భావవ్యక్తీకరణలో భాష ప్రముఖ పాత్ర పోషిస్తుందని, అయితే నేటి సమాజంలో ఆంగ్ల భాష కీలకంగా మారిందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కో చింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ హాజరయ్యారు.
నేటీ సమాజంలో అంగ్ల భాష కీలకం
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
హైదరాబాద్
భావవ్యక్తీకరణలో భాష ప్రముఖ పాత్ర పోషిస్తుందని, అయితే నేటి సమాజంలో ఆంగ్ల భాష కీలకంగా మారిందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కో చింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆంగ్లభాష కమ్యూనికేషన్ వ్యవస్థలో కీలకంగా మారిందని అందుకని విద్యార్థులు ఈ భాష పై పట్టు సాధించాలని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆంగ్ల భాష పట్ల నైపుణ్యాలు కలిగి ఉంటే ప్రపంచ స్థాయిలో ఎదగవచ్చని గవర్నర్ సూచించారు. 107 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ 1989లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ప్రారంభించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిందన్న గవర్నర్, గిరిజన గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఆంగ్ల భాషలో శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Read:Husnabad:అక్కన్న పేటలో మంత్రి పొన్నం పర్యటన సావిత్రి భాయ్ పులే కు నివాళులు