Hyderabad:గులాబీ కమలంగా మారుతుందా

గులాబీ కమలంగా మారుతుందా...

పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టింది. భవిష్యత్తు కార్యక్రమాలకు ప్రణాళికలను రూపోందించడంపై ఫోకస్ చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 అంటూ.. తొంబై స్థానాలు సాధించడమే లక్ష్యంగా, బీసీ ముఖ్యమంత్రి నినాదంతో మందుకు వెళ్లిన కాషాయ పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం అయ్యింది. సేమ్ సీన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిపీట్ అయ్యింది.

గులాబీ కమలంగా మారుతుందా..

హైదరాబాద్, జనవరి 7
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టింది. భవిష్యత్తు కార్యక్రమాలకు ప్రణాళికలను రూపోందించడంపై ఫోకస్ చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 అంటూ.. తొంబై స్థానాలు సాధించడమే లక్ష్యంగా, బీసీ ముఖ్యమంత్రి నినాదంతో మందుకు వెళ్లిన కాషాయ పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం అయ్యింది. సేమ్ సీన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిపీట్ అయ్యింది. వికసిత్ భారత్ లక్ష్యంగా, ఫిర్ ఎక్ బర్ మోడీ నినాదంతో, తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో డబుల్ డిజిట్ స్థానాలు సాధించే దిశగా ఎన్నికల బరిలో దిగిన బీజేపీ ఎనిమిది స్థానాలకు పరిమితం అయ్యింది. అదటుంచుతే ప్రస్తుతం గత ఎన్నికల లక్ష్యాలను, గెలుపోటములపై సంస్థాగతంగా అంతర్మధనం చేసుకునే పనిలో పడింది ఆ పార్టీ.. అంతేకాదు భవిష్యత్తులో బలోపేతం అయ్యే మార్గాలను అన్వేషించడంపై కూడా ఫోకస్ పెడుతోందంట.రాష్ట్రంలో ఎన్నికలు గడిచి ఏడాది పూర్తయింది. ఇక వచ్చే నాలుగేండ్లలో ఎదురయ్యే సవాళ్లను ఎదురుకునేందుకు కమలదళం వ్యూహాలను రచిస్తోంది. గత ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను సాధించనప్పటికి ఎనిమిది పార్లమెంట్ స్థానాలను సాధించడంతో ఆ పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. అదే జోష్ రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు నడిపించగలిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టోచ్చని, కచ్చితంగా రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదుగొచ్చనే అంచనాలలో కాషాయ దళాలున్నట్టు తెలుస్తోంది.అందులో భాగంగానే జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీని మార్పులు చేసే ప్రయత్నంలో పార్టీ వర్గాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే జాతీయ స్థాయి నుంచి, బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీ ఎన్నికలు జరుపుకుంటుంది. బలమైన నేతలకు పార్టీ పగ్గాలు అప్పజెప్పేందుకు అధిష్టానం ప్రయత్నం చేస్తోంది.దేశంలో, రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలబడాలంటే బలమైన నేతను అధ్యక్ష పదవిపై ఉంచాలనే యోచనలో అధిష్టానం ఉందంట. అందులో భాగాంగనే తెలంగాణలో అధ్యక్ష్య పీఠాన్ని బలమైన సామజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని అధిష్టానం చూస్తున్నప్పటికి, ఆ పదవికి మాత్రం డిమాండ్ చాలా ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అరడజను మంది నేతలకు పైగా పోటీ పడుతూ ఎవరికి వారే తమతమ ధీమాను వ్యక్తపరుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఆ క్రమంలో అధిష్టానం అధ్యక్ష పీఠం ఎవరికి కట్టబెడుతోందనేది సస్పెన్స్ నెలకొంది. ఈ మాసం చివరి కల్ల అధ్యక్ష ఎంపిక ప్రక్రియ పూర్తి నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నిక, నియామకం అనంతరం రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానినికి ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలను ప్రోత్సహించాలని కాషాయ నేతలు భావిస్తున్నారంట.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌‌ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ ను గ్రౌండ్ లేవల్లో ఖాళీ చేయడానికి కాషాయ నేతలు స్కెచ్ గీస్తున్నారంట. అందుకే ప్రధానంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని భవిషత్తుకు మార్గాలు వేసుకోవాలనే యెచనలో కాషాయ నేతలున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు వచ్చే స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, మంచి మేజారిటీ స్థానాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తం మీద గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను అందుకోనప్పటికి… ఊహించని దానికంటే ఓటింగ్ పర్సెంటేజీని పెంచుకొని జోష్ మీదున్న కాషాయ నేతలు ఆ దిశగా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి

Read:Hyderabad:అడ్డంగా బుక్కైన కేటీఆర్

Related posts

Leave a Comment