పుష్కర కాలం ఉద్యమం. పదేళ్ల పాలన..ఇప్పుడు ఏడాది పాటు అపోజిషన్ రోల్. ఇది బీఆర్ఎస్ హిస్టరీ. కానీ ఉద్యమంలో కూడా ఫేస్ చేయనన్ని కేసులు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నేతలు. అధికార పార్టీ మీద దూకుడు మీద పోరాడుతోన్న నేతలందరికీ వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో పార్టీ పరంగా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తోంది గులాబీ అధిష్టానం.
నేతలకు లీగల్ సపోర్ట్
హైదరాబాద్,
పుష్కర కాలం ఉద్యమం. పదేళ్ల పాలన..ఇప్పుడు ఏడాది పాటు అపోజిషన్ రోల్. ఇది బీఆర్ఎస్ హిస్టరీ. కానీ ఉద్యమంలో కూడా ఫేస్ చేయనన్ని కేసులు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నేతలు. అధికార పార్టీ మీద దూకుడు మీద పోరాడుతోన్న నేతలందరికీ వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో పార్టీ పరంగా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తోంది గులాబీ అధిష్టానం. పోలీస్ కేసుల నుంచి నేతలకు రిలీఫ్ కలిగించేందుకు స్పెషల్ లీగల్ టీమ్‌తో భరోసా కల్పిస్తోంది.క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గులాబీ నేతల వరకు అందరూ పోలీస్ కేసులతో సతమతం అవుతున్నారు. సోషల్ మీడియా పోస్టులు..బహిరంగ స్టేట్‌మెంట్లు ఇచ్చినా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడుతోన్న తమ పార్టీ నేతలను పోలీసు కేసులతో బెదిరించే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ మండిపడుతోంది.పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్నారు. లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి జైలుకు వెళ్లారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత ఆయన మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో నరేందర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారట.తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో మిగిలిన రాజకీయ పార్టీల కంటే ఎంతో ముందుండే వారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అధికార పార్టీ నేతలుగా అదే దూకుడును ప్రదర్శించారు. దాదాపు 12 ఏళ్లపాటు ఉద్యమంలో పదేళ్లు ప్రభుత్వంలో గులాబీ నేతలు హల్చల్ చేశారు. అయితే పార్టీ ఓటమితో ప్రతిపక్షంలోకి వచ్చిన ఏడాదిలోపే కీలక నేతలంతా సైలెంట్ అయిపోయారు. ఉద్యమ సమయం నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరించిన ఎంతోమంది యువనేతలు ప్రభుత్వంపై దూకుడుగా పోరాడేందుకు వెనకడుగు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతలు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన ఆ నేతలు ఇప్పుడు సైలెంట్ కావడం వెనుక కారణాలు ఏమిటన్న గుసగుసలు గులాబీ నేతల్లో వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో నేతలు సైలెంట్‌గా మారడంతో..గులాబీ పార్టీ కూడా రూటు మార్చింది. పార్టీ నేతలకు చట్టపరంగా ఇబ్బందులు ఎదురైనా వారికి అండగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది.లగచర్ల ఘటనలో జైలుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహా రైతులకు న్యాయ సహాయం అందజేసింది పార్టీ. లీగల్ సెల్ బాధితుల పక్షాన భరోసా కల్పిస్తూ అండగా నిలబడుతుంది. అయితే పార్టీ లీగల్ సెల్‌ను మరింత పటిష్టం చేయాలని గులాబీ బాస్ ప్రత్యేక దృష్టి పెట్టారట. అవసరమైతే కీలక కేసుల్లో అత్యున్నత స్థాయి న్యాయవాదులను కూడా నియమించుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారట.ఇటీవల కేటీఆర్‌పై నమోదైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాదిని పార్టీ ఎంగేజ్ చేసింది. కేటీఆర్‌కే కాదు పార్టీకి చెందిన ఏ నేతకు కేసుల పరంగా ఇబ్బందులు వచ్చినా లీగల్‌గా అన్ని విధాలుగా అండగా నిలవాలని భావిస్తోందట. ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో కేసులు నమోదైతే..లేక స్కామ్‌లు, అక్రమాలు అంటూ ఇబ్బందులు ఎదురైతే న్యాయస్థానం తలుపు తట్టడమే అస్త్రమని భావిస్తుంది గులాబీ పార్టీ.పార్టీ లీగల్ సెల్‌కు ఇప్పటికే రూ. 10కోట్లు కేటాయించారు గులాబీ బాస్. అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారట. అంతేకాదు ఢిల్లీ స్థాయిలో కూడా లాయర్లను హైర్ చేసుకోవాలని..న్యాయపోరాటం విషయంలో వెనక్కి తగ్గొద్దని చెప్తున్నారట. ఒకవేళ తాము బయటికి వస్తే పాత కేసులు..గతంలో చేసిన దందాల వెలుగులోకి వస్తాయని భయపడుతున్న నేతలకు లీగల్ ఫైట్‌తో భరోసా కల్పించి..పార్టీని స్ట్రాంగ్‌గా ఉంచాలని భావిస్తున్నారట కేసీఆర్.అందుకే రాబోయే నాలుగేళ్లు ఓ వైపు ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే.. కేసులు నమోదైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని ఫిక్స్ అయ్యారట. చూడాలి మరి గులాబీ బాస్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో.
Read:YS Jagan Mohan Reddy:జగన్ కు తలనొప్పిగా మారుతున్న షర్మిళ