పార్టీ అధికారంలో లేకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి గమ్మత్తుగా మారింది. పేరుకే ఎమ్మెల్యే కానీ ప్రజలకు, కార్యకర్తలకు ఏ పని చేసి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారట కారు పార్టీ ఎమ్మెల్యేలు. తమ నియోజకవర్గాల్లో..హస్తం పార్టీ నేతల హవా కొనసాగుతుండటాన్ని తట్టుకోలేకపోతున్నారట. అధికార యంత్రాంగం హస్తం పార్టీ నేతలకే ప్రయారిటీ ఇస్తుండటంపై కూడా మండిపడుతున్నారు.కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే తమ హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తున్నారు.
గెలిచినా గుర్తింపు ఏదీ..
హైదరాబాద్, జనవరి 6
పార్టీ అధికారంలో లేకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి గమ్మత్తుగా మారింది. పేరుకే ఎమ్మెల్యే కానీ ప్రజలకు, కార్యకర్తలకు ఏ పని చేసి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారట కారు పార్టీ ఎమ్మెల్యేలు. తమ నియోజకవర్గాల్లో..హస్తం పార్టీ నేతల హవా కొనసాగుతుండటాన్ని తట్టుకోలేకపోతున్నారట. అధికార యంత్రాంగం హస్తం పార్టీ నేతలకే ప్రయారిటీ ఇస్తుండటంపై కూడా మండిపడుతున్నారు.కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే తమ హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, కోరుట్ల, కరీంనగర్, సిరిసిల్ల నియెజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కంటే..ఓడిన కాంగ్రెస్ నేతల హవాను ఎక్కువ నడుస్తుందట.అధికారం చేతులు మారితే ఎలా ఉంటుందనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలే ఓ ఉదాహరణగా కనిపిస్తోంది. దశాబ్దకాలం పాటు అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్లలో కేటీఆర్ హవా కొనసాగింది. కానీ ఇప్పుడు సిరిసిల్లలో సీన్ మారిపోయిందట. కేటీఆర్ కనుసన్నల్లోనే నడిచిన సిరిసిల్ల రాజకీయాలను..కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట.కేటీఆర్‌కు ప్రాధాన్యత లేకుండా చేసేందుకు నేతన్నలతో పాటుగా..కేటీఆర్ ఫాలోవర్స్‌ను తమ వైపు తిప్పకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక కరీంనగర్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లేకుండానే రివ్యూలు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ శ్రేణులు గరమ్ అవుతున్నాయి.ఇక హుజురాబాద్, కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ కుమార్ మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. నియోజకవర్గంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్న ఈ ఇద్దరు శాసనసభ్యులకు..కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌లు బ్రేకులు వేస్తున్నారట.హుజురాబాద్ నియెజకవర్గంలో కౌశిక్ రెడ్డిపై పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు నియోజకవర్గ రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట. అధికార యంత్రాంగం కూడా ప్రణవ్ బాబు చెప్పిన పనులను వెంటనే చేస్తూ..ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆదేశాలను పట్టించుకోవడం లేదట. దీంతో తన మాట వినని అధికారులపై ఆగ్రహంతో ఊగిపోతున్నారట ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.ఇటీవల కళ్యాణ లక్ష్మీ చెక్కుల వ్యవహరంలో తన హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించారు. ప్రోటోకాల్ పాటించకపోతే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానంటూ ఎమ్మెల్యే కౌశిక్ హెచ్చరిస్తున్నా ఫలితం లేకుండా పోతుందట.ఇక కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమారా..? లేక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్పింగ రావా.. అన్నట్లుగా ఉందట పరిస్థితి. ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కంటే..పోటీ చేసి ఓడిన నర్సింగరావు హవానే కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ క్యాడర్, లీడర్లకు ఏ మాత్రం మింగుడు పడటం లేదట. ఈ నియోజకవర్గాల్లో అటు ఎమ్మెల్యేలు, ఇటు హస్తం నేతల మధ్య అధికారులు నలిగిపోతున్నారట.కొందరు అధికారులు ఓవరాక్షన్ చేస్తుండటంతో భవిష్యత్‌లో వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ హెచ్చరిస్తున్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పవర్ చేతులు మారితే..సీన్ ఎలా మారిపోతుందో కాంగ్రెస్ నేతల హవా చూస్తేనే అర్థమవుతుందన్న చర్చ జరగుతోంది.
Read:BJP:బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు