Hyderabad:ఆపరేషన్ రోబో పైనే ఆశలు:ఎస్ ఎల్ బీసీ టన్నెల్‌లో 18వ రోజు రెస్క్యూ టీం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కేరళ నుంచి రప్పించిన నీలో నైస్ జాతి డాగ్స్ సహకారంతో ఒకరి మృతదేహాన్ని గుర్తించగా.. సోమవారం ఉదయం నుంచి 157 మంది సభ్యులు, సాంకేతిక నిపుణులు, రెండు డాగ్స్ టెన్నల్‌లో వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణ కావడంతో సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యాయి.
ఆపరేషన్ రోబో పైనే ఆశలు
హైదరాబాద్, మహబూబ్ నగర్, మార్చి 13
ఎస్ ఎల్ బీసీ టన్నెల్‌లో 18వ రోజు రెస్క్యూ టీం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కేరళ నుంచి రప్పించిన నీలో నైస్ జాతి డాగ్స్ సహకారంతో ఒకరి మృతదేహాన్ని గుర్తించగా.. సోమవారం ఉదయం నుంచి 157 మంది సభ్యులు, సాంకేతిక నిపుణులు, రెండు డాగ్స్ టెన్నల్‌లో వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణ కావడంతో సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యాయి. 13.20 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. సహాయక చర్యలు స్పీడప్ చేయడానికి ఇవాళ రోబోలను కూడా రంగంలోకి దించనున్నారు. దీంతో మృతదేహాలను గుర్తించడం ఈజీ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. సిస్మాలజి, జియాలజీ బృందాలతో అన్వేషణ జరుగుతోంది. మొత్తం 150 మంది కార్మికులు నాలుగు బృందాలు షిఫ్టుల వైజ్‌గా పని చేస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గుర్‌ప్రీత్ సింగ్ మృతదేహం ఆదివారం లభ్యమైంది. అదే ప్రదేశంలో మరికొందరి ఆచూకీ దొరకవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకే అక్కడే తవ్వకాలు జరుపుతున్నారు. టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో ఇప్పుడా ప్రాంతమంతా రాళ్లు, మట్టి, టీబీఎం శకలాలతో నిండిపోయింది. అక్కడే దాదాపు 17 రోజులుగా 12 రకాల ఏజెన్సీలు, నిపుణులు సహాయక చర్యలు చేపడుతున్నారు.టన్నెల్‌లో 13.85 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరిగింది. దీంతో.. 11వ కిలో మీటర్ వరకు నీరు, బురద పేరుకుపోయాయి.
దీంతో 11వ కిలోమీటర్ వరకు మాత్రమే లోకో ట్రైన్ వెళ్లేది. అయితే.. పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి ప్రస్తుతం 13.20 కిలోమీటర్ల వరకు వెళ్లేలా లైన్ క్లియర్ చేశారు. ఇప్పుడు 13.20 కిలోమీటర్ల నుంచి 13.85 కిలోమీటర్ల మధ్య ముమ్మరంగా పనులు చేస్తున్నారు. 4 నుంచి 9 మీటర్ల మేర మట్టిదిబ్బలు పేరుకుపోయాయి.సొరంగంలో నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తోంది. ఆ నీటిని తోడటానికి ప్రతి రెండున్నర కిలోమీటర్లకు ఒక పంపింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఇవాళ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి టన్నెల్ దగ్గర అధికారంతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.డిజాస్టర్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ , సోమవారం SLBC టన్నెల్ ఆఫీసులో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే, కేరళకు చెందిన కడావర్ డాగ్స్ స్క్వాడ్, సహాయక చర్యల్లో పాల్గొంటున్న విభాగాల అధికారులు హాజరయ్యారు.
కాగా కొద్ది రోజుల క్రితం పంజాబ్ కు చెందిన గురు ప్రీత్ సింగ్ మృతదేహం లభ్యంమైంది. మరో రెండు చోట్ల తొమ్మిది మీటర్లకు పైగా న్న తవ్వకాలు చేస్తున్నారచు. నాలుగు షిఫ్టులుగా 150 మంది రక్షణ దళాలతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. రేపటిలోగా మరొక మృతదేహం గుర్తించే అవకాశం. ఉంది. టన్నెల్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దగ్గరికి వెళ్లనున్నారు. ఎన్జీఆర్ఐ , జియాలజీ, రోబోటిక్ బృందం సభ్యులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో మరణించిన పంజాబ్ కు చెందిన టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మరణం పట్ల పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గురుప్రీత్ మరణించడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గురుప్రీత్ కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించామని చెప్పారు. నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని తెలిపారు. మిగతా కార్మికుల ఆనవాళ్ల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
Read more:Hyderabad:క్యాబినెట్‌లోకి రాములమ్మ