Hyderabad:కంట్లో నలుసుగా మారిన తీన్మార్ మల్లన్న: కాంగ్రెస్ ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ స్వపక్షంలో విపక్షంలా మారాడు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప‍్పటి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడం, నాటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా వెలుగులోరి వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలుమార్లు తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయించింది. దీంతో ఆయన బీజేపీలో చేరారు. తర్వాత బయటకు వచ్చి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కంట్లో నలుసుగా మారిన తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, ఫిబ్రవరి 5
కాంగ్రెస్ ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ స్వపక్షంలో విపక్షంలా మారాడు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప‍్పటి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడం, నాటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా వెలుగులోరి వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలుమార్లు తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయించింది. దీంతో ఆయన బీజేపీలో చేరారు. తర్వాత బయటకు వచ్చి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్లను కాదని తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇచ్చి గెలిపించింది. కానీ, ఇప్పుడు సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. రెండు రోజుల క్రితం వరంగల్‌లో నిర్వహించిన బీసీల సభకు హాజరై రెడ్డి సమాజికవర్గంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక తాజాగా కుల గణన నివేదికను తప్పు పట్టారు. లైవ్‌లోనే కులగణన పత్రాలను తగులబెట్టారు. అంతే కాకుండా బీసి కులగణన సర్వే రిపోర్ట్ ని ఉచ్చ పోసి తగల పెట్టాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇది రెండ్లు ఆడుతున్న డ్రామా అంటు మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో కుల గణనపై ఒకవైపు సంబరాలు జరుగుతున్నాయి. తీన్మార్ మల్లన్న మాత్రం సర్వేకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న…తాజాగా కులగణనపై తీవ్ర వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.ఓ యూట్యూబ్ చానెల్‌లో లైవ్‌లో కుల గణన నివేదికపై మాట్లాడని మల‍్లన్న చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కుల గణన పూర్తిగా బోగస్ అని మండిపడ్డారు. అది జానారెడ్డి సర్వే అని హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన సర్వే వంద శాతం కరెక్ట్ అని తెలిపారు. కాంగ్రెస్ కులగణన రిపోర్టును ఉచ్చపోసి తగలబెట్టాలని దారుణంగా వా‍్యక్యానించారు. ఉచ్చపోస్తే కాలదు కాబట్టి వట్టిగా తగలబెడుతున్నానని లైవ్‌లోనే కాల్చారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలలెవరూ స్పందించలేదు. అంతా మౌనం వహిస్తున్నారు.
నాలుక మడత..
జర్నలిస్టుగా.. యూ ట్యూబ్ ఛానల్ ఓనర్ గా తీన్మార్ మల్లన్న తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం.. స్వతంత్రంగా ఎమ్మెల్సీగా పోటు చేసి.. నాటి అధికార భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి చుక్కలు చూపించాడు. ఆ తర్వాత తన ప్రయోజనాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీలో చేరాడు. కొంతకాలానికి అందులో నుంచి బయటికి వచ్చాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు. ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికీ తీన్మార్ మల్లన్న ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించలేదు. తన సొంత యూట్యూబ్ ఛానల్ లో తన వాయిస్ మాత్రమే వినిపించాడు. అవసరమైతే అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కూడా వెనుకాడడం లేదు.. ఆమధ్య కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేయడంతో.. సొంత పార్టీ నాయకులే తీన్మార్ మల్లన్న పై విరుచుకుపడ్డారు. అయినప్పటికీ తీన్మార్ మల్లన్న తన తీరు మార్చుకోలేదు. పైగా ఇటీవల నిర్వహించిన బీసీ సభలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ సామాజిక వర్గంపై కూడా తీవ్రంగా మండిపడ్డారు.. ప్రస్తుతం కొనసాగుతున్న రేవంత్ రెడ్డి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు. 2028 లో ఖచ్చితంగా బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని.. తీన్మార్ మల్లన్న స్పష్టం చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి..కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లన్న తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవాడు.
అయితే అనూహ్యంగా ప్రస్తుత ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వేను మల్లన్న విమర్శించాడు. ఆ సర్వే జరిగిన తీరు సహేతుకంగా లేదని మండిపడ్డాడు. అయితే కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి రోజుల్లో సమగ్ర సర్వేను నిర్వహించారు. ఆ సర్వే ఎలాంటి ఫలితాలు ఇచ్చిందో తెలియదు కాని.. ఆ సర్వేను నూటికి నూరు శాతం కరెక్ట్ అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. అయితే మంగళవారం నాటి మండలి సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. నాటి కెసిఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన సర్వేలో పందుల లెక్క ఎంత ఉందో చెప్పారు గానీ.. బీసీల లెక్క ఎంత ఉందో చెప్పలేదని నాలుక మడత పెట్టారు. కేవలం రోజు వ్యవధిలోనే మల్లన్న మాట మార్చడంతో సోషల్ మీడియాలో భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. మల్లన్న తీరుపై మండిపడుతున్నారు. సోమవారం ఒక మాట.. మంగళవారం మరొక మాట.. ఇలా నాలుక మడత ఎందుకు పెడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుడికి మాటమీద నిలబడే సత్తా ఉండాలని.. కానీ తీన్మార్ మల్లన్న విద్యాధికుడైనప్పటికీ ఇలా వ్యవహరించడం సరికాదని దుయపడుతున్నారు. మరి దీనిపై తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అన్నట్టు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తప్పు పట్టడం విశేషం.
ఇక తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో సమగ్ర సర్వేకు సంబంధించి వివరాలను ప్రకటించింది. ఈ జాబితాలో కులాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసింది. దానిని పార్లమెంటుకు పంపించింది. దీనిపై శాసనసభలో చర్చ జరిగింది.ఈ చర్చలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కేటీఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వే మొత్తం డొల్ల అని.. సాక్షాత్తు వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ నే దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీ జనాభా తగ్గిందని.. సర్వే చేసిన విధానం బాగోలేదని కేటీఆర్ అన్నారు.. అయితే దీనికి కౌంటర్ ఇవ్వలేక అధికార పార్టీ మల్ల గుల్లాలు పడింది.. ఇదే క్రమంలో తీన్మార్ మల్లన్న ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాడని.. సోషల్ మీడియాలో నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టాడని.. ఇప్పుడు అదే తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి కంటగింపుగా మారాడని.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. మరి దీనిపై తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. అన్నట్టు తీన్మార్ మల్లన్న బీసీ సభ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలను భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేస్తోంది. అయితే అవి పాత ఫోటోలు అని తీన్మార్ మల్లన్న టీం కౌంటర్ ఇస్తోంది.. మొత్తానికి ఇరు వర్గాల మధ్య ఆరోపణలు ప్రతీ ఆరోపణలతో సోషల్ మీడియా రచ్చ రచ్చ అవుతోంది.