Hyderabad:కేటీఆర్ అరెస్ట్ తప్పదా

ktr-arrest

ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రమేయం ఉన్న వారి దర్యాప్తు ఒక్కొక్కటిగా జరగనుంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ బీఎల్‌ఎన్ రెడ్డి త్వరలోనే ఈడీ ముందు హాజరు కాబోతున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈడీ ముందు హాజరు అయ్యారు.

కేటీఆర్ అరెస్ట్ తప్పదా..

హైదరాబాద్, జనవరి 4
ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రమేయం ఉన్న వారి దర్యాప్తు ఒక్కొక్కటిగా జరగనుంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ బీఎల్‌ఎన్ రెడ్డి త్వరలోనే ఈడీ ముందు హాజరు కాబోతున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈడీ ముందు హాజరు అయ్యారు. అలాగే ఈ నెల 7న ఈడీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించనున్నారు. ఈ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. పెమా చట్టాన్ని ఉల్లంఘించి హెచ్‌ఎండీఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేసినట్లు ఈడీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో ఆయన తాత్కాలిక బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.అలాగే ఫార్ములా-ఇ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ముగించింది. తీర్పు వెలువడే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయకూడదని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ క్రమంలో కేటీఆర్ కు ఏసీబీ నోటీసు జారీ చేసింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. కేటీఆర్ తో పాటు, ఈ కేసులో అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసింది. 7న విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించారు. ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫార్ములా ఇప్పటికే రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.మరోవైపు ఇదే కేసులో ఈడీ ఈ నెల 7న విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు సమన్లను పంపింది. దీంతో ఈ నెల 6న ఏసీబీ విచారణకు హాజరు కానున్న కేటీఆర్..ఆ తర్వాత రోజే ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణలకు హాజరవుతారా లేక కోర్టును ఆశ్రయిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఏసీబీ సేకరించిన ఆధారాలను తీసుకుని ఈడీ విచారణ జరపాల్సి ఉంది. దీంతో ఏసీబీ విచారణ తర్వాత అవే ఆధారాలతో ఈడీ కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. విచారణలో వాస్తవాలు వెల్లడి అయితే కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు.

అసలు కేటీఆర్ అరెస్ట్ గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో ఆయనపై అనేక ఆరోపణలు నమోదుకాగా, గవర్నర్ నుంచి విచారణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో కేసు మరింత వేడెక్కింది. కేసీఆర్ ఈ వ్యవహారంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోయినా పార్టీలోని నేతలు మాత్రం ఈ పరిస్థితి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ అరెస్ట్ జరిగితే పార్టీకి ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణలపై బీఆర్ఎస్ హైకమాండ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కేటీఆర్ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఎవరికుంటుంది అన్న ప్రశ్న పార్టీ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తుంది. కవిత రీఎంట్రీ పై పార్టీలోనూ, రాష్ట్ర రాజకీయవర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. న్యాయపరమైన చిక్కుల మధ్య కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది. ఇదే టైంలో పార్టీలో కవిత పాత్ర కీలకంగా మారే ఛాన్స్ ఉంది. కవిత రీఎంట్రీ పార్టీ బలోపేతంతో పాటు పునర్నిర్మాణ ప్రయత్నాలకు తోడ్పాటుగా ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు. హరీశ్ రావు కూడా అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కేటీఆర్‌కు ఎదురవుతున్న పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త సవాళ్లను విసురుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయాలు పార్టీ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయనున్నాయి. ఈ సంక్షోభాన్ని గులాబీ పార్టీ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. ఎంతటి వారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని.. గవర్నర్ పర్మీషన్ ఇవ్వగానే కేటీఆర్‌ మీద చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. నేడు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారణకు కేటీఆర్ రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కనుక కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి అనుకున్నది నిజం చేసినట్లే అవుతుందని కొందరు అంటున్నారు. కేటీఆర్ గనుక అరెస్ట్ అయితే దూకుడుగా ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లే. రేవంత్ కు దాదాపు ఎదురుండదనే చెప్పుకోవాలి.

Read:Vijayawada:ఏపీలో ఎస్సీ లెక్కల మిస్సింగ్

Related posts

Leave a Comment