తెలంగాణలో రోజురోజుకి చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుందని వాతావరణశాఖ చెప్పింది. గతేడాది కంటే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా పడిపోతున్నాయని అధికారులు ప్రకటించారు.
చంపేస్తున్న చలి
హైదరాబాద్, జనవరి 4
తెలంగాణలో రోజురోజుకి చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుందని వాతావరణశాఖ చెప్పింది. గతేడాది కంటే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా పడిపోతున్నాయని అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే రెండు రోజుల నుంచి తెలంగాణలో ఉన్నట్లుండి చలి విపరీతంగా పెరుగుతుంది. రాబోయో రోజుల్లో దక్షిణాది జిల్లాల కంటే ఉత్తరాదిలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు వివరించారు. తెలంగాణలో శీతాకాలం మొదలు సాధారణ స్థాయి కంటే చలి తీవ్రత చాలా ఎక్కువే ఉందని ఆయన వివరించారు. సాధారణ ఉష్ణోగ్రతలు చూసుకుంటే ఆదిలాబాద్లో 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీల దిగువకు పడిపోయాయి. అలా అన్ని జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీల వరకు నమోదు అవుతున్నట్లు చెప్పారు.రోజుల్లో తెలంగాణలోని ఉత్తరాది జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత భారీగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ మూడు జిల్లాలో ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి సమయంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయన్నారు.
రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుకుగా వీస్తున్నాయని, దాని ప్రభావంతోనే గత రెండు రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారి చెప్పారు.ఈశాన్య గాలులతో పాటు రాష్ట్రంపై తూర్పు గాలుల ప్రభావం కూడా ఉందన్నారు. ఈ గాలుల కారణంగా ఉదయం వేళ దట్టమైన పొగ మంచు కురిసే అవకాశం బాగా ఉందని చెప్పారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రతో పాటు పొగ మంచు ఎక్కువగా కురవనున్నట్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్లో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువ నమోదు అవుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందన్నారు.రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. అత్యంత కనిష్ఠంగా కుమురంభీం జిల్లా సిర్పూర్, గిన్నెదారిలో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 7.7, కుమురంభీం జిల్లా తిర్యానీలో 7.9, ఆల్గోల్‌లో 7.6 డిగ్రీలు,వికారాబాద్ జిల్లా మోరీన్‌పేటలో 7.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.9 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.1 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా ఆర్లీలో 7.2, , ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో అత్యంత కనిష్ఠంగా హెచ్సీయూ, బీహెచ్ఐఎల్ 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా రాజేంద్రనగర్‌లో 9.4, మౌలాలీలో 9.6, శివరామ్‌పల్లిలో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.