Hyderabad:గులాబీ డైవర్షన్ పాలిటిక్స్

Pink diversion politics

ప్రస్తుతం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య డైవర్ట్ పాలిటిక్స్. మీడియా అడిగే ప్రశ్నలకు తప్పించుకునేందుకు ఎదుటివారిపై బురద జల్లడం కామన్‌గా మారింది. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతోంది. ఫార్ములా ఈ కారు రేస్ కేసు నమోదుతో కేటీఆర్ ఇమేజ్ అమాంతంగా పడిపోయిందన్నది నేతల మాట. విచారణకు హాజరై మరింత దారుణంగా ఉంటుందని గమనించారాయన.

గులాబీ డైవర్షన్ పాలిటిక్స్..

హైదరాబాద్, జనవరి 7
ప్రస్తుతం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య డైవర్ట్ పాలిటిక్స్. మీడియా అడిగే ప్రశ్నలకు తప్పించుకునేందుకు ఎదుటివారిపై బురద జల్లడం కామన్‌గా మారింది. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతోంది. ఫార్ములా ఈ కారు రేస్ కేసు నమోదుతో కేటీఆర్ ఇమేజ్ అమాంతంగా పడిపోయిందన్నది నేతల మాట. విచారణకు హాజరై మరింత దారుణంగా ఉంటుందని గమనించారాయన. ఈ క్రమంలో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఫార్ములా కేసులో తొలిసారి ఏసీబీ ముందు విచారణకు హారవుతున్నారు కేటీఆర్. ఆయన కచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచారణకు వెళ్లకుంటే దాన్ని షాకుగా చూపించి న్యాయస్థానంలో బెయిల్ రద్దు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు పార్టీ నుంచి కొత్త పల్లవి ఎత్తుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టాలని ప్లాన్ చేసినట్టు పార్టీ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.ఇదిలావుండగా మీడియా ముందుకొచ్చిన కేటీఆర్.. మనసులో ఏ ముందో చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేవారు. ఆ తర్వాత వివిధ ఛానెళ్లతో మాట్లాడారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలపై మీడియా ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. పనికిమాలిన వారు ఇలాంటి స్లోగన్స్ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తామంతా పని చేస్తున్నామన్నారు. చివరి వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పకనే చెప్పేశారు. కేసీఆర్ మీ నాయకుడు అన్నప్పుడు.. అసెంబ్లీకి ఎప్పుడు వస్తున్నారు అనే ప్రశ్నకు సరిగా సమాధానం ఇవ్వలేదు.బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుందన్నది వాదన మరింత బలపడింది. ఈ మధ్యకాలం లో కేటీఆర్ మాటలు సరిగా లేవన్నది కొందరి మాట. ఒకప్పుడు హుందాగా ప్రవర్తించే వారని, ఇప్పుడదేమీ కనిపించలేదని అంటున్నారు. గతంలో పొరుగు రాష్ట్రం ఏపీలో వైసీపీ నేతలు ఇలాగే మాట్లాడేవారని, దాన్ని ఫాలో అవుతున్నారా? అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పడిపోతున్నాయి.

Read:Hyderabad:గులాబీ కమలంగా మారుతుందా

Related posts

Leave a Comment