Hyderabad:కవితక్కకు చెక్ పెట్టేందుకు రాములమ్మ

Ramulamma to check on Kavitha

Hyderabad:కవితక్కకు చెక్ పెట్టేందుకు రాములమ్మ:విజయశాంతిని ఏ విధానంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించారు? దీని వెనక కాంగ్రెస్ పాటించిన విధానాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. వీటిని స్వయంగా విజయశాంతే చెప్పారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి ఆమె శాసనమండలికి సోమవారం వెళ్లారు. ఆమె వెంట వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమెను మీడియా ప్రతినిధులు కలిసి పలు ప్రశ్నలు అడిగారు.

కవితక్కకు చెక్ పెట్టేందుకు రాములమ్మ..

హైదరాబాద్, మార్చి 11
విజయశాంతిని ఏ విధానంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించారు? దీని వెనక కాంగ్రెస్ పాటించిన విధానాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. వీటిని స్వయంగా విజయశాంతే చెప్పారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి ఆమె శాసనమండలికి సోమవారం వెళ్లారు. ఆమె వెంట వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమెను మీడియా ప్రతినిధులు కలిసి పలు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఆమె వాటికి స్పష్టమైన సమాధానాలు చెప్పారు..” నన్ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. శాసనమండలి లో ప్రభుత్వం తరఫున నేను మాట్లాడతాను. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. మండలిలో కవితకు సభ్యత్వం ఉంది. నాక్కూడా అందులో ఇప్పుడు సభ్యత్వం లభించింది. నేను ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చాను. నా వాణి నేను వినిపిస్తాను.. కవిత బీసీ వాదం ఎత్తుకుంటే.. బీసీనైన నన్ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. మండలిలో ప్రభుత్వంపై విమర్శలు చేసే విపక్షాలకు సరైనతీరుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై కూడా ఉంది. ఒకరకంగా కవితకు నేను ఏంటో చూపించాల్సిన అవసరం ఉందని” విజయశాంతి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

విజయశాంతిని శాసనమండలికి పంపించడానికి ప్రధాన కారణం.. కవితకు దీటైన నాయకురాలు ఉండాలని.. అందువల్లే కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని మండలికి పంపించిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో విజయశాంతి కూడా కవితకు పోటీ ఇస్తానని చెప్పడం.. నేనంటే చూపిస్తానని వ్యాఖ్యానించడం.. సంచలనం కలిగిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పై విడుదలైన అనంతరం కవిత శాసనమండలిలో బీసీ వాదం వినిపిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క మహిళ నాయకురాలు కూడా కవితకు దీటుగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విజయశాంతిని ఎమ్మెల్సీగా నియమించింది అని తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై విజయశాంతి కూడా క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి ఒక లక్ష్యంతోనే తనను ఎమ్మెల్సీ చేశారని వ్యాఖ్యానించారు. అయితే ఎమ్మెల్సీగా గెలిచారు కాబట్టి.. మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. లెట్స్ వెయిట్ అండ్ సి అని విజయశాంతి బదులు ఇచ్చారు. అంటే ఈ లెక్కన విజయశాంతి త్వరలో మంత్రి కూడా కాబోతున్నారని తెలుస్తోంది. అయితే విజయశాంతికి మంత్రిత్వ శాఖ ఇస్తే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వారు ఊరుకుంటారా? అధిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేయరా? అనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

Read more:Hyderabad:రీల్ స్టార్ గా జగ్గన్న

Related posts

Leave a Comment