తెలంగాణలో సంచలనంగా మారిన పార్ములా ఈ రేస్ కేసులో తప్పు జరిగిన మాట వాస్తవం. ఎలాంటి అనుమతి లేకుండా భారత కరెన్సీని పౌండ్లలోకి మార్చి విదేశీ సంస్థకు కేటాయించింది వాస్తవం.
కేటీఆర్ ను సన్నిహితులే..బుక్ చేశారా
హైదరాబాద్, జనవరి 20
తెలంగాణలో సంచలనంగా మారిన పార్ములా ఈ రేస్ కేసులో తప్పు జరిగిన మాట వాస్తవం. ఎలాంటి అనుమతి లేకుండా భారత కరెన్సీని పౌండ్లలోకి మార్చి విదేశీ సంస్థకు కేటాయించింది వాస్తవం. ఈ విషయమై రిజర్వు బ్యాంకు తెలంగాణ ప్రభుత్వానికి రూ.8 కోట్ల జరిమానా విధించింది వాస్తవం. కానీ, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ మాత్రం ఈ విషయంలో ఏమీ జరగలేదని వాదించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాను ఏ తప్పు చేయలేదని, అధికారులే చేశారని మొన్నటి వరకు చెప్పి కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణ సమయంలో ఎస్ నెక్స్›్టజెన్ కంపెనీ డైరెక్టర్లను ఇరికించారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ సంస్థ డైరెక్టర్లు ఏసీబీ ఎదుట హాజరవుతున్నారు. అందులో చలమలశెట్టి అనిల్ ఒకరు. ఈయన సామాన్యుడు కాదు. గ్రీన్‌కో కంపెనీ ఓనర్. కొన్నివేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి. ఫార్ములా ఈ రేసు స్పాన్సర్‌షిప్ కోసం ఓ కంపెనీని 2022 ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత నష్టాలు వచ్చాయని కంపెనీని మూసివేశాడు. ఇదంతా ఓ గూడు పుఠాణి అని క్లియర్‌గా తెలియడంతో ఏసీబీ పట్టు బిగిస్తోంది. కంపెనీ డైరెక్టర్లనే విచారణకు పిలుస్తున్నారు.ఎస్ నెక్ట్స్ జెన్ ఏర్పాటు ఉద్దేశం వందల కోట్లతో ఫార్ములా ఈ రేస్‌ను స్పాన్సర్‌షిప్ చేయడం. ఇది ఎలా సాధ్యమైందని ఏసీబీ ఇప్పుడు ఆరా తీస్తోంది. అయితే ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాల కోసమే తాము స్పాన్సర్‌షిప్ చేశామని డైరెక్టర్లు ఏసీబీకి చెప్పినట్లు తెలుస్తోంది. నష్టాలు వచ్చాయని స్పాన్సర్‌షిప్ ఉపసంహరించుకున్న తర్వాత కూడా రూ.41 కోట్లు ఎందుకు బీఆర్‌ఎస్‌కు ఎలక్ట్రోలర్ బాండ్ రూపంలో ఇచ్చారని ఆరా తీయగా చెలమలశెట్టి అనిల్‌కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారంగత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా.. ముఖ్యమైన మంత్రి కేటీఆరే అయ్యారు. దీంతో ఆయనతో పరిశ్రామిక వేత్తలు సన్నిహిత సంబంధాలు కోరుకున్నారు. పరిచయాలు పెంచుకున్నారు. ఇలాగే చలమలశెట్టి అనిల్ కూడా కేటీఆర్‌దగ్గరయ్యారు. ఆయన వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వ మద్దతు అతనికి అవసరం. వ్యాపరరంగంలో మరింత బలపడేందుకు ఆయన ప్రభుత్వానికి కూడా సహకారం అందించారు. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ రేస్ స్పాన్సర్‌షిప్ కోసం ముందుకు వచ్చారు. అయితే కేటీఆర్ కారణంగా చివరకు జైలుకు వెళ్లే పరిస్థితి కూడా రావచ్చన్న ప్రచారం జరుగుతోంది.
Read:New York:ట్రంప్ ప్రమాణంలో హౌడీ మోడీ ట్రూప్