క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అలా ఉంటే..పార్టీ పరంగా నియమించాల్సిన పోస్టుల్లో కూడా ఆలస్యం అవుతోంది. పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం జరిగి నాలుగు నెలలు పూర్తయింది. ఇప్పటివరకు పార్టీ కార్యవర్గాన్ని కూడా భర్తీ చేయట్లేదు. దీంతో పార్టీ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతలకు కూడా నిరాశ తప్పడం లేదు. పార్టీ కార్యవర్గం విషయంలో సీనియర్ నేతలందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పీసీసీ చీఫ్ చెబుతున్నా..అది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు.
పదవుల కోసం పడిగాపులు
హైదరాబాద్,
క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అలా ఉంటే..పార్టీ పరంగా నియమించాల్సిన పోస్టుల్లో కూడా ఆలస్యం అవుతోంది. పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం జరిగి నాలుగు నెలలు పూర్తయింది. ఇప్పటివరకు పార్టీ కార్యవర్గాన్ని కూడా భర్తీ చేయట్లేదు. దీంతో పార్టీ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతలకు కూడా నిరాశ తప్పడం లేదు. పార్టీ కార్యవర్గం విషయంలో సీనియర్ నేతలందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పీసీసీ చీఫ్ చెబుతున్నా..అది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. దీంతో పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకు కూడా నిరాశ తప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటివరకు పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం లేదు. నామినేటెడ్ పోస్టుల భర్తీ కొలిక్కి తేవడం లేదు. దీంతో పదవుల రేసులో ఉన్న నేతలకు రోజులు భారంగా గడుస్తున్నాయట.అధికారంలో ఉన్నామని ఆనంద పడాలో..పదవి లేదని బాధపడాలో తెలియకపైకి మాత్రం హ్యాపీగానే ఉన్నట్లు కలరింగ్ ఇస్తున్నారట. లోలోపట..తమ అనుకున్న వాళ్ల దగ్గర మాత్రం ఫ్రస్ట్రేషన్‌ను వెళ్లగక్కుతున్నారట. ఏందిది ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిపోయింది.. ఇప్పటికీ మంత్రివర్గం విస్తరణ..నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోతే..గ్రామాల్లోకి వెళ్తే క్యాడర్‌కు, ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకోవాలంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారటఓ రకంగా కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందట కొందరు నేతల పరిస్థితి. తెల్లారి లేస్తే పార్టీ కోసం గళం విప్పుతున్నా..చెప్పుకుందామంటే ఓ హోదా లేకపాయే ఇదెక్కడి బాధరా నాయనా అని ఫీల్ అవుతున్నారట. అట్లని బయటపడకుండా కవర్ చేసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కన్ఫ్యూజన్‌లో పడిపోయారట. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా..ఇంకా పదవులు దక్కకపోతే ప్రజల్లోకి ఎలా వెళ్లాలి..అపోజిషన్ బీఆర్ఎస్‌ను ధైర్యంగా ఢీకొట్టేదేలా అని ప్రశ్నిస్తున్నారట.క్యాబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నా ఫుల్ ఫిల్ చేయడం లేదు. ముందు లోక్ సభ ఎన్నికలు అన్నారు..తర్వాత దసరా అన్నారు..దీపావళి కూడా అయిపోయింది. ఇప్పుడు మూఢాలు అంటున్నారు. సంక్రాంతి తర్వాత కూడా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందా అంటే డౌటే అంటున్నారు హస్తం పార్టీ లీడర్లు. సీఎం రేవంత్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలతో చర్చించినా క్యాబినెట్ విస్తరణ ఇంకా కొలిక్కి రాని అంశంగానే మిగిలిపోయిందంటున్నారు.ఉమ్మడి జిల్లాలు..సామాజిక సమీకరణాలను ఆధారంగా క్యాబినెట్ విస్తరణ చేయాలని భావించారు. కానీ ఆశావహులు ఎక్కువగా ఉండటం..క్యాస్ట్ ఈక్వేషన్స్ సెట్ కాలేదట. ఇవన్నీ ఒక ఎత్తైతే ముఖ్యనేతల మధ్య సయోధ్య కుదరకపోవడం వల్ల క్యాబినెట్ విస్తరణ ఆలస్యమవుతోందట. కీలక నేతలు ఎవరికి వారు తమ వర్గానికే పదవులు ఇవ్వాలని పట్టుపడుతుండటంతో..హస్తిన పెద్దలు కూడా చేతులు ఎత్తేశారట.రాష్ట్ర స్థాయిలో నేతలు మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలని ఢిల్లీ పెద్దలు సూచించినట్లు టాక్. దీంతో క్యాబినెట్ ఎక్స్‌ప్యాన్షన్ ఎటూ తేలని అంశంగా హోల్డ్‌లో ఉండిపోయిందంటున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు భర్తీ చేయాలనుకున్న డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పోస్టులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి.ముఖ్యమైన నేతల ఇగో పంచాయితీ.. తమకు పదవులు దక్కకుండా చేస్తుందని అంటున్నారట దిగువ స్థాయి నేతలు.
పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్ట్‌తో తమకు ప్రోటోకాల్ ఉన్న పదవి వస్తుందని ఆశలు పెట్టుకుంటే..ఏడాది అయినా ఇప్పటివరకు ఏం దిక్కులేదని దిగాలుగా ఉండిపోతున్నారట కొందరు నేతలు. అయితే మొదటి విడతలో భాగంగా 38 మందికి ఒకేసారి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు.మధ్యలో ప్రభుత్వ సలహాదారు, డైరీ కార్పొరేషన్ పోస్టులను కూడా భర్తీ చేశారు. ఇదంతా పూర్తయి దాదాపు ఆరు నెలలు అయిపోతోంది. ఇంకా ప్రభుత్వంలో 30కి పైగా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే భర్తీ చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్నా..నామినేటెడ్ పోస్టుల అంశం కొలిక్కి రావడం లేదు. దీంతో అధికారం ఉన్నప్పుడు కూడా పట్టించుకోకపొతే తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారట లీడర్లు. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని చూస్తున్నారట. ఈ విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా హామీ ఇస్తున్నారు.అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో పదవుల భర్తీ ఆలస్యం అవుతుండటంతో..తెలంగాణ కాంగ్రెస్ నేతలు పూర్తి నిరాశ నిస్పృహలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. అయితే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లే ముందే..నామినేటెడ్ పోస్టుల భర్తీ..వీలైతే మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నారట. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందడుగు వేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి హస్తం నేతల ఆశలు ఎప్పుడు నెరవేరుతాయో.