Hyderabad:ఇలా చేరి.. అలా బయిటకు

Those who joined the Telangana Congress Party are unable to join. Resignation from BRS

Hyderabad:ఇలా చేరి.. అలా బయిటకు:తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ఇమడలేకపోతున్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప.. కొన్ని నెలలకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక నుంచి స్వతంత్రంగా ఉంటానని ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతకు ప్రకటించలేదు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు మద్దతుగా ఉంటానని ప్రకటించారు. గతేడాది మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కోనప్ప ఆ పార్టీలో ఇమడలేకపోయారు. కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు ఎక్కువగా ఉండటం.. తనను పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇలా చేరి.. అలా బయిటకు.. 

హైదరాబాద్, ఫిబ్రవరి 23
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ఇమడలేకపోతున్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప.. కొన్ని నెలలకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక నుంచి స్వతంత్రంగా ఉంటానని ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతకు ప్రకటించలేదు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు మద్దతుగా ఉంటానని ప్రకటించారు. గతేడాది మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కోనప్ప ఆ పార్టీలో ఇమడలేకపోయారు. కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు ఎక్కువగా ఉండటం.. తనను పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిర్పూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గం. కేవలం నంబర్లోనే కాదు.. రాజకీయంగా కూడా అదే స్థాయిలో కొనసాగుతుంటుంది. ఎప్పుడూ ఏదో వ్యవహారంతో రాష్ట్రస్థాయిలో నిలుస్తుంది. కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారం కూడా అదే స్థాయిలో వేడెక్కించింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీ వీడతానని స్పష్టం చేశారు. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. జిల్లాకు చెందిన ఓ నేత, ఎమ్మెల్సీ దండే విఠల్ ఇద్దరూ కలిసి సిర్పూరు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. కోనేరు కోనప్పను పక్కనపెట్టి మరీ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా అన్నింటిలో కోనప్ప పాత్ర నామమాత్రంగా మారింది.

ఈ వ్యవహారం నచ్చని కోనప్ప కాంగ్రెస్ వీడాలని నిర్ణయం తీసుకున్నారు.నియోజకవర్గానికి కేటాయించిన ఫ్లైఓవర్ రద్దు కావడం, గత ప్రభుత్వంలో ఆయన తీసుకువచ్చిన అభివృద్ధి పనులను సైతం పక్కన పెట్టడం కోనప్పను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని అంటున్నారు. ఇలా తన పాత్ర నామమాత్రం కావడంతో వారం రోజుల కిందట సమావేశం ఏర్పాటు చేసిన కోనేరు కోనప్ప తాను ప్రజల మనిషిని అంటూ చెప్పుకొచ్చారు. పార్టీలతో సంబంధం లేదని ప్రజల మద్దతుతో గెలుస్తున్నాని స్పష్టం చేశారు. కాంగ్రెసు దొంగల గుంపుగా విమర్శించారాయన. సిర్పూర్ కాగజ్నగర్లో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను గల్లా పట్టి నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే కోనప్ప పిలుపునిచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. స్వతంత్రంగా ఉంటానని కోనప్ప ప్రకటించారు. కోనప్ప నుంచి ఇలాంటి ప్రకటన రావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఉలిక్కిపడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పార్టీని వీడితే తీరని నష్టం జరిగే అవకాశం ఉందని గమనించిన కాంగ్రెస్ ఆయన పార్టీ వీడకుండా చర్యలు తీసుకుంది. సీఎం కార్యాలయం నుంచి కోనప్పకు ఫోన్ వచ్చింది. ముఖ్యమంత్రి కలవాలనుకుంటున్నారని శనివారం ఉదయం రావాలన్నది ఆ ఫోన్ సారంశం. సీఎంవో నుంచి ఫోన్ రావడంతో శనివారం ఉదయం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు కోనప్ప. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో ఉన్నారు. అంతా కలిసి గంటపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ఓ సారి బీఎస్పీ తరపున కూడా గెలిచిన ఆయన తర్వాత బీఆర్ఎస్ లో చేరి మరోసారి గెలిచారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీ సిర్పూర్ లో విజయం సాధించింది. బీఎస్పీ తరపున ప్రవీణ్ కుమార్ పోటీ చేయడంతో భారీగా ఓట్లు చీలి ఆయన ఓడిపోయారు. ప్రవీణ్ కుమార్ కూడా పరాజయం పాలయ్యారు. తర్వాత ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ చేరడంతో అసంతృప్తికి గురైన కోనేరు కోనప్ప.. కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ లో చేరినప్పటికీ.. తాను చెప్పిన పనులను మంజూరు చేయకపోవడంతో పాటు గతంలో నియోజకవర్గానికి తాను తీసుకువచ్చిన పనులు సైతం రద్దు చేస్తుండటంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ దండే విఠల్ సైతం ఇక్కడ రాజకీయంగా పాగా వేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప, దండే విఠల్ మధ్య ప్రచ్ఛనయుద్ధం సాగుతోంది.నిన్న మొన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న కోనేరు కోనప్ప, ఆయన అల్లుడు శ్రీనివాస్ కలిసిపోయారు. కోనప్ప రాజకీయంగా ముందుకు సాగాలని చూసినా దండే విఠల్ కు పదవి ఉండటం, కోనప్పకి అలాంటిదేమీ లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో అధిష్టానం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో ఏం చేయాలో ఆలోచనలో పడ్డారు. ఇటీవల ఓ సభలో తాను వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ నిర్ణయమైనా ప్రజల ముందే తీసుకుంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ దేవుడిలా వంతెన, రోడ్లు, అభివృద్ధి పనులు మంజూరు చేస్తే వాటిని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలోని మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోనేరు కోనప్ప తిరిగి బీఆర్ఎస్ పార్టీకి దగ్గరయ్యే అవకాశం ఉందంటూ రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఆయనకు టిక్కెట్ గ్యారంటీ ఉంటేనే ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వస్థలం సిర్ఫూర్ కాకపోయినా అక్కడి నుంచే రాజకీయం చేస్తున్నారు. ఆయనను వేరే ప్రాంతానికి పంపించి తనకు సిర్ఫూర్ ఇస్తే బీఆర్ఎస్ లో చేరుతానని ఆయన ప్రకటించే అవకాశం ఉంది. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు

Read more:Hyderabad:భానుడి ఉగ్రరూపం

Related posts

Leave a Comment