Hyderabad:ఇక ఆన్ లైన్ లోనే సీఎంఆర్ ఎఫ్ దరఖాస్తులు

CMRF applications are online

Hyderabad:ఇక ఆన్ లైన్ లోనే సీఎంఆర్ ఎఫ్ దరఖాస్తులు:తెలంగాణలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గంలోని ప్రజల తరఫున ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. చాలా మంది అనారోగ్యం, దీర్ఘకాలిక సమస్యలకు చికిత్స పొందిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఇందుకు మీసేవ కేంద్రాలు లేదా మధ్యవర్తుల చుట్టూ తిరుగుతుంటారు.

ఇక ఆన్ లైన్ లోనే సీఎంఆర్ ఎఫ్ దరఖాస్తులు

హైదరాబాద్, ఫిబ్రవరి 25
తెలంగాణలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గంలోని ప్రజల తరఫున ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. చాలా మంది అనారోగ్యం, దీర్ఘకాలిక సమస్యలకు చికిత్స పొందిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఇందుకు మీసేవ కేంద్రాలు లేదా మధ్యవర్తుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ, ఏయే పత్రాలు కావాలి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలిసి ఉంటే సులభంగా సాయం పొందవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ:
తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.
అధికారిక వెబ్‌సైట్‌: ద్వారా దరఖాస్తు చేయాలి.
కావాల్సిన డాక్యుమెంట్లు:
ఆధార్‌ కార్డ్‌: దరఖాస్తుదారుడి ఆధార్‌ కార్డ్‌ కాపీ (తప్పనిసరి).
ఫొటో: దరఖాస్తుదారుడి ఇటీవలి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో.
ఆదాయ ధ్రువీకరణ పత్రం: ఒరిజినల్‌ ఇ–ఆదాయ సర్టిఫికేట్‌ లేదా తక్కువ ఆదాయం ఉన్నవారికి అర్హత ఉంటుంది.
బ్యాంక్‌ ఖాతా వివరాలు: దరఖాస్తుదారుడి బ్యాంక్‌ ఖాతా నంబర్, IFSC కోడ్, బ్యాంక్‌ పేరు (సహాయం నేరుగా ఖాతాకు జమ చేయబడుతుంది).
వైద్య బిల్లులు (వైద్య సహాయం కోసం అయితే):
ఒరిజినల్‌ మెడికల్‌ బిల్లులు లేదా ఆసుపత్రి నుంచి చికిత్సకు సంబంధించిన ఎస్టిమేట్‌.
డిశ్చార్జ్‌ సమ్మరీ (చికిత్స పూర్తయిన తర్వాత).
ఆధార్ కార్డ్‌ లేదా రేషన్‌ కార్డ్‌: కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉందని రుజువు చేయడానికి (ఐచ్ఛికం, కానీ అవసరమైతే అడగవచ్చు).
వైద్య సంబంధిత సర్టిఫికేట్‌: ప్రభుత్వ ఆసుపత్రి లేదా గుర్తింపు పొందిన ఆసుపత్రి నుంచి వైద్య సమస్యను వివరించే సర్టిఫికేట్‌.
ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ సిఫారసు లేఖ (ఐచ్ఛికం): కొన్ని సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ నుంచి సిఫారసు లేఖ కావాల్సి ఉంటుంది.
అర్హత ప్రమాణాలు:
దరఖాస్తుదారుడు తెలంగాణ వాసి అయి ఉండాలి.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు (ఆ్కఔ) లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు (వైద్యం, ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు వంటివి).
వైద్య సహాయం కోసం అయితే, క్యాన్సర్, గుండె శస్త్రచికిత్స, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ వంటి పెద్ద వ్యాధులకు పరిమితం.

Read more:Mahbub Nagar:రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్

Related posts

Leave a Comment