Hyderabad:తెలంగాణలో రంజాన్ రచ్చ:తెలంగాణ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో మార్పులు కనిపిస్తున్నాయి. మతం హైలెట్ అవుతోంది. అదే పనిగా కుల, మతాలను వాడేసుకుంటున్నారు మూడు పార్టీల నేతలు. తాజాగా రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు గంటపాటు వెసులుబాటు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై బీజేపీ రచ్చ ప్రారంభించింది. నిన్నటి వరకు బీసీ కుల గణనలో ముస్లిం బీసీలు అని పేర్కొడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు.
తెలంగాణలో రంజాన్ రచ్చ
హైదరాబాద్, ఫిబ్రవరి 20
తెలంగాణ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో మార్పులు కనిపిస్తున్నాయి. మతం హైలెట్ అవుతోంది. అదే పనిగా కుల, మతాలను వాడేసుకుంటున్నారు మూడు పార్టీల నేతలు. తాజాగా రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు గంటపాటు వెసులుబాటు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై బీజేపీ రచ్చ ప్రారంభించింది. నిన్నటి వరకు బీసీ కుల గణనలో ముస్లిం బీసీలు అని పేర్కొడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అయితే బీసీ ముస్లింలు ఏంటి అని, తొలగించాలని డిమాండ్ చేశారు. దానిని తొలగిస్తే బీసీ రిజర్వేషన్ల పెంపు విషయం ఆలోచిస్తామని తెలిపారు. ఇక తాజాగా రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అవకాశం హిందువులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తోంది.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ సడలింపు విధానం మొదలు పెట్టింది. పదేళ్లు కొనసాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా పాత ఉత్తర్వులనే ఇచ్చింది. వారు స్పెసిఫిక్‌గా ఆ సమయంలో ప్రార్థనలకు వెళ్లాలి కాబట్టి అవకాశం కల్పిస్తున్నారు. గతంలో ఎవరూ అభ్యంతరం తెలుపలేదు. కానీ ఈసారి బీజేపీ దీనిని తప్పుపడుతోంది. ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తోంది. అలాంటి ఛాన్స ఇవ్వడం కరెక్ట్ కాందటున్నారు ఆ పార్టీ నేతలు. ముస్లింలకు అవకాశం ఇస్తే మీకేం ఇబ్బంది అంటున్నారని, హిందువులకు ఇవ్వలేదు కదా అంటున్నారు. ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది.బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు అధికార కాంగ్రెస్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. హిందువుల పండుగలకు కూడా అవసరమైనప్పుడు వెసులుబాటు ఇస్తున్నామని చెబుతోంది. అయినా బీజేపీ హిందువులకు ఇవ్వడం లేదని గట్టిగా వాయిస్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ ఛామల కిరణ్‌కుమార్‌రెడ్డి వివరణ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీంతో చర్చను మరింత పెంచింది. అయితే కాంగ్రెస్ వివరణ ఇచ్చుకునే తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.ముస్లింలకు వెసులుబాటు కల్పించడం కొత్తేమీ కాదు. కానీ బీజేపీ నేతలు కలిసివచ్చే అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. వచ్చే ఎన్నికలనాటికి బీజేపీ కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండాలని బీజేపీ భావిస్తోంది. అప్పటి వరకు బీఆర్‌ఎస్‌ను బలహీనపర్చాలని రెండు జాతీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు పార్టీలు వీలు దొరికినప్పుడల్లా.. బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తున్నాయి.
Read more:Andhra Pradesh:సూర్యలంకకు పోటెత్తున్నారో