Hyderabad:కాంగ్రెస్ ప్రచారం చేసుకోలేకపోతోందా

Hastam party came to power in Telangana after a decade.

Hyderabad:కాంగ్రెస్ ప్రచారం చేసుకోలేకపోతోందా:తెలంగాణలో దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. కేసీఆర్‌పాలనను మరపించేలా పాలన సాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తోంది.

కాంగ్రెస్ ప్రచారం చేసుకోలేకపోతోందా

హైదరాబాద్, ఫిబ్రవరి 18
తెలంగాణలో దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. కేసీఆర్‌పాలనను మరపించేలా పాలన సాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తోంది. అయితే ఇంకా చాలా హామీలు మిగిలే ఉన్నాయి. అమలు చేసినవాటికన్నా పెండింగ్‌లో ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి. దీంతో హస్తం పార్టీకి ఆశించిన మైలేజీ రావడం లేదు. వాస్తవానికి రుణమాఫీ, కొత్త రేషన్‌కార్డుల జారీతో మంచి మైలేజీ వస్తుందని హస్తం నేతలు భావించారు. కానీ, ప్రచారంలో పార్టీ నేతలే వెనుకబడుతున్నారు. అంతర్గత కుమ్ములాటలు, అలకల కారణంగా చేసిన పని చెప్పుకోలేకపోతున్నామని హస్తం నేతలు భావిస్తున్నారు. కలిసి కట్టుగా ప్రభుత్వ చేసే పనులను ప్రజలకు చెప్పాలని పెద్దలు కోరుతున్నారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇదే పనిచేస్తున్నారు. అయినా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో నేతలు విఫలం అవుతున్నారు.మరోవైపు సోషల్‌ మీడియా వేదికగా కాంగ్రెస్‌పై విపక్షాలు బలంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీ అనేక వియాల్లో కాంగ్రెస్‌ పాలనను తప్పు పడుతున్నాయి. హామీలు అమలు చేయలేదని ఎత్తి చూపుతున్నాయి.సీఎంఢిల్లీ నెలనెలా ఢిల్లీకి వెళ్లడాన్ని హైలెట్‌ చేస్తున్నాయి. సోషల్‌ మీడియా ప్రభావంతో ప్రజలు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న భావనలోనే ఉంటున్నారు. ప్రతిపక్షాల సోషల్‌ ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో హస్తం పార్టీ సోషల్‌ మీడియా విఫలమవుతోంది. మరోవైపు పథకాలను కూడా సోషల్‌ మీడియా వేదికగా పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదు. మంచైనా, చెడైనా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తే క్షేత్రస్థాయికిచేరుతుంది. దీనిని గుర్తించిన బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతం చేస్తోంది. బలంగా గ్రౌండ్‌ లెవల్‌కు తీసుకెళ్తోంది.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కొన్ని మంచి పనులు చేసింది. మహిళలకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, రైతు రుణమాఫీ. ఇందులో ఫ్రీ బస్సు, రైతు రుణమాఫీ గేమ్‌ చేంజర్‌ పథకాలు. కానీ, వీటిని హస్తం నేతలు ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. దీనికి ప్రధాన కారణం నాయకత్వ లోపం, వ్యూహాత్మక తప్పిదం. ఉచిత ప్రయాణంతో నెలకు సుమారు రూ.3 కోట్ల రూపాయలు మహిళలకు మిగులుతున్నాయి. దీనిని ప్రచారం చేసుకోవడం లేదు. క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం లేదు. ఇక రుణమాఫీతో రైతులకు లక్షల మంది రైతులకు కోట్ల రూపాయల లబ్ధి కలిగింది. కానీ దీనిని కూడా సరిగా ప్రచారం చేసుకోలేకపోయింది. రూ.500 సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ కారణంగా కూడా పేద, మధ్య తరగతి ప్రజలకు భారీగా లబ్ధి కలుగుతోంది. దీనిని లెక్కలతో సహా వివరించడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఈ కారణంగా కాంగ్రెస్‌ పార్టీ వెనుకబడిపోయింది.ఇదిలా ఉంటే టీపీసీసీ రాష్ట్రంలో క్యాడర్‌ను యాక్టివ్‌ చేయడంలో విఫలమవుతోంది. బీఆర్‌ఎస్‌ ఏ కార్యక్రమం చేసిన క్షేత్రస్థాయిలో సంబురాలు నిర్వహించేది. ఇప్పటికీ ప్రతిపక్షంగా కూడా అదే చేస్తోంది. కానీ, కాంగ్రెస్‌ పార్టీ ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఎమ్మెల్యేలు, టీపీసీసీ కూడా ఈమేరకు యాక్టివ్‌ చేయడం లేదు. పార్టీ పదవులు, నామినేటెడ్‌ పదవుల భర్తీలో జాప్యం కూడా క్యాడర్‌లో నిస్తేజానికి కారణం. మరోవైపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం కారణంగా కూడా కేడర్‌ యాక్టివ్‌గా లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా టీపీసీసీ చీఫ్, సీఎం మైలేజీ రావడంలో ఎక్కడ లోపం జరుగుతుందో గుర్తిస్తారా లేదా అన్నది తదుపరి చర్యలతోనే తెలుస్తుంది.

Read more:Hyderabad:మోడీ, రాహుల్ కులాల కుంపట్లు

Related posts

Leave a Comment