందర్‌గౌడ్ మళ్లీ కనిపించారు. టీడీపీతో తన సహచరుడు అయిన రేవంత్‌రెడ్డిచేతుల మీదుగా తాను రాసిన విజయ తెలంగాణ బుక్ ఆవిష్కరింపచేశారు. తొందరపాటు నిర్ణయం కారణంగా రాజకీయాల్లో ఉత్థాన పథనాలకు దేవేందర్‌గౌడ్ ఒక ఉదాహరణ.ఇక నాడు టీడీపీలో దేవేందర్‌గౌడ్ నంబర్ 2గా ఉన్న సమయంలో అట్టడుగున ఉన్నవారు ఇప్పుడు మంత్రులు, ముఖ్యమత్రి అయ్యారు. రేవంత్‌రెడ్డి నాడు ఉనికిలోనే లేరు. ఇక ఎర్రబెల్లి దయాకర్ ఎమ్మెల్యేగా ఉన్నా పెద్దగా ప్రాధాన్యం లేదు. తలసాని ఉన్నా ఆయనకు ప్రాధాన్యం లేదు. కానీ అనేక మంది టీడీపీ నేతలు టీఆర్‌ఎస్, అలియాస్ బీఆర్‌ఎస్‌లో చేరారు. తర్వాత మంత్రులు అయ్యారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి సీఎం అయ్యారు. మొత్తంగా సరైన సమయంలో నిర్ణయం తీసుకున్న కేసీఆర్, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దేవేందర్‌గౌడ్ పొలిటికల్ కెరీర్ మాత్రం ముగిసింది.
Read more:Hyderabad:కాంగ్రెస్ ప్రచారం చేసుకోలేకపోతోందా