Hyderabad:టీడీపీలోకి మల్లన్న గ్రేటర్ కోసం కసరత్తు:ఆంధ్రప్రదేశ్‌లో విజయం తర్వాత తెలుగుదేశం పార్టీ కేడర్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్టీని యాక్టివ్ చేయాలని ఇక్కడి నేతలు చాలా రోజులుగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.మరో 10 నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు జరగనున్నాయి.
టీడీపీలోకి మల్లన్న
గ్రేటర్ కోసం కసరత్తు
హైదరాబాద్, మార్చి 5
ఆంధ్రప్రదేశ్‌లో విజయం తర్వాత తెలుగుదేశం పార్టీ కేడర్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్టీని యాక్టివ్ చేయాలని ఇక్కడి నేతలు చాలా రోజులుగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.మరో 10 నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై టీడీపీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభం అయినట్టు తెలుస్తోంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేసిన పొలిటికల్ కన్సల్టెన్సీ ‘షోటైమ్’.. ఇప్పుడు హైదరాబాద్‌లో కార్యాకలాపాలు ప్రారంభించిందిహైదరాబాద్‌లో ఆఫీసు ఏర్పాటు చేసిన షోటైమ్ ప్రతినిధులు.. టీడీపీ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలే ట్రార్గెట్‌గా ఆ సంస్థ ప్రతినిధులు పని చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా గతంలో టీడీపీ విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సానుభూతిపరులను వీరు కలుస్తున్నారు. టీడీపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతోందని.. అందరూ గతంలో లాగా యాక్టివ్ అవ్వాలని సూచించినట్టు తెలిసింది.ఎల్బీనగర్, మహేశ్వరం, కూకట్‌పల్లి, జూబ్లిహిల్స్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక్కడ చేస్తున్న వర్క్, పురోగతి గురించి ఎప్పటికప్పుడు చంద్రబాబుకు తెలియజేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా 10 నెలలు సమయం ఉండటంతో ముఖ్యనేతలు డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వడం లేదని తెలుస్తోంది. ఎన్నికలు సమీపించాక.. నారా లోకేష్ ఫోకస్ పెడతారని విశ్వసనీయంగా తెలిసింది.ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా వెస్టర్న్ హైదరాబాద్‌లో టీడీపీ, జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈస్టర్న్ హైదరాబాద్‌లో బీజేపీ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. దీంతో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే.. ఏపీలో మాదిరిగా విజయం సాధిస్తామని.. హైదరాబాద్‌కు చెందిన టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారుఇటీవల తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన టీడీపీలో చేరవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్త పార్టీ కూడా పెడతారనే ప్రచారం జరిగినా.. తెలుగుదేశం వైపే మొగ్గుచూపే అవకాశం ఉందని అంటున్నారు. అటు టీడీపీ మల్లన్నను చేర్చుకోవడానికి చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. మల్లన్న పార్టీలో చేరితే ప్లస్ అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆయకే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవీ ఇవ్వొచ్చనే వార్తలు కూడా వచ్చాయి.గతేడాది టీడీపీ సభ్యత్వ కార్యక్రమం చేపట్టింది. దీనికి తెలంగాణలోనూ మంచి స్పందన లభించింది. తెలంగాణ నుంచి లక్షా 21 వేల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. దీంట్లో దాదాపు హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే చంద్రబాబును కలుస్తున్న తెలంగాణ నేతలు.. పార్టీపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.
Read more:Hyderabad:వరంగల్ రైతుల ఆందోళన